STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Monday 22nd October 2018
Markets_main1540179368.png-21335

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 70 పాయింట్ల నష్టంతో 22,462 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 8 పాయింట్ల లాభంతో 3,071 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 2 పాయిం‍ట్ల లాభంతో 9,920 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ ఏకంగా 97 పాయింట్ల లాభంతో 2,647 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 1 పాయింటు నష్టంతో 2,155 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 476 పాయింట్ల లాభంతో 26,038 పాయింట్ల వద్ద ఉన్నాయి.  

♦ అమెరికా మార్కెట్‌ శుక్రవారం దాదాపుగా నష్టాల్లోనే ముగిసింది. ఇండెక్స్‌లు ప్రారంభ లాభాలను చివరి వరకు నిలుపుకోలేకపోయాయి. డౌజోన్స్‌ లాభాల్లో ముగిస్తే.. మిగతా రెండు ప్రధాన ఇండెక్స్‌లు నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.3 శాతం లేదా 65 పాయిం‍ట్ల లాభంతో 25,444 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ షేరు 8.8 శాతం పెరగడం సానుకూల ప్రభావం చూపింది. 2008 అక్టోబర్‌ 28 నుంచి చూస్తే ఈ స్టాక్‌ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. కంపెనీ ఎర్నింగ్స్‌ అంచనాలు మించి ఉండటం ఈ పెరుగుదలకు కారణం. ఎస్‌అండ్‌పీ 500.. 0.04 శాతం లేదా 1 పాయింటు నష్టంతో 2,767 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.48 శాతం లేదా 36 పాయింట్ల నష్టంతో 7,449 పాయింట్ల వద్ద ముగిసింది. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ షేర్లు తగ్గుదల ప్రతికూల ప్రభావం చూపింది. వారం మొత్తంగా చూస్తే డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.4 శాతం పెరిగింది. ఈ ఇండెక్స్‌ గత మూడు వారాలుగా పడుతూనే వచ్చింది. ఇక నాస్‌డాక్‌ 0.6 శాతం నష్టపోయింది. 

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. 

♦ క్రూడ్‌ ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. సరఫరా ఆందోళనలు ప్రభావం చూపాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 79.74 డాలర్ల వద్ద ఉంది. ఇక అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 69.07 డాలర్ల వద్ద ఉంది. 

♦ దేశీ ఫారెక్స్‌ నిల్వలు అక్టోబర్‌ 12తో ముగిసిన వారంలో 5.143 బిలియన్‌ డాలర్ల తగ్గుదలతో 394.46 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఒకేసారి ఈ స్థాయిల్లో ఫారెక్స్‌ నిల్వలు తగ్గడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి.  

♦ రూపాయి శుక్రవారం బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 29 పైసలు లాభంతో 73.32 వద్ద ముగిసింది. 

♦ విదేశీ ఇన్వెస్టర్లు ప్రస్తుత నెల తొలి మూడు వారాల్లో దాదాపు రూ.32,000 కోట్లుమేర నిధులను ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి వెనక్కు తీసుకెళ్లారు.  

♦ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ2 నికర లాభం 20 శాతం వృద్ధితో రూ.5,005 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయం, నిర్వహణ ఆదాయం పెరుగుదల ఇందుకు ‍కారణం.

♦ బ్యాంక్‌ స్టాక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ హోల్డింగ్స్‌ సెప్టెంబర్‌ నెలలో మూడు నెలల కనిష్ట స్థాయి రూ.1.88 లక్షల కోట్లకు తగ్గాయి.  

♦ దాదాపు 38 కంపెనీలు సోమవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. జాబితాలో ఏసియన్‌ పెయింట్స్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, హిందుస్తాన్‌ జింక్‌, ఓబెరియో రియల్టీ, హెచ్‌ఓఈసీ, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ ఫార్మా వంటి కంపెనీలున్నాయి.  



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 22nd October 2018

సెన్సెక్స్‌ 370 పాయింట్లుకుపైగా జంప్‌ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 10,400కుపైన ప్రారంభం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,315 పాయింట్లతో పోలిస్తే 374 పాయింట్ల లాభంతో 34,689 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,303 పాయింట్లతో పోలిస్తే 102 పాయింట్ల లాభంతో 10,405 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. అయితే వెంటనే ఇండెక్స్‌ లాభాలు

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Monday 22nd October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:46 సమయంలో 22 పాయింట్ల లాభంతో 10,347 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,303 పాయింట్లతో పోలిస్తే 44 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category