STOCKS

News


మార్కెట్‌ పయనం ఎటు?

Monday 17th September 2018
Markets_main1537156224.png-20301

శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన నిఫ్టీ తర్వాత అదే జోరు కొనసాగించింది. 11,500 మార్క్‌ పైకి వెళ్లింది. డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్స్‌లో బుల్లిష్‌ క్యాండిల్‌ను, వీక్లి చార్ట్స్‌లో హ్యామర్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. నిఫ్టీ ఇండెక్స్‌ 145 పాయింట్ల లాభంతో (1.28 శాతం) 11,515 వద్ద ముగిసింది. అయితే వారం పరంగా చూస్తే 0.6 శాతంమేర క్షీణించింది. 
ఇండియా వీఐఎక్స్‌ 3.24 శాతం తగ్గుదలతో 13.78కి క్షీణించింది. ఈ తగ్గుదల మార్కెట్‌లో కొంత స్థిరత్వాన్ని సూచిస్తోంది. 
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,456, 11,396 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 11,548, 11,582 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు.
బ్యాంక్‌ నిఫ్టీ 344 పాయింట్ల లాభంతో 27,163 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 27,033, 26,903 కీలక మద్దతు స్థాయిలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 27,249, 27,335 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్‌ ఇండెక్స్‌ లాభాల్లో.. నాస్‌డాక్‌ మాత్రం నష్టాల్లోనే క్లోజయ్యింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 9 పాయిం‍ట్ల లాభంతో 26,155 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 1 పాయింటు లాభంతో 2,904 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4 పాయింట్ల నష్టంతో 8,010 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనా దిగుమతులపై 200 బిలియన్‌ డాలర్ల టారిఫ్‌లను విధిస్తామని మరోమారు స్పష్టం చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. 
♦ ఒక్క జపాన్‌ మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 273 పాయింట్ల లాభంతో 23,095 పాయింట్ల వద్ద ఉంది. ఇక దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 18 పాయింట్ల నష్టంతో 2,300 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 459 పాయింట్ల నష్టంతో 26,826 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 17 పాయింట్ల నష్టంతో 3,144 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 36 పాయిం‍ట్ల నష్టంతో 10,832 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 22 పాయింట్ల నష్టంతో 2,659 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. చైనా దిగుమతులపై అమెరికా కొత్త టారిఫ్‌ల భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి.  
♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ సూచిస్తోంది. 
♦ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనా నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే 200 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రొడక్టులపై సోమవారం టారిఫ్‌లు విధిస్తారనే అంచనాలున్నాయి. 
♦ కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యం 3.3 శాతానికి కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. 
♦ క్రూడ్‌ ధరలు సోమవారం తగ్గాయి. 
♦ 2020లో ఆర్థిక సంక్షోభం రావొచ్చని జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది.
♦ విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి రూ.9,400 కోట్లు వెనక్కు తీసుకున్నారు. 
♦ క్యాడ్‌ తగ్గుదలకు, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు కేంద్రం పలు చర్యలను ఆవిష్కరించింది.
♦ ఆర్‌బీఐ రూ.10,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. 
♦ ఫారెక్స్‌ నిల్వలు సెప్టెంబర్‌ 7తో ముగిసిన వారంలో 819 మిలియన్‌ డాలర్ల తగ్గుదలతో 399.28 బిలియన్‌ డాలర్లకు క్షీణించాయి. గత ఏడాది కాలంలో తొలిసారి 400 బిలయన్‌ డాలర్లకు పడిపోయాయి.
♦ రూపాయి శుక్రవారం 34 పైసలు బలపడి 71.84 వద్ద ముగిసింది.
♦ ఇర్కాన్‌ ఐపీవో సోమవారం ప్రారంభం కానుంది.  



You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 17th September 2018

11,500 దిగువన నిఫ్టీ 38,000 మార్క్‌ కిందకు సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,090 పాయింట్లతో పోలిస్తే 63 పాయింట్ల నష్టంతో 38,027 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,515 పాయింట్లతో పోలిస్తే 51 పాయింట్ల నష్టంతో 11,464 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం పెరిగే కొద్ది ఇండెక్స్‌ల నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:30 సమయంలో నిఫ్టీ

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Monday 17th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:50 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 54 పాయింట్ల నష్టంతో 11,493 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11,547 పాయింట్లతో పోలిస్తే 54 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క జపాన్‌ మినహా మిగతా ఆసియా ప్రధాన

Most from this category