STOCKS

News


మార్కెట్‌పై వీటి ప్రభావం!!

Friday 16th November 2018
Markets_main1542339151.png-22060

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

► అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.83 శాతం లేదా 209 పాయిం‍ట్ల లాభంతో 25,289 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.06 శాతం లేదా 29 పాయింట్ల లాభంతో 2,730 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 1.72 శాతం లేదా 123 పాయింట్ల లాభంతో 7,259 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సమసిపోతాయనే అంచనాలతో ఇండెక్స్‌లు పెరిగాయి. అమెరికా.. చైనా దిగుమతులపై మళ్లీ టారిఫ్‌లను విధించకపోవచ్చనే వార్తలు ఇందుకు కారణం. ఇండెక్స్‌ ఐదు రోజుల నష్టాలకు గురువారం తెరపడింది. యాపిల్‌ షేర్లు 2.5 శాతం పెరిగాయి. దీంతో ఎస్‌అండ్‌పీ 500లో టెక్నాలజీ ఇండెక్స్‌ ఎక్కువగా లాభపడింది. 

► ఒక్క సింగపూర్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 21 పాయింట్ల లాభంతో 3,075 పాయింట్ల వద్ద ఉంది. ఇక తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 12 పాయింట్ల నష్టంతో 9,815 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల నష్టంతో 2,662 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 1 పాయింటు నష్టంతో 2,087 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 178 పాయింట్ల నష్టంతో 25,925 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 113 పాయింట్ల నష్టంతో 21,690 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

► ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:37 సమయంలో 42 పాయింట్ల లాభంతో 10,663 పాయింట్ల వద్ద ఉంది. 

► క్రూడ్‌ ధరలు శుక్రవారం నిలకడగా ఉన్నాయి. ఒపెక్‌ దేశాల నుంచి ఆయిల్‌ ఉత్పత్తి తగ్గొచ్చనే అంచనాలున్నా.. అమెరికాలో ఉత్పత్తి పెరగడం ఇందుకు కారణం. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 56.5 డాలర్ల వద్ద ఉంది. ఇక బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 66.69 డాలర్లకు పెరిగింది. 

► రూపాయి రెండు నెలల గరిష్ట స్థాయికి ర్యాలీ చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే గురువారం 34 పైసల లాభంతో 71.97 వద్ద ముగిసింది. 

► వాణిజ్య లోటు అక్టోబర్‌లో 17.13 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఎగుమతులు 17.86 శాతం వృద్ధితో 26.98 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అదేసమయంలో దిగుమతులు 17.62 శాతం వృద్ధితో 44.11 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. 2017 అక్టోబర్‌లో వాణిజ్య లోటు 14.61 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

► ఫిచ్‌.. భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను స్థిరంగా ‘బీబీబీ-’ కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 

► బంగారం దిగుమతులు అక్టోబర్‌లో 43 శాతం క్షీణతతో 1.68 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 16th November 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాల్లో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,616 పాయింట్లతో పోలిస్తే 28 పాయింట్ల లాభంతో 10,644 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,260 పాయింట్లతో పోలిస్తే 138 పాయింట్ల లాభంతో 35,398 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగియడం, ఒక్క సింగపూర్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Friday 16th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:37 సమయంలో 42 పాయింట్ల లాభంతో 10,663 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,630 పాయింట్లతో పోలిస్తే 33 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Most from this category