News


మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Friday 14th September 2018
Markets_main1536897529.png-20244

బుధవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన నిఫ్టీ తర్వాత మార్నింగ్‌ సెషన్‌లో కరెక‌్షన్‌ అయ్యింది. అయితే మళ్లీ షార్ట్‌ కవరింగ్‌ వల్ల పుంజుకుంది.
నిఫ్టీ ఇండెక్స్‌ 11,340 వద్ద ప​ఆరంభమైంది. ఇంట్రాడేలో 11,250 కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత 11,380కి పెరిగింది. చివరకు 82 పాయింట్ల లాభంతో 11,369 వద్ద ముగిసింది. 
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,286, 11,203 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 11,417, 11,464 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు.
బ్యాంక్‌ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 26,819 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 26,617, 26,416 కీలక మద్దతు స్థాయిలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 26,957, 27,096 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 147 పాయిం‍ట్ల లాభంతో 26,145 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 15 పాయింట్ల లాభంతో 2,904 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 59 పాయింట్ల లాభంతో 8,013 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. యాపిల్‌ షేరు 2.4 శాతం పెరగడం, అమెరికాతో చైనా కొత్త వాణిజ్య చర్చలకు అంగీకారం తెలపడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపింది. ఎస్‌అండ్‌పీ టెక్నాలజీ ఇండెక్స్‌ 1.2 శాతంమేర పెరిగింది. ఒక్క రోజులో ఇంత ఎక్కువగా పెరగడం ఆగస్ట్‌ 2 నుంచి ఇదే తొలిసారి. యాపిల్‌ షేరు ఎగయడం ఇందుకు కారణం. 
♦ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 221 పాయింట్ల లాభంతో 23,042 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 29 పాయింట్ల లాభంతో 2,315 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 181 పాయింట్ల లాభంతో 27,195 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 19 పాయింటు లాభంతో 3,151 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 103 పాయిం‍ట్ల లాభంతో 10,830 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అయితే  చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల నష్టంతో 2,681 పాయింట్ల వద్ద ఉంది.  
♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦ఐఐపీ జూలైలో 6.6 శాతంగా నమోదయ్యింది. జూన్‌తో (6.9 శాతం) పోలిస్తే స్వల్పంగా తగ్గింది. 
♦రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో పది నెలల కనిష్ట స్థాయి 3.69 శాతంగా నమోదయ్యింది. 
♦రూపాయి బుధవారం 72.91 స్థాయి నుంచి రికవరీ అయ్యి 72.19 వద్ద ముగిసింది.  
♦యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ పాలసీ మీటింగ్‌లో తటస్థంగా వ్యవహరించింది. 
♦అమెరికాలో వీక్లి జాబ్‌లెస్‌ క్లెయిమ్స్‌ 49 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయి. ఇది బలమైన లేబర్‌ మార్కెట్‌ను సూచిస్తోంది.
♦ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్లు ఆగస్ట్‌లో 1.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 
♦కమోడిటీ మార్కెట్లలోకి విదేశీ సంస్థలను అనుమతిచేందుకు సెబీ ఒప్పుకోవచ్చనే అంచనాలున్నాయి. 
♦ఒపెక్‌ గ్రూప్‌ 2019 ఆయిల్‌ డిమాండ్‌ వృద్ధి నెమ్మదించొచ్చని అంచనా వేసింది. 
♦ఎగుమతులు ఆగస్ట్‌లో 19 శాతంమేర పెరిగాయి. వాణిజ్య లోటు 17.4 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.
♦ఎన్‌ఎస్‌ఈఎల్‌ కేసుకు సంబంధించి దాదాపు 100కుపైగా బ్రోకరేజ్‌ సంస్థలపై సెబీ నిఘా ఉంచింది.
♦శ్రీ బజ్‌రంగ్‌ పవర్‌ అండ్‌ ఇస్పాత్‌ ఐపీవోకు రానుంది. You may be interested

గ్యాప్‌అప్‌తో స్టార్ట్‌..

Friday 14th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,717 పాయింట్లతో పోలిస్తే 222 పాయింట్ల లాభంతో 37,939 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,369 పాయింట్లతో పోలిస్తే 74 పాయింట్ల లాభంతో 11,443 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లో ట్రేడవుతుండటం, పారిశ్రామికోత్పత్తి జూలైలో 6.6 శాతంగా

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Friday 14th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:52 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 41 పాయింట్ల లాభంతో 11,486 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 11,417 పాయింట్లతో పోలిస్తే 69 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ

Most from this category