STOCKS

News


మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Monday 5th November 2018
Markets_main1541389792.png-21692

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. 

♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.43 శాతం లేదా 110 పాయిం‍ట్ల నష్టంతో 25,270 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.63 శాతం లేదా 17 పాయింట్ల నష్టంతో 2,723 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 1.04 శాతం లేదా 77 పాయింట్ల నష్టంతో 7,356 పాయింట్ల వద్ద ముగిసింది. యాపిల్‌ మార్కెట్‌క్యాప్‌ 1 ట్రిలియన్‌ డాలర్ల కిందకు పడిపోవడంతో షేరు 6.6 శాతం క్షీణించింది. దీంతోపాటు కంపెనీ ఈ క్వార్టర్‌లో అమ్మకాలు అంచనాలను అందుకోలేపోవచ్చని పేర్కొనడం నెగటివ్‌ ప్రభావం చూపింది.

♦ అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. అయితే జపాన్‌ నికాయ్‌ 225 మార్కెట్‌కు సోమవారం సెలవు. ఇది శుక్రవారం 258 పాయింట్ల నష్టంతో 21,985 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సోమవారం రోజు.. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 47 పాయింట్ల నష్టంతో 3,068 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 84 పాయిం‍ట్ల నష్టంతో 9,822 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 19 పాయింట్ల నష్టంతో 2,657 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 34 పాయింట్ల నష్టంతో 2,061 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 603 పాయింట్ల నష్టంతో 25,882 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. అమెరికా మధ్యంతర ఎన్నికలు, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:50 సమయంలో 57 పాయింట్ల నష్టంతో 10,531 పాయింట్ల వద్ద ఉంది. 

♦ ఇరాన్‌పై 2015 న్యూక్లియర్‌ డీల్‌ కింద ఎత్తివేసిన ఆంక్షలన్నింటినీ తిరిగి విధిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఇవి నవంబర్‌ 5 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. షిప్పింగ్‌, ఫైనాన్షియల్‌, ఎనర్జీ రంగాలపై ఈ ఆంక్షలున్నాయి. 

♦ చర్చలు సత్ఫలితాలు అందించొచ్చని, వాణిజ్యానికి సంబంధించి చైనాతో డీల్‌ కుదుర్చుకునే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. అలాగే చైనా ప్రొడక్టులపై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. 

♦ ఇరాన్‌పై ఆంక్షలకు సంబంధించి ఎనిమిది దేశాలకు మినహాయింపు ఇచ్చింది అమెరికా. ఇందులో భారత్‌ కూడా ఒకటి. 

♦ క్రూడ్‌ ధరలు సోమవారం తగ్గాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అమల్లోకి రావడం ఇందుకు కారణం. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 72.53 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక అమెరికా  డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 62.87 డాలర్ల వద్ద ఉంది. 

♦ వచ్చే మూడు నెలల కాలంలో రూపాయి విలువ 76 స్థాయికి చేరొచ్చని యూబీఎస్‌ అంచనా వేస్తోంది. క్రూడ్‌ ధరల పెరుగుదలను ఇందుకు కారణంగా పేర్కొంది. 

♦ రూపాయి శుక్రవారం ఏకంగా 100 పైసలు బలపడింది. ఒక్క రోజులో ఈ స్థాయిలో లాభపడటం ఇదే ప్రథమం. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం 72.45 వద్ద ముగిసింది.  

♦ దేశీ ఫారెక్స్‌ నిల్వలు అక్టోబర్‌ 26తో ముగిసిన వారంలో 1.44 బిలియన్‌ డాలర్ల తగ్గుదలతో 392.07 బిలియన్‌ డాలర్లకు క్షీణించాయి.  

♦ విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ గత నెలలో రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఎఫ్‌పీఐలు ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి అక్టోబర్‌లో రూ.38,900 కోట్లను వెనక్కు తీసుకున్నారు. 

♦ దాదాపు 205 కంపెనీలు సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను సోమవారం వెల్లడించనున్నాయి. ఇందులో ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌, అతుల్‌ ఆటో, బాష్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఐనాక్స్‌ విండ్‌, ఓరియెంట్‌ సిమెంట్స్‌ వంటి కంపెనీలున్నాయి. 

♦ ప్రభుత్వ బ్యాంకులకు మరో రూ.54,000 కోట్లు అందించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. దీనికి సంబంధించి ఈ నెలలోనే కేంద్ర ఆర్థిక శాఖ ఒక నిర్ణయం తీసుకోనుంది. 

♦ ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారి (డిఫాల్టర్లు) బైటపెట్టే విషయంపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించకపోవడం మీద వివరణనివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పటేల్‌పై గరిష్ట పెనాల్టీ ఎందుకు విధించరాదో వివరించాలని సూచించింది. You may be interested

ప్రారంభంలో ఫ్లాట్‌.. వెంటనే నష్టాల్లోకి..

Monday 5th November 2018

35,000 మార్క్‌ దిగువున సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,553 పాయింట్లతో పోలిస్తే 5 పాయింట్ల లాభంతో 10,558 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,011 పాయింట్లతో పోలిస్తే 107 పాయింట్ల లాభంతో 35,118 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:33 సమయంలో సెన్సెక్స్‌ 77 పాయింట్ల నష్టంతో

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Monday 5th November 2018

అమెరికా మధ్యంతర ఎన్నికలు, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:50 సమయంలో 57 పాయింట్ల నష్టంతో 10,531 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,577 పాయింట్లతో పోలిస్తే 46 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Most from this category