STOCKS

News


అమెరికా మార్కెట్ల రీ-బౌన్స్‌

Saturday 5th January 2019
Markets_main1546664895.png-23419

అమెరికా మార్కెట్లు శుక్రవారం రాత్రి భారీ లాభాలతో ముగిశాయి. డిసెంబర్‌లో నిరుద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడం, వడ్డీరేట్లపై ఫెడ్‌రిజర్వ్‌ ఛైర్మన్‌ సానుకూల వాఖ్యలు, వచ్చే వారంలో అమెరికా - చైనా దేశాల మధ్య జరగున్న వాణిజ్య చర్చలు అమెరికా మార్కెట్ల సెంటిమెంట్‌కు కలిసొచ్చాయి. ఫలితంగా ఎస్‌&పీ 3.50శాతం లాభపడి 2,531 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 4శాతం పెరిగి 6,738 వద్ద, డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 3.30శాతం ర్యాలీ చేసి 23,433.16 వద్ద ముగిశాయి. అమెరికా మార్కెట్లు గత రెండువారాల్లో ఇంతస్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం.
3 లక్షల ఉద్యోగాల సృష్టి:-
అమెరికాలో గత డిసెంబర్‌లో కొత్తగా సుమారు 3లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు అధికారిక నివేదిక వెల్లడించింది. దేశంతో నిరుద్యోగిత రేటు 3.9శాతంగానూ, వ్యవసాయేతర రంగాల్లో కొత్తగా 3.12 లక్షల ఉద్యోగాలు వచ్చాయని బ్యూరో ఆఫ్‌ స్టాటిసిక్స్‌ తన నెలవారీ నివేదికలో పేర్కోంది. అమెరికా తొలిసారిగా 150 మిలియన్‌ జాజ్‌ మార్కును అందుకుందని ఈ దేశ కార్మిక శాఖ మంత్రి అలెగ్జాండర్‌ వెల్లడించారు.
వడ్డీరేట్లపై పావెల్‌ సానుకూల వాఖ్యలు:-
గతేడాది వరుసగా మూడుసార్లు వడ్డీరేట్లను ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ఈ ఏడాది వడ్డీరేట్లపై మెతక వైఖరికి సంకేతాలిచ్చారు. అందుకు అనుగుణంగా గురువారం వాషింగ్టన్‌ డీసీలో జరిగిన ఎనామిక్స్‌ క్లబ్‌లో పావెల్‌ వడ్డీరేట్లపై స్పందిస్తూ ‘‘పరిస్థితులకు అనుగుణంగా ఫెడ్‌ రిజర్వ్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ అవసరాన్ని బట్టి వడ్డీరేట్లపై సహనం వహిస్తుంది’’ అని వాఖ్యానించారు.
వచ్చేవారంలో వాణిజ్య చర్చలు:-
అమెరికా ప్రతినిధి బృందం వచ్చే వారం చైనాలో పర్యటించనుంది. వాణిజ్య యుద్దాన్ని తాత్కాలికంగా విరమించడానికి ఇరు దేశాల అధ్యక్షులు అంగీకరించడంతో ముఖాముఖి చర్చలకు గానూ మొదటిసారిగా ఈ బృందం బీజింగ్‌ వస్తోంది. అమెరికా వాణిజ్య డిప్యూటీ ప్రతినిధి జెఫరీ గెరిష్‌ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారు. మార్చి 1 నాటికి వాణిజ్య ఉద్రిక్తతలను సడలించేందుకు ఇరు పక్షాలు కృషి చేస్తున్నాయి.



You may be interested

పసిడిలో లాభాలో స్వీకరణ

Saturday 5th January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 7నెలల గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణకు లోనైంది. ఆర్థిక వృద్ధి మందగమనతో పలు ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థితరతో  పసిడి ధర క్రితం ట్రేడింగ్‌లో 7నెలల గరిష్టాన్ని(1300డాలర్లు)తాకిన సంగతి తెలిసిందే. అమెరికా నిరుద్యోగాల గణాంకాలు విశ్లేషకుల అంచనాలను మించి రెట్టింపు నమోదుకావడంతో రాత్రి అమెరికా ఈక్విటీ మార్కెట్లు 3శాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ కీలక వడ్డీరేట్లపై మెతక వైఖరీ

రాబడులు పంచాలంటే... ఫండ్స్‌కు అయినా తెలివి ఉండాలె!

Friday 4th January 2019

గతేడాది మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఓ పాఠం వంటిది. దాదాపు అధిక శాతం పథకాలు రాబడులను పంచడంలో విఫలమయ్యాయి. కానీ, కొన్ని మాత్రం లాభాలను పంచాయి. ఎందుకని...? వాటికే ఆ ప్రత్యేకత ఎందుకు సాధ్యమైంది...? అందుకు ఫండ్‌ మేనేజర్లు ఏం చేశారో తెలుసుకోవాల్సిందే.   గతేడాది కొన్ని మల్టీక్యాప్‌ ఫండ్స్‌ సూచీలకు మించి రాబడులను అందించాయి. బ్యాంకింగ్‌, ఐటీ స్టాక్స్‌లో పెట్టుబడులే ఈ రాబడులకు కారణం. ఈ ఫండ్స్‌ బ్యాంకింగ్‌,

Most from this category