STOCKS

News


కేంద్రం ప్రకటనతో సూచీలు టర్న్‌ఎరౌండ్‌

Wednesday 31st October 2018
Markets_main1540973839.png-21612

ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్న సమయంలో చేసిన ప్రకటనతో స్టాక్‌ సూచీలు వేగంగా కోలుకున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్ల పెరుగుదలతో 34,140 పాయింట్ల వద్దకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 85 పాయింట్లు ర్యాలీ జరిపి 10,283 పాయింట్ల వద్దకు చేరాయి. కే ంద్ర ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి తీవ్ర విబేధాలు తలెత్తాయని వచ్చిన వార్తలతో బుధవారం ఉదయం 10–11 గంటల సమయంలో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. ఈ సమయంలో సెన్సెక్స్‌ 250 పాయింట్లకుపైగా పతనమై 33,600 పాయింట్ల సమీపానికి చేరగా, నిఫ్టీ 90 పాయింట్లకుపైగా కోల్పోయి 10,105 పాయింట్ల వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. 
 



You may be interested

మార్కెట్‌కు ఎన్నికల ఫలితాలు కీలకం..!

Wednesday 31st October 2018

- డిసెంబర్‌ మొదటి వారం సూచీలకు అత్యంత కీలక సమయం - మార్కెట్‌ ఒడిదుడుకులపై మోర్గన్‌ స్టాన్లీ ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ రిధమ్ దేశాయ్ వ్యాఖ్య ముంబై: లోక్‌ సభ ఎన్నికల వేడి అంతటా తగలడానికి ఇంకా సమయం ఉందని.. అసలు సిసలైన తీవ్ర ఒడిదుడుకులు త్వరలోనే నమోదుకాబోతున్నాయని మోర్గన్‌ స్టాన్లీ ఇండియా ఈక్విటీ రీసెర్చ్ హెడ్, స్ట్రాటజిస్ట్ రిధమ్ దేశాయ్ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉంటాయనే అంశంపై ఇప్పటివరకు అయితే

టెక్‌ మహీంద్రా లాభం రూ.1064 కోట్లు

Wednesday 31st October 2018

27 శాతం వృద్ధి కలసివచ్చిన రూపాయి పతనం 13 శాతం వృద్ధితో రూ.8,630 కోట్లకు ఆదాయం న్యూఢిల్లీ: టెక్‌ మహీంద్రా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,064 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.836 కోట్లు నికర లాభం వచ్చిందని, 27 శాతం వృద్ధి సాధించామని టెక్‌ మహీంద్రా తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 19 శాతం పెరిగింది. రూపాయి పతనం

Most from this category