News


ఆరు నెలల కోసం పది సిఫార్సులు

Monday 8th October 2018
Markets_main1539012240.png-20931

వచ్చే ఆరేడు నెలల కాలంలో దాదాపు 30 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి.
చార్ట్‌వ్యూ ఇండియా రికమండేషన్లు
1. అశోక్‌ లేలాండ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 12. స్టాప్‌లాస్‌ రూ. 103. కొన్నిరోజులుగా ప్రధాన సూచీలు బాగా పతనమవుతున్నా, ఈ షేరు మాత్రం స్వల్ప క్షీణతనే నమోదు చేస్తోంది. మానిటరీ పాలసీలో రేట్లు పెంచకపోవడం పాజిటివ్‌ అంశం. రూ. 110 పైన స్థిరంగా కదలాడితే కొనుగోలుకు అవకాశం. 
2. బజాజ్‌ ఆటో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2940. స్టాప్‌లాస్‌ రూ. 2528. నాలుగువారాలుగా పాజిటివ్‌ కదలికలనే నమోదు చేస్తోంది. రూ. 2600 వద్ద గట్టి మద్దతు పొందింది. ఈ స్థాయికి పైన కొనుగోళ్లను పరిశీలించవచ్చు.
3. భెల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 83. స్టాప్‌లాస్‌ రూ. 65. మార్కెట్‌తో సంబంధం లేకుండా బలంగా కనిపిస్తోంది. రూ. 66పైన కదలాడినంత కాలం రూ. 70 రేంజ్‌లో కొనొచ్చు. 
యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రికమండేషన్లు
1. అరబిందో ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 810. స్టాప్‌లాస్‌ రూ. 735. ప్రధాన డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతోంది. రూ. 760కి పైన పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. వాల్యూంలు సైతం బాగున్నాయి. హయ్యర్‌ హై ఏర్పరచడం పాజిటివ్‌ సంకేతం.
2. హిండాల్కో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 270. స్టాప్‌లాస్‌ రూ. 239. ఆరు నెలల కన్సాలిడేషన్‌ రేంజ్‌ను పైవైపుగా ఛేదించింది. నెలవారీ చార్టుల్లో రూ. 200- 210 స్థాయిలో బలమైన బేస్‌ ఏర్పరుచుకుంది. కీలక ఇండికేటర్లు పాజిటివ్‌గా మారాయి.
3. ఎన్‌ఐఐటీ టెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1280. స్టాప్‌లాస్‌ రూ. 1130. భారీ వాల్యూంలతో అధోముఖ నిరోధ రేఖను పైవైపుగా ఛేదించింది. రూ. 1000- 1060 రేంజ్‌లో మంచి మద్దతు పొందుతోంది. 
ఎస్‌ఎంసీ గ్లోబల్‌ రికమండేషన్లు
1. ఇన్ఫోసిస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 765. స్టాప్‌లాస్‌ రూ. 680. వీక్లీ చార్టుల్లో రైజింగ్‌ ఛానెల్‌లో కదలాడుతోంది. సూచీల్లో కరెక‌్షన్‌ స్టాకును పెద్దగా ప్రభావితం చేయలేదు. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. 
ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ రికమండేషన్లు
1. యాక్సిస్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 650. స్టాప్‌లాస్‌ రూ. 530. వీక్లీ చార్టుల్లో త్రిభుజాకార పాటర్న్‌ను పైవైపుగా బేధించింది. మరోమారు గత నిరోధ స్థాయిలను పరీక్షించేందుకు రెడీగా ఉంది. 
2. యూపీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 700. స్టాప్‌లాస్‌ రూ. 560. చార్టుల్లో మార్నింగ్‌ స్టాక్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. దిగువన రూ. 550- 565 వద్ద మంచి మద్దతు లభిస్తోంది. మరో మారు ర్యాలీకి సిద్ధమైంది.
3. సిప్లా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 730. స్టాప్‌లాస్‌ రూ. 610. ఆటుపోట్ల మార్కెట్లో ఫార్మా స్టాకులు రక్షణ కల్పిస్తాయి. సిప్లా చార్టుల్లో పలు ఇండికేటర్లు బుల్లిష్‌ సంకేతాలు ఇస్తున్నాయి. 

 You may be interested

మార్కెట్‌కు మద్దతు ఎక్కడ?

Monday 8th October 2018

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో ఆరంభమైన మార్కెట్‌ పతనాన్ని ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం, క్రూడాయిల్‌ ధర పెరగడం, రూపీ బలహీనత మరింత ప్రేరేపించాయి. దీంతో చూస్తుండగానే స్వల్ప వ్యవధిలో సూచీలు అనూహ్య వేగంతో క్షీణించాయి. గతవారమైతే భారీ గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌లతో సూచీలు అతలాకుతలం అయ్యాయి. ప్రస్తుత పతనం ఇప్పట్లో ఆగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎఫ్‌పీఐలు నికర విక్రయదారులుగా మారి విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. యూఎస్‌లో వడ్డీరేట్లను పెంచడంతో విదేశీ

ఓఎంసీలు ఇంకా బలహీనమే!

Saturday 6th October 2018

మానస్‌ జైస్వాల్‌ చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు ఇంకా బలహీనంగా కనిపిస్తున్నాయని మార్కెట్‌ నిపుణుడు మానస్‌ జైస్వాల్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తాజాగా ఈ కంపెనీలపై పెట్రో భారం మోపడంతో రెండు రోజుల్లో ఈ షేర్లు దాదాపు 35 శాతం వరకు పతనమయ్యాయి. అయితే ఈ కరెక‌్షన్‌ ఇంకా ముగిసిపోలేదని, మరో 10- 15 శాతం వరకు పతనం ఉండొచ్చని మానస్‌ చెప్పారు. ఈ కంపెనీల్లో కొత్తగా లాంగ్స్‌ తీసుకోవాలంటే మరి కొంత

Most from this category