STOCKS

News


లార్జ్‌క్యాప్స్‌ను నమ్ముకోండి!

Monday 22nd April 2019
Markets_main1555929531.png-25275

ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ కన్నా లార్జ్‌క్యాప్స్‌ను నమ్ముకోవడం మంచిదని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈక్విటీ హెడ్‌ జినేశ్‌ గోపాని సూచించారు. స్థూల ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, మైక్రో ఎకానమీలో ఆటుపోట్లు కనిపిస్తున్న నేపథ్యంలో పెద్దస్టాకులతోనే క్యాపిటల్‌కు రక్షణ ఉంటుందన్నారు. ఎకానమీ మెరుగుపడితే అప్పుడు చిన్న కంపెనీల ఎర్నింగ్స్‌ మెరుగుపడతాయని, అప్పుడు వాటి గ్రోత్‌ లార్జ్‌క్యాప్స్‌ కన్నా ఎక్కువగా ఉంటుందని, అలాంటప్పుడు వీటిపై కన్నేయవచ్చని సూచించారు. కానీ ప్రస్తుతం మాత్రం లార్జ్‌క్యాప్స్‌తోనే రక్షణ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఒకవేళ మిడ్‌క్యాప్స్‌ను ఎంచుకోవాలని బలంగా అనుకుంటే ఫైనాన్షియల్స్‌, వినిమయం రంగాలకు చెందిన నాణ్యమైన కంపెనీలను పరిశీలించాలని సూచించారు. ఇప్పుడున్న మార్కెట్లో పడినప్పుడు కొను సూత్రం పాటించవచ్చన్నారు. కొద్ది కాలంగా పేలవ ప్రదర్శన చూపుతున్న ఆటో రంగంలో కాంట్రాబయింగ్‌కు అవకాశాలున్నాయన్నారు. 
విదేశీ నిధులను నమ్మలేం
ఫెడ్‌ కామెంట్స్‌ అనంతరం వర్ధమాన దేశాల్లోకి భారీగా నిధులు వచ్చాయని, ఇకపై ఈ ప్రవాహం నిలిచిపోయే ఛాన్సులు కనిపిస్తున్నాయని, చమురు ధరలు పెరగడం ఇందుకు సంకేతంగా చెప్పుకోవచ్చని ఆయన తెలిపారు. ముడిచమురు ధర 75 డాలర్లను దాటితే వర్ధమాన దేశాలకు ఇబ్బందేనన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కమారుగా విదేశీ ఫండ్స్‌ వెనక్కు మరలే ప్రమాదం ఉంటుందని చెప్పారు. అందుకని ఇప్పుడు చాలా అప్రమత్తత అవసరమని హెచ్చరించారు. సూచీల్లో వచ్చే అప్‌మూవ్‌లను చూసి ఉప్పొంగిపోయి ఎంటర్‌ కావద్దని సూచించారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేయలేమని, ఎకానమీ ఆశించినంత గొప్పగా ఏమీ లేదని చెప్పారు. అందుకే ఆచితూచి వ్యవహరించాలని ఇన్వెస్టర్లకు జినేశ్‌ సలహా ఇచ్చారు. ఇలాంటి స్థితిలో కూడా మంచి పనితీరు కనబరిచే నాణ్యమైన కంపెనీలను ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. 



You may be interested

పెద్దగా తెలియని స్టాక్స్‌... అయినా దండిగా లాభాలు!

Tuesday 23rd April 2019

తన చర్యలన్నీ ఇతరులకు వ్యతిరేకంగా ఉన్నాయని సరైన పెట్టుబడిదారుడు భావిస్తాడన్నది బెంజమిన్‌ గ్రాహం సూత్రీకరణ. కాంట్రేరియన్‌ ఇన్వెస్టర్‌ (నలుగురికి భిన్నమైనవారు) తక్కువ ప్రాచుర్యం ఉన్న స్టాక్స్‌లో ఇ‍న్వెస్ట్‌ చేయడం వల్ల ఇతరుల కంటే రాబడుల పరంగా మెరుగైన స్థితిలో ఉంటారు. దీర్ఘకాలంలో తటస్థం నుంచి కొద్దిగా తెలిసిన కంపెనీలు ఇతర కంపెనీలతో పోలిస్తే గణనీయమైన రాబడులను ఇవ్వగలవని మోతీలాల్‌ ఓస్వాల్‌ అధ్యయన పూర్వకంగా వెల్లడించింది.    మార్చి త్రైమాసికంలో ప్రముఖ కంపెనీల పనితీరు

11600 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 22nd April 2019

బలహీన దేశీయ సంకేతాలకు తోడు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ల పతనంతో సోమవారం మార్కెట్‌ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్‌ 495 పాయింట్ల నష్టంతో 38,645 వద్ద, నిఫ్టీ 158 పాయింట్ల నష్టంతో 11,594.50 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల భారీ పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 540(1.75శాతం) నష్టపోయి 29,688 వద్ద స్థిరపడింది. సూచీలకు ఇది వరుసగా రెండో రోజూ

Most from this category