STOCKS

News


సుగర్‌ కంపెనీల స్టాకులపై పాజిటివ్‌!

Monday 15th October 2018
Markets_main1539583531.png-21159

స్టీవర్ట్‌ అండ్‌ మాకరిట్చ్‌ 
ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఇథనాల్‌ పాలసీతో సుగర్‌ కంపెనీల స్టాకులకు మేలు జరుగుతుందని స్టీవర్ట్‌ అండ్‌ మాక్‌రిట్చ్‌ బ్రోకరేజ్‌ అంచనా వేస్తోంది. బలరామ్‌పూర్‌ చిని, ధర్మపూర్‌ సుగర్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌పై పాజిటివ్‌గా ఉన్నట్లు తెలిపింది. ఈ స్టాకులు మరో 50- 90 శాతం వరకు ర్యాలీ జరపగలవని అభిప్రాయపడింది. 
1. బలరాంపూర్‌ చిని: టార్గెట్‌ రూ. 152. ఇప్పటికే కంపెనీకి భారీ డిస్టిలరీ సామర్ధ్యం ఉంది. కొత్తగా గులారియా యూనిట్‌లో మరో డిస్టిలరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో ఇది అందుబాటులోకి వస్తుంది. కంపెనీకిందున్న సుగరు మిల్లుల్లో 25 శాతం మిల్లులకు డిస్టిలరీ సామర్ధ్యం ఉండగా, మరికొన్నింటి పర్యావరణానుకూల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. 
2. ధర్మపూర్‌ సుగర్స్‌: రూ. 274. బీ- గ్రేడ్‌ మొలాసిస్‌ నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేసేందుకు అనుమతులు పొందింది. రూ. 40 కోట్ల వ్యయంతో డిస్టిలరీ సామర్ధ్యాలను పెంచుకుంటోంది. ఈ ఏడాదే ఈ సామర్ధ్య విస్తరణ పూర్తవుతుందని అంచనా.
3. ప్రజ్‌ ఇండస్ట్రీస్‌: టార్గెట్‌ రూ. 156. చమురు మార్కెటింగ్‌ కంపెనీలతో సంబంధాలతో ఆర్డర్‌బుక్‌ను బలోపేతం చేసుకుంటోంది. యూరప్‌లో రెండు 2జీ డెమో ప్లాంట్లు ఏర్పాటు చేసే యత్నాల్లో ఉంది. రూ. 5వేల కోట్లతో సుగర్‌ మిల్లుల్లో ఇథనాల్‌ ప్లాంట్లను నిర్మించనుంది. 



You may be interested

తెలంగాణ మార్కెట్లోకి టాటా హిటాచీ షిన్రాయ్‌

Monday 15th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:: సరికొత్త బ్యాక్‌హోలోడర్‌ షిన్రాయ్‌ని టాటా హిటాచీ తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ ఆర్‌పీఎం, ఎక్కువ శక్తి ఉన్న షిన్రాయ్‌ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందిందని టాటా హిటాచీ ఎండీ సందీప్‌ సింగ్‌ చెప్పారు. బ్యాక్‌హోలోడర్స్‌ విభాగంలో కనీసం పది శాతం మార్కెట్‌ వాటా దక్కించుకోవాలని లక్ష్యిస్తున్నట్లు తెలిపారు. ఎక్సవేటర్‌ రంగంలో తాము బలంగా ఉన్నామని, షిన్రాయ్‌తో బ్యాక్‌హోలోడర్స్‌ విభాగంలో కూడా సత్తా

ఈ స్టాక్స్‌ కొనచ్చు

Monday 15th October 2018

అరవింద్‌    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: కోటక్‌ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.330 టార్గెట్‌ ధర: రూ.450 ఎందుకంటే: కంపెనీ ప్రధాన వ్యాపారాలు-టెక్స్‌టైల్స్‌, అప్పారెల్స్‌, ఇంజినీరింగ్‌ మంచి వృద్ధిని సాధిస్తున్నాయి. అరవింద్‌ ఫ్యాషన్స్‌ పేరుతో బ్రాండెడ్‌ అప్పారెల్‌ వ్యాపారాన్ని, అరవింద్‌ పేరుతో టెక్స్‌టైల్స్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఫ్లైయింగ్‌ మెషీన్‌, కోల్ట్‌, రగ్గర్స్‌ వంటి సొంత బ్రాండ్స్‌తో పాటు యారో, టామీ హిల్‌ఫిగర్‌ చెరోకి వంటి విదేశీ బ్రాండ్ల దుస్తులను కూడా విక్రయిస్తోంది. అన్‌లిమిటెడ్‌ పేరుతో రిటైల్‌ చెయిన్‌ను

Most from this category