STOCKS

News


స్టాక్స్‌ ఎంపికలో జాగ్రత్త!!

Wednesday 12th September 2018
Markets_main1536740379.png-20201

అమెరికా డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ కొత్త కనిష్ట స్థాయిలకు పతనమౌతోందని 5నాన్స్‌.కామ్‌ ఫౌండర్‌ దినేశ్‌ రొహిరా తెలిపారు. కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరిగిందన్నారు. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సోమవారం కీలక స్థాయిల దిగువకు వచ్చేశాయని పేర్కొన్నారు. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ ఆజ్యం పోసుకోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోందని తెలిపారు. 
ఈ వారంలో నిఫ్టీ ఇండెక్స్‌ తొలిగా 11,500 స్థాయి కిందకు, తర్వాత 1,300 స్థాయి దిగువకు వచ్చిందని పేర్కొన్నారు. 11,274 కనిష్ట స్థాయిని తాకిందని పేర్కొన్నారు. ‘వారం ప్రాతిపదికన చూస్తే ఇండెక్స్‌ 2 శాతంమేర క్షీణించింది. ఎఫ్‌ఎంసీజీ, కన్సూమర్‌ డ్యూరబుల్‌ విభాగాలు ఇందుకు కారణం. ఇవి వరుసగా 4.26 శాతం, 5.07 శాతం క్షీణించాయి. హెల్త్‌ కేర్‌ విభాగం 0.61 శాతం పెరుగుదలతో టాప్‌ గెయినర్‌గా ఉంది’ అని వివరించారు.  
ఇండెక్స్‌ 11,500 మార్క్‌ దిగువకు వచ్చిన తర్వాత వీక్లి, డైలీ చార్ట్స్‌లో బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచిందని తెలిపారు. తర్వాతి సెషన్‌లో సాలిడ్‌ బేరిష్‌ క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచిందని పేర్కొన్నారు. ఇది నెగటివ్‌ సెంటిమెంట్‌ను సూచిస్తోందన్నారు. అలాగే వీక్లి ఆర్‌ఎస్‌ఐ 58 లెవెల్‌లో ఉందని, ఇది లోయర్‌ జోన్‌ అని తెలిపారు. ఎంఏసీడీ బేరిష్‌ ట్రెండ్‌ను సూచిస్తోందని పేర్కొన్నారు. ఇండెక్స్‌కు తక్షణ నిరోధ స్థాయి 11,500, మద్దతు స్థాయి 11,076 అని తెలిపారు. 
స్టాక్స్‌ ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పొజిషన్లు తీసుకోవద్దని సూచించారు. 13 శాతం దాకా రిటర్న్‌ అందించే 3 స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..

స్టాక్‌: ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.129
స్టాప్‌ లాస్‌: రూ.97
అప్‌సైడ్‌: 13 శాతం
రూ.133-రూ.81 ప్రైస్‌బ్యాండ్‌లో కన్సాలిడేట్‌ అయిన తర్వాత ఈ స్టాక్‌ అప్‌ట్రెండ్‌ అంచనాలతో ట్రేడ్‌ అవుతోంది. రూ.101-91 స్థాయిల్లో కీలక మద్దతును కలిగి ఉంది. రూ.120 వైపు కదులుతోంది. ముమెంటమ్‌ ఇండికేటర్‌ పాజిటివ్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. వీక్లి ఆర్‌ఎస్‌ఐ 57 వద్ద ఉంది. రానున్న సెషన్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ను ఏర్పరచవచ్చు. రూ.114 స్థాయిలో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

స్టాక్‌: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.329
స్టాప్‌ లాస్‌: రూ.290
అప్‌సైడ్‌: 8 శాతం
ఈ స్టాక్‌ రూ.346-310 నుంచి రూ.246-239 వరకు కన్సాలిడేట్‌ అయిన తర్వాత బలమైన రీబౌండ్‌ను కనబర్చింది. 200, 100 రోజుల ఈఎంఏ లెవెల్స్‌ అయిన రూ.263, రూ.268 నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. ఇంట్రాడేలో రూ.321 గరిష్ట స్థాయిని కూడా తాకింది. వారంగా చూస్తే 15 శాతం లాభపడింది. వీక్లి ఆర్‌ఎస్‌ఐ 59 వద్ద ఉంది. పాజిటివ్‌ డైవర్జెన్స్‌ను తెలియజేస్తోంది. ఎంఏసీడీ కూడా రానున్న సెషన్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌ను సూచిస్తోంది. రూ.305 స్థాయిలో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

స్టాక్‌: వీఐపీ ఇండస్ట్రీస్‌
రేటింగ్‌: అమ్మొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.510
స్టాప్‌ లాస్‌: రూ.567
డౌన్‌సైడ్‌: 6 శాతం  
గత నెల రోజులుగా వీఐపీ ఇండస్ట్రీస్‌ స్టాక్‌ అమ్మకాల ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవలి సెషన్‌లో రూ.633 నుంచి రూ.554-535 స్థాయిలకి కన్సాలిడేట్‌ అయ్యింది. 20 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ అయిన రూ.571 దిగువకు పడిపోయింది. వారంగా 10 శాతం నష్టపోయింది. మంత్లీ చార్ట్‌లో లోయర్‌ బ్యాండ్‌ను ఏర్పరచింది. వ్యాల్యూమ్స్‌ కూడా తగ్గాయి. ఆర్‌ఎస్‌ఐ లెవెల్‌ 43గా ఉంది. పెద్ద మూమెంట్‌ ఉండకపోవచ్చని ఎంఏసీడీ సూచిస్తోంది. రూ.540 స్థాయిలో విక్రయించొచ్చు. You may be interested

ఆగస్ట్‌లో తగ్గిన వాణిజ్య లోటు

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ:- ఆగస్ట్‌లో వాణిజ్య లోటు స్వల్పంగా తగ్గింది. ఈ నెలలో వాణిజ్య లోటు 17.4 బిలియన్‌ డాలర్లగా నమోదైంది. వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి... -    ఆగస్ట్‌లో ఎగుమతులు 19.21శాతం పెరిగి 27.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, ఇతర ఉత్పత్తులకు విదేశాల నుంచి ఆర్డర్లు పెరగడం ఎగుమతుల పెరుగుదలకు దోహదపడింది. పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతులను మినహాయించినప్పటికీ వృద్ధి 17.43శాతంగా ఉన్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ

అమ్మకాల ఒత్తిడిలో అడాగ్‌ ‍గ్రూప్‌ షేర్లు

Wednesday 12th September 2018

ముంబై:- హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న మార్కెట్లలో అనిల్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడంతో  బుధవారం పలు అడాగ్‌ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. గ్రూప్‌లో రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ షేర్లు 5నుంచి 4శాతం క్షీణించాయి.   రిలయన్స్‌ క్యాపిటల్‌ :- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.440.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మంగళవారం తొలి తైమాసికంలో ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో

Most from this category