STOCKS

News


పొజిషన్లు తగ్గించుకోవడం మంచిది!

Tuesday 23rd April 2019
Markets_main1556016740.png-25296

క్రూడ్‌; వీఐఎక్స్‌లో అనూహ్య పెరుగుదల
అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర అనూహ్య పెరుగుదల, ఇండియా వీఐఎక్స్‌ మూడేళ్ల గరిష్ఠానికి చేరడంతో ఈక్విటీలపై అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండింటి ప్రభావంతో ట్రేడర్లు తమ పొజిషన్లు తగ్గించుకోవడంతో పాటు బుల్లిష్‌ బెట్స్‌ను వదులుకుంటున్నారు. ఎన్నికల ముందు వచ్చిన ఉత్సాహంతో సూచీల్లో లాంగ్‌ పొజిషన్ల ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ భారీగా పెరిగింది. కానీ ఒక్కమారుగా మార్కెట్‌ను చుట్టుముట్టిన భయాలతో సూచీల్లో బలహీనత ఆరంభమైంది. దీంతో నిఫ్టీ ఫ్యూచర్స్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ నిన్న ఒక్క రోజులోనే 13.1 శాతం పతనమైంది. బ్యాంకు నిఫ్టీ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 18.6 శాతం దిగివచ్చింది. దీంతో పాటు బడా కంపెనీల కౌంటర్లలో లాంగ్స్‌ తగ్గడం గమనించవచ్చు. సోమవారం ఆర్‌ఐఎల్‌లో లాంగ్‌ అన్‌వైండింగ్‌ భారీగా జరిగిందని ఆనంద్‌ రాఠీ తెలిపింది. ఒకపక్క ధర పడుతూ ఉండి, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ కూడా దిగివస్తుంటే బుల్లిష్‌ పొజిషన్ల అన్‌వైండింగ్‌కు సంకేతమని తెలిపింది. వీఐఎక్స్‌లో అనూహ్య పెరుగుదల ప్రస్తుత పాజిటివ్‌ పరుగులకు విరామాన్ని సూచిస్తోందని మోతీలాల్‌ఓస్వాల్‌ అభిప్రాయపడింది. 
పుట్స్‌ తగ్గుతున్నాయి
ఒకపక్క లాంగ్‌ అన్‌వైండింగ్‌తో పాటు పలు కౌంటర్లలో దగ్గర స్ట్రైక్‌ప్రైస్‌ల వద్ద పుట్‌ అన్‌వైండింగ్‌ కూడా నమోదవుతోందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని బట్టి పుట్‌రైటర్లు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇది మరింత పతనానికి సంకేతంగా భావించవచ్చు. మార్కెట్‌ ర్యాలీ కొనసాగుతుందని చాలామంది పుట్‌ రైటింగ్‌ చేశారు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు పుట్స్‌ను కవర్‌ చేయడం కనిపిస్తోంది. క్రూడాయిల్‌ధర పెరగడం, ఇరాన్‌పై ఆంక్షల భయాలు మార్కెట్లో బేరిష్‌నెస్‌ పెంచుతున్నాయని, అందుకే పుట్‌రైటర్లు పుట్స్‌ను కవర్‌ చేస్తున్నారని ఏంజల్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. ముడిచమురు ధర ఇంకా పెరిగితే ఇండియా ఎకానమీకి అనేక ఇబ్బందులు ఆరంభమవుతాయి. ఈ భయాలు మార్కెట్‌ను ప్రస్తుతం వెనక్కులాగుతున్నాయి. దీనికితోడు ఎన్నికల ఫలితాల తేదీ దగ్గరపడుతున్నందున వెయిట్‌ అండ్‌ వాచ్‌ సిద్ధాంతాన్ని ఎక్కువమంది ఫాలో అవుతున్నారని, అందుకే మార్కెట్లో జోరు తగ్గిందని నిపుణుల విశ్లేషణ. ఈ సమయంలో వీఐఎక్స్‌ 35 స్థాయిలవరకు చేరే అవకాశాలున్నందున, సాధ్యమైనంతవరకు పొజిషన్లు తగ్గించుకొని వేచిచూడడం మంచిదని అనలిస్టులు సూచిస్తున్నారు. You may be interested

బ్యాంకింగ్‌ కౌంటర్లలో భారీ అన్‌వైండింగ్‌

Tuesday 23rd April 2019

హఠాత్తుగా క్రూడ్‌ ధర 6 నెలల గరిష్టస్థాయికి చేరడం, రూపాయి 69.5 దిగువకు దిగజారడంతో పాటు మరోవైపు వొలటాలిటీ ఇండెక్స్‌ (వీఐఎక్స్‌) 38 నెలల గరిష్టస్థాయికి పెరిగిన నేపథ్యంలో ట్రేడర్లు మార్కెట్లో బ్యాంకింగ్‌ కౌంటర్లలో లాంగ్‌ పొజిషన్లను పెద్ద ఎత్తున అన్‌వైండ్‌ చేస్తున్నారు. ఏప్రిల్‌ డెరివేటివ్‌ సిరీస్‌ మరో రెండు రోజుల్లో ముగియనున్నందున, బ్యాంకింగ్‌ షేర్లలో బుల్‌ ఆఫ్‌లోడింగ్‌ కారణంగా వరుసగా మూడోరోజు బ్యాంక్‌ నిఫ్టీ క్షీణించింది. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో ప్రధాన

3 వారాల కనిష్టస్థాయి వద్ద ముగింపు

Tuesday 23rd April 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి నష్టాలతో ముగిశాయి. అటో, బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్ల పతనం సూచీల లాభాలకు గండి కొట్టింది. ఫలితంగా మార్కెట్‌ మంగళవారం వరుసగా మూడో రోజూలతో ముగిసింది. సెన్సెక్స్‌ 80 పాయింట్లు నష్టపోయి 38565 వద్ద, నిఫ్టీ 18.50 క్షీణించి11576 వద్ద స్థిరపడింది. మార్చి 29 తర్వాత ఈ స్థాయిలో సూచీలు ముగియడం ఇదే ప్రధమం. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో

Most from this category