STOCKS

News


ఎన్నికల ఫలితాలు మార్కెట్‌ను పడేస్తాయా?

Wednesday 14th November 2018
Markets_main1542217880.png-22009

తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్స్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరాంలో ఈ నెల, వచ్చే నెల మొదటి వారంలో జరిగే ఎన్నికల ఫలితాల కోసం చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రాల ఫలితాలు వచ్చే నెల 11న వెలువడనున్నాయి. అప్పటి వరకు నిఫ్టీ 10,000-11,000 మధ్య ట్రేడ్‌ అవుతుందని, ఈ శ్రేణిని దాటి పోకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికలపై రాష్ట్రాల ఎన్నికలు ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు.  

 

ఈ నెల 12న ఛత్తీస్‌గడ్‌లో మొదటి దశ కింద 18 స్థానాలకు పోలింగ్‌ ముగియగా, ఈ నెల 20న మరో విడత పోలింగ్‌ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ. దీంతో ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలపై మార్కెట్‌కు ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ‘‘ఇప్పటి వరకైతే ఓపీనియన్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీ రాజస్థాన్‌ రాష్ట్రాన్ని కోల్పోతుందని, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో ముఖాముఖి పోటీ ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంటే మార్కెట్లు ర్యాలీ చేస్తాయి. ఒకవేళ మూడు రాష్ట్రాలోనూ బీజేపీ ఓటమి పాలైనా లేక రాజస్థాన్‌ను, మధ్యప్రదేశ్‌లో ఏదో ఒక చోట ఓడినా మార్కెట్లో కరెక్షన్‌ వస్తుంది’’ అని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఓ నివేదికలో తెలిపింది. 

 

‘‘ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రభావం ఒక్కటే మార్కెట్‌పై పడదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్‌ 11నే విడుదల అవుతాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ రెండింటిని అయినా సొంతం చేసుకుంటే అది మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ ఎన్నికల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపైనా పడుతుంది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన వీకే శర్మ పేర్కొన్నారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పైచేయి సాధిస్తే మార్కెట్లు ప్రతికూలంగా స్పందించడంతోపాటు నిఫ్టీ 10,000-10,200 శ్రేణిని బ్రేక్‌ చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘మార్కెట్‌ 10,000-11,000 శ్రేణి మధ్య ట్రేడ్‌ కావచ్చు. 10,200-10,800 అన్నది సున్నితమైన శ్రేణి. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ శ్రేణి బ్రేక్‌ చేయడానికి దారితీస్తాయి’’ అని ఎలిక్సిర్‌ ఈక్విటీస్‌ డైరెక్టర్‌ దీపన్‌ మెహతా తెలిపారు. చమురు ధరలు, రూపాయి కదలికలను జాగ్రత్తగా గమనించాల్సి ఉందని కిఫ్స్‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ సీఎస్‌వో రితేష్‌ ఆషర్‌ తెలిపారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను... భారత ఆర్థిక రంగం భవిష్యత్తుకు సంకేతంగా మార్కెట్లు చూస్తాయన్నారు. అప్పటి వరకు మార్కెట్లు ఒడిదుడుకులతో ఉంటాయన్నారు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Thursday 15th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 16 పాయింట్ల లాభంతో 10,617 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,605 పాయింట్లతో పోలిస్తే 12 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక

కోల్‌ ఇండియాతో కేంద్రానికే లాభాల పంట!

Wednesday 14th November 2018

కోల్‌ ఇండియా... ఇది కేంద్రం ప్రభుత్వరంగ మహారత్న కంపెనీ. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బొగ్గు ఉత్పత్తి సంస్థ. దేశీయ బొగ్గు రంగంలో గుత్తాధిపత్యం కలిగినది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు కచ్చితంగా వస్తాయి...? అని అనుకుంటే అది హాస్యాస్పదమే అవుతుంది!. ఎందుకంటే కోల్‌ ఇండియా స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌ అయి ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ కాలంలో ఇది కేవలం డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.74,000 కోట్ల

Most from this category