STOCKS

News


పీఎస్‌యూ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.4 లక్షల కోట్లు ఆవిరి

Wednesday 3rd October 2018
Markets_main1538565044.png-20829

ప్రభుత్వరంగ లిస్టెడ్‌ కంపెనీలు ఈ ఏడాది ఇన్వెస్టర్లను ఉసూరుమనిపించాయి. సుమారు రూ.4 లక్షల కోట్ల మేర మార్కెట్‌ విలువను అవి ఇంత వరకు కోల్పోయాయి. అధిక ముడి చమురు ధరలు, మొండి బకాయిల వంటి అంశాలు ఈ విధంగా నష్టాల పాల్జేశాయి. 76 ప్రభుత్వరంగ సంస్థల్లో 74 క్షీణించాయి. ముఖ్యంగా నీరవ్‌మోదీ కొట్టిన దెబ్బకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) ఎక్కువగా నష్టాలను ఎదుర్కొన్నది. 65 శాతం నష్టపోయింది. రైల్వే కోచ్‌లు, నిర్మాణ రంగ యంత్ర పరికరాలను తయారు చేసే బీఈఎంఎల్‌ స్టాక్‌ 62 శాతం నష్టపోయింది. 

 

ఇక కోల్‌ ఇండియా, గెయిల్‌ మాత్రం ఒక్క శాతం పెరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీగా ఉన్న కోల్‌ ఇండియాకు... విద్యుత్‌ కర్మాగారాల్లో బొగ్గు నిల్వలు పడిపోవడం, పెరిగిన ధరల రూపంలో సానుకూలత ఏర్పడింది. అధిక చమురు ధరలు, పైపులైన్‌ ద్వారా సరఫరా చేసే గ్యాస్‌ ధరల్ని పెంచడం అతిపెద్ద గ్యాస్‌ సరఫరా కంపెనీ అయిన గెయిల్‌కు కలిసొచ్చింది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ ఈ ఏడాది ఎక్కువగా ఆటుపోట్ల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. ట్రేడ్‌వార్‌, చమురు ధరల పెరుగుదల, రూపాయి నష్టపోవడం, సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి చేసిన మార్పులు, ఇటీవల ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో లిక్విడిటీపై ఆందోళనలు ఇవన్నీ అమ్మకాలకు దారితీశాయి. 

 

సిండికేట్‌ బ్యాంకు అయితే 14 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎన్‌పీఏలు పెరిగిపోవడంతో, వాటికి నిధుల కేటాయింపు కారణంగా సిండికేట్‌ బ్యాంకు నష్టాలు విస్తృతమవడమే కారణం. బీఈఎంఎల్‌లో వాటాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, కానీ, దానిపై ఎటువంటి స్పష్టత లేకపోవడం, దీనికితోడు జూన్‌ క్వార్టర్లో బీఈఎంఎల్‌ రూ.160 కోట్ల నష్టాలను ప్రకటించడం స్టాక్‌పై ప్రభావం చూపించాయి. గత తొమ్మిదేళ్లలోనే అధిక నష్టాలు ఇవి. ఇలా అన్ని ప్రభుత్వ రంగ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.4 లక్షల కోట్ల మేర క్షీణించింది. ఇందులో టాప్‌ 10 కంపెనీల రూపంలోనే ఎక్కువ నష్టం జరిగింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, బీపీసీఎల్‌ పెరుగుతున్న ముడి చమురు ధరలతో 20 శాతానికి పైగా నష్టాలను చవిచూశాయి. పెరిగే ధరలు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల మార్జిన్లను దెబ్బతీస్తుందన్న అంచనాలే దీనికి కారణం. త్వరలో రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత సాధారణ ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వం చమురు ధరలను మరింత పెంచకుండా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలను నిరోధించే అవకాశం ఉందని, ఇది వాటి మార్జిన్లను దెబ్బతీస్తుందన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. రక్షణ రంగ ఆర్డర్లలో మార్జిన్‌ను 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ను నష్టపొయ్యేలా చేసింది. మిశ్రధాతు నిగమ్‌, రైట్స్‌ లిమిటెడ్‌, భారత్‌ డైనమిక్స్‌, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ వాటి ఐపీవో ధరల కంటే తక్కువకే ట్రేడ్‌ అవుతున్నాయి. 
 You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Thursday 4th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:22 సమయంలో 142 పాయింట్ల నష్టంతో 10,741 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,893 పాయింట్లతో పోలిస్తే 152 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ గురువారం నెగటివ్‌గా లేదా గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే

ఆర్థిక సంస్థల మధ్య పరస్పర విశ్వాసం లేదు!!

Wednesday 3rd October 2018

యస్‌ బ్యాంక్‌ కన్నా ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉత్తమమైన ఎంపికని క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజయ్‌ దూత్‌ తెలిపారు. మార్కెట్‌ ఒడిదుడుకులకు, అస్థిరతలకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మార్కెట్లు బుల్‌ ట్రెండ్‌లో ఉన్నప్పుడు చాలా మంది అనలిస్ట్‌లు వాటిని కొనండి.. వీటిని కొనండి.. అంటూ సూచనలిస్తుంటారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ మంది మాత్రమే బయటకు

Most from this category