STOCKS

News


ఎన్నికల ఫలితాలతో సమస్య లేదు..

Tuesday 11th December 2018
Markets_main1544511938.png-22821

విదేశీ ఇన్వెస్టర్లకు ఎన్నికల ఫలితాలతో వచ్చిన సమస్య ఏమీ లేదంటున్నారు ఈఎం ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ అడ్రియన్‌ మోవాత్‌. ప్రజలు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక విధంగా ఓట్లు వేయవచ్చని, సార్వత్రిక ఎన్నికల్లో మరో విధంగా ఓట్లు వేయవచ్చని అంచనా వేశారు. అందువల్ల ఓటర్లు ఎప్పుడూ ఒకేలా ఓట్లు వేస్తారని అంచనా వేయడం తగదని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
భారత్‌ ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిపారు. అంతర్జాతీయంగా, దేశీయంగా నెగటివ్‌ సెంటిమెంట్‌ ఏర్పడిందని పేర్కొన్నారు. జీడీపీ వృద్ధి అంచనాలు తగ్గాయని, ప్రత్యేకించి గ్రామీణ డిమాండ్‌ బలహీనంగా కనిపిస్తోందని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ సమస్యలు, పీఎస్‌యూ బ్యాంకుల క్యాపిటలైజేషన్‌ వంటి అంశాలను ఆర్‌బీఐ ఎలా డీల్‌ చేస్తుందో చూడాల్సి ఉందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఎవరి నియంత్రణ ఉండాలనే అంశంపై అస్పష్టత కొనసాగుతోందని తెలిపారు. సెంట్రల్‌ బ్యాంకులు, ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. పీఎస్‌యూ బ్యాంకుల రుణ మంజూరీపై నియంత్రణలు కొనసాగితే.. ఎన్‌బీఎఫ్‌సీలకు మూలధనం ఎక్కడి నుంచి లభిస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైతే ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు విదేశీ ఇన్వెస్టర్లపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని పేర్కొన్నారు. ఓటర్లు ఎప్పుడూ ఒకేలా ఓట్లు వేయరని తెలిపారు.  



You may be interested

కోలుకున్న బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 11th December 2018

ముంబై: మిడ్‌సెషన్ సమయానికి మార్కెట్‌ రికవరీలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు తిరిగి కోలుకుంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ మధ్యాహ్నం గం.12:25ని.లకు 0.10శాతం లాభపడి 26,010 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రిజర్వ్‌బ్యాంకు ఛైర్మన్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాతో మంగళవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు బాగా నష్టపోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2శాతం పతనం ఇండెక్స్‌ను

కరిగిన రూపాయి : పెరిగిన పసిడి

Tuesday 11th December 2018

ముంబై:- రూపాయి కరిగిపోవడం పసిడికి బలానిస్తుంది. ఫారెక్స్‌ మార్కెట్లో రాత్రి డాలర్‌ మారకంలో రూపాయి విలువ 50పైసలు కోసుకుపోయింది. ఫలితంగా గతరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి రూ.32వేల పైకి ఎగసింది. చివరికి రూ.567లు లాభపడి రూ.30028లు వద్ద ముగిసింది. అయితే నేటి ట్రేడింగ్‌లో పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ జరుగుతోంది. ఉదయం గం.11:45ని.లకు ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి రూ.244లు నష్టపోయి రూ.31784.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగా స్వల్ప నష్టాలతో:-              డాలర్‌

Most from this category