STOCKS

News


డిసెంబర్‌లో అధిక ఒడిదుడుకులు వుండొచ్చు..!

Monday 3rd December 2018
Markets_main1543833836.png-22598


ముంబై: ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆ తరువాత మేలో సాధారణ ఎన్నికలు అనేవి మార్కెట్‌ దిశకు అత్యంత కీలక అంశాలని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ అన్నారు. నిఫ్టీకి 11,000 పాయిం‍ట్లు అనేది ప్రస్తుతం ఏమంత పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించిన ఆయన ఈ స్థాయి కేవలం 2-3 శాతం దూరంలోనే ఉందన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవల్సింది దీర్ఘకాల ట్రెండ్స్‌ గురించని ఒక ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే చాలా క్లిష్టపరిస్థితుల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తుందన్నారు. అయితే, స్వల్పకాలానికి మాత్రం అప్‌సైడ్‌ స్ట్రెంత్‌ ఉన్నట్లు విశ్లేషించారు. నిఫ్టీ 200-రోజుల సగటు 10,744 పాయింట్ల వద్ద ఉందని, ఈస్థాయిని దిగనంత వరకు ట్రేడర్లు పాజిటీవ్‌గానే ఉండొచ్చన్నారు. 11,069 పాయింట్లను దాటితే 11,400 వద్దకు చేరుకునే అవకాశం ఉందన్నారు. పడిపోయిన పక్షంలో 10740 కీలక మద్దతు స్థాయిగా ఉంటుందని, ఆ స్థాయి వద్ద నిలవలేకపోతే 10,489 పాయింట్ల వద్దకు, అక్కడ నుంచి 10,440 వద్దకు చేరుకోవచ్చని వివరించారు. ఇక ఆర్‌బీఐ ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష, ఎగ్జిట్‌ పోల్స్‌ ఉన్నందు వల్ల సహజంగానే ఈ నెలలో ఒడిదుడుకులకు అధికంగా ఉంటాయన్నారు. ఒకవేళ ఎన్నికల నుంచి సానుకూల సంకేతాలు వస్తే మార్కెట్‌లో అప్‌ట్రెండ్‌ అతి పెద్దదిగా ఉంటుందా అంటే.. ఇందుకు సమాధానం తానైతే ఉండకపోవచ్చనే చెబుతానని అన్నారు. వచ్చే మూడు నెలల్లో కూడా ఒడిదుడుకులు వస్తుంటాయని వివరించారు. స్మాల్‌క్యాప్స్‌, మిడ్‌క్యాప్స్‌ ఈ ఏడాది ప్రారంభంలో దిద్దుబాటుకు గురైనప్పటికీ.. ఆ తరువాత ప్రధాన సూచీని అవుట్‌పెర్ఫార్మ్‌ చేశాయని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ 50 రోజులు, 200 రోజుల సగటు కదలికల దిగువనే ఉన్నట్లు చెప్పారు. డాలరుతో రూపాయి మారకం విలువ 70.57 దిగువన ముగిసేంత వరకు బలహీనత ఉన్నట్లుగానే భావించవచ్చన్నారు. నెలరోజుల కోసం మూడు షేర్లను సిఫార్సుచేశారు.

బాటా ఇండియా | ప్రస్తుత ధర: రూ.1,039 | టార్గెట్ ధర: రూ.1,115 | స్టాప్ లాస్‌: రూ.990 | రాబడి అంచనా: 7 శాతం
కీలక కన్సాలిడేషన్‌ స్థాయి నుంచి బ్రేకవుట్‌ సాధించి రూ.1,115 వద్ద నూతన జీవితకాల గరిష్టస్థాయి నమోదు దిశగా కదలాడుతోంది.

సీమెన్స్ | ప్రస్తుత ధర: రూ. 949 | టార్గెట్ ధర: రూ.990 | స్టాప్ లాస్‌: రూ.897 | రాబడి అంచనా: 4 శాతం
అత్యధిక వాల్యూమ్స్‌తో రూ.900 స్థాయి నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ఇక్కడ నుంచి రూ.990 చేరుకునే అవకాశం ఉందని అంచనావేశారు.

బ్రిటానియా ఇండస్ట్రీస్ | ప్రస్తుత ధర: రూ.3,159 | టార్గెట్ ధర: రూ.3,300 | స్టాప్ లాస్‌: రూ.3,037 | రాబడి అంచనా: 4 శాతం
8-రోజుల మైనర్‌ కన్సాలిడేషన్‌ నుంచి అధిక వాల్యూమ్స్‌తో బ్రేకవుట్‌ సాధించింది. రూ.3,037 స్టాప్‌లాస్‌ నిర్వహిస్తూ షేరును కొనుగోలుచేయవచ్చని సూచించారు.

ఇవి కేవలం అనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.


nse

You may be interested

రికార్డు గరిష్టానికి హెచ్‌యూఎల్‌

Monday 3rd December 2018

ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్) షేర్లు సోమవారం జీవితకాల గరిష్టాన్ని తాకాయి. గ్లాక్సో స్మిత్‌క్లెయిన్‌ కన్జూమర్‌ను విలీనం చేసుకునేందుకు హెచ్‌యూఎల్‌ బోర్డు ఆమోదం తెలపడటం ఇందుకు కారణమైంది. నేడు హెచ్‌యూఎల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ.1,769.50ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. జీఎస్‌కే కన్జూమర్‌ హెల్త్‌కేర్‌ వ్యాపారాన్ని విలీనం చేసుకునేందుకు బోర్డు అనుమతిచ్చినట్లు హెచ్‌యూఎల్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. దీంతో హెచ్‌యూఎల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పలితంగా షేరు

ఆరంభలాభాలు ఆవిరి

Monday 3rd December 2018

10900 స్థాయిని నిలుపుకోలేకపోయిన నిఫ్టీ మెరిసిన మెటల్‌ షేర్లు ఫార్మాకు సన్‌ఫార్మాకు జ్వరం ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు... చివరి అరగంటలో హెచ్‌యూఎల్‌ షేర్ల ర్యాలీ అండతో స్వల్పలాభంతో గట్టెక్కాయి. అమెరికా-చైనా దేశాల మధ్య కుదరిన వాణిజ్య యుద్ధ సంధితో ట్రేడింగ్‌ ప్రారంభంలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోవడంతో సూచీలు విఫలయ్యాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభంలో నిఫ్టీ సూచి అందుకున్న 10900 మార్కును, సెన్సెక్స్‌ ఆర్జించిన 250 పాయింట్ల లాభాల్ని సూచీలు కోల్పోయాయి. చివరకు

Most from this category