News


ఎంపిక చేసిన మిడ్‌క్యాప్స్‌ను కొనొచ్చు!

Wednesday 13th February 2019
Markets_main1550052108.png-24179

యస్‌ సెక్యూరిటీస్‌ సూచన
కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చిందనే విషయంతో సంబంధం లేకుండా మార్కెట్‌ల పనితీరును అర్ధం చేసుకోవాలని యస్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి ప్రశాంత్‌ ప్రభాకరన్‌ సూచించారు. ప్రభుత్వాల ఏర్పాటు మార్కెట్‌పై చూపే ప్రభావం స్వల్పకాలికమన్నారు. స్టాక్‌ ఫండమెంటల్సే మార్కెట్‌ను ముందుకు నడుపుతాయన్నారు. ప్రస్తుత వాల్యూషన్లను పరిగణనలోకి  తీసుకుంటే లార్జ్‌క్యాప్స్‌ కన్నా మిడ్‌క్యాప్స్‌ను ఎంచుకోవడం ఉత్తమమని సలహా ఇచ్చారు. వాల్యూషన్ల పరంగా పెద్ద స్టాకుల కన్నా చిన్నస్టాకులు చౌకగా ఉన్నాయని చెప్పారు. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించే ఇన్వెస్టర్లు ఈ సమయంలో నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌తో బలమైన పోర్టుఫోలియో నిర్మించుకోవాలన్నారు. మార్కెట్లు కచ్ఛితంగా ఎక్కడ బాటమ్‌ అవుట్‌ అవుతాయో ఎవరూ చెప్పలేరని, అందువల్ల అప్‌మూవ్‌లో మొదటి పది శాతం ర్యాలీని మిస్‌అవుతామని గ్రహించాలని సలహా ఇచ్చారు. పదిశాతం కదలిక తర్వాతే మనకు మార్కెట్‌ మూవ్‌ అర్దమవుతుందన్నారు. చాలామంది క్లయింట్లు రక్షణాత్మక ధోరణికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారని అందుకే చాలావరకు పోర్టుఫోలియోల్లో లార్జ్‌క్యాప్స్‌ పెట్టుకుంటారని చెప్పారు. కానీ ప్రస్తుతం మిడ్‌క్యాప్‌ వాల్యూషన్లు చాలా చౌకగా ఉన్నాయని గుర్తించాలని చెప్పారు. వాల్యూషన్లు చౌకగా ఉండి, మీ పెట్టుబడి మొత్తాన్ని కనీసం 2,3 సంవత్సరాల పాటు కదల్చని వ్యవధి ఉంటే మిడ్‌క్యాప్స్‌లో నాణ్యమైనవాటిని ఎంచుకోవడం బెటరన్నారు. ఇంతవరకు తాము మిడ్‌క్యాప్స్‌కు దూరంగా ఉండమని సలహా ఇస్తూ వచ్చామని, కానీ ప్రస్తుతం ఈ ధృక్పధం మారేలా మిడ్‌క్యాప్‌ వాల్యూషన్లు దిగివచ్చాయని వివరించారు. కార్పొరేట్‌ బ్యాంకింగ్‌, వినిమయం రంగాల్లోని నాణ్యమైన స్టాకులను ఎంచుకోవమని రికమండ్‌ చేశారు. 



You may be interested

ఆరంభ లాభాలు ఆవిరి!

Wednesday 13th February 2019

10800 పాయింట్ల దిగువకు నిఫ్టీ బుధవారం లాభాలతో ఆరంభించిన సూచీలు చివర వరకు జోరు కొనసాగించలేకపోయాయి. మధ్యాహ్నం వరకు ఎంతో కొంత లాభాల్లో ట్రేడయిన సూచీలు చివరకు మ్రాతం నష్టాల్లోనే ముగిసాయి. బుధవారం సెన్సెక్స్‌ 120 పాయింట్ల నష్టంతో 36034 పాయింట్ల వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 10794 పాయింట్ల దిగువన క్లోజయ్యాయి. దాదాపు రెండువారాల తర్వాత నిఫ్టీ మరలా 10800 పాయింట్ల దిగువన క్లోజయి బేరిష్‌నెస్‌ చూపింది. ఇంట్రాడేలో

నష్టంలో బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 13th February 2019

ముంబై:- ప్రభుత్వం రంగ షేర్ల పతనంతో బుధవారం బ్యాంక్‌ నిఫ్టీ సూచీ 27000 కీలక సాంకేతిక స్థాయిని కోల్పోయింది. ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంక్‌ దాదాపు 0.30శాతం(85 పాయింట్లు) వరకు నష్టపోయింది. మధ్యాహ్నం గం.2:30లకు ఇండెక్స్‌ గతముగింపు(27,010.75)    తో పోలిస్తే 0.24(56 పాయింట్లు) నష్టంతో 26,954 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో మొత్తం 12 షేర్లకు గానూ 8షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా 4షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

Most from this category