STOCKS

News


స్టాక్స్‌పై ఒకే స్టాంప్‌ డ్యూటీ

Saturday 2nd February 2019
Markets_main1549099877.png-23967

న్యూఢిల్లీ: స్టాక్స్‌, బాండ్స్ వంటి ఆర్థిక సాధనాల లావాదేవీలపై ఇకపై ఒకే స్టాంప్ డ్యూటీ రేటును వర్తింపచేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ డ్యూటీని స్టాక్ ఎక్స్చేంజీలే వసూలు చేసి, ఖజానాకు జమచేయాల్సి ఉంటుంది. ఆయా లావాదేవీలు జరిపిన ఇన్వెస్టర్లు నివసించే రాష్ట్రాలతో కేంద్రం ఈ నిధులను పంచుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన స్టాంప్ డ్యూటీ ఉంటోంది. ఈ నేపథ్యంలో సంక్లిష్టతలను తొలగించే దిశగా ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ లావాదేవీలపై విధించే స్టాంప్ డ్యూటీలకు సంబంధించి సంస్కరణలు ప్రవేశపెడతామంటూ గతేడాది ఇచ్చిన హామీని ప్రస్తుతం నెరవేర్చినట్లయిందని గోయల్ వివరించారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎ౾ండీ ధీరజ్ రెల్లీ కేంద్ర ప్రతిపాదనను స్వాగతించారు. చాన్నాళ్లుగా బ్రోకరేజీ సంస్థలు దీన్ని డిమాండ్ చేస్తున్నాయని, దీనివల్ల లిటిగేషన్లు తగ్గగలవని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామంతో స్టాంప్ డ్యూటీ చెల్లింపు ప్రక్రియ, వ్యయాలు క్రమబద్ధీకరించినట్లవుతుందని ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐవో విరాల్ బెరావాలా చెప్పారు.



You may be interested

ఎన్నికల అనంతరమే క్రెడిట్‌ రేటింగ్‌ రివ్యూ

Saturday 2nd February 2019

భారత క్రెడిట్‌ రేటింగ్‌ ప్రొఫైల్‌పై ఫిచ్‌  ఎన్నికల అనంతరం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌ ఆధారంగానే భారత క్రెడిట్‌ సావరిన్‌ రేటింగ్‌ ప్రొఫైల్‌ను మదింపు చేస్తామని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. ఎన్నికల మందు వ్యయాలు పెరగడంతో విత్త స్లిపేజ్‌ కాస్త పెరిగిందని తెలిపింది. విత్తలోటు 0.1 శాతం పెరిగవచ్చని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ముందు అనుకున్న అంచనా 3.3 శాతం కాకుండా

డిజినెన్వస్ట్‌మెంట్‌తో రూ.90వేల కోట్లు

Saturday 2nd February 2019

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా రూ. 90,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. 2018-19లో ఈ లక్ష్యం రూ. 80,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ. 36,000 కోట్లు సమీకరించిన కేంద్రం మరో రెండు నెలల్లో ఇంకో రూ. 44,000 కోట్లు సేకరణపై కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా ప్రభుత్వం చర్యలు

Most from this category