STOCKS

News


కంపెనీల బలాలను గుర్తించమే ఇన్వెస్టర్‌ సత్తా

Monday 12th November 2018
Markets_main1542046692.png-21912

ప్రముఖ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ ‘మోట్స్‌’ అనే అంశం ఇన్వెస్టర్లు అందరికీ అనుసరణీయమే. వ్యాపార రంగంలో ఒక కంపెనీకి పోటీ పరంగా ఉన్న సానుకూలతలు, బలాలను ఇది తెలియజేస్తుంది. పోటీ పరంగా సానుకూలత, సంబంధిత కంపెనీ వ్యాపారం నిర్వహించే రంగంలోకి ప్రవేశించడానికి ఇతర కంపెనీలకు చాలా కష్టమైన అంశం కావడం లేదా ఆ కంపెనీ మార్కెట్‌ వాటాను సొంతం చేసుకోవడం అసాధ్యమైన అంశాలనేవి మోట్స్‌ కిందకు వస్తాయి. 

 

ఓ కంపెనీకి ప్రస్తుత సానుకూలతలు ఇక ముందూ నిలదొక్కుకుని కొనసాగడం ముఖ్యమైన అంశం అవుతుంది. కొన్ని కంపెనీలకు ప్రస్తుతం సానుకూలంగా ఉన్నవి భవిష్యత్తులో కనుమరుగు అయిపోవచ్చు. ఇదే జరిగితే ఆ కంపెనీతోపాటు అందులో వాటాదారులు కూడా నష్టపోతారు. అందుకే కంపెనీని గురించి అధ్యయనం చేశాకే పెట్టుబడి పెట్టాలనేది. కంపెనీ ఉత్పత్తి లేదా సేవలు అన్నవి కాల క్రమంలో పనికిరానివి అయిపోకూడదు. బలమైన బ్రాండ్‌కు తోడు మరో సంస్థ దానికి పోటీనిచ్చే స్థాయికి చేరనంత బలంగా ఉంటే ఆ కంపెనీలో కళ్లు మూసుకుని ఇన్వెస్ట్‌ చేయవచ్చన్నది పెట్టుబడి సూత్రం. 

 

బలమైన బ్రాండ్‌
ఓ కంపెనీకి ఉన్న బలాలు తెలుసుకోవాలంటే కేవలం అనుభవం సరిపోదు. ఎంతో ఓపిక ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఓ కంపెనీ బలాలు స్పష్టంగా బయటకు కనిపించకపోవచ్చు. చాలా సందర్భాల్లో బలాలు నిలదొక్కుకోకపోవచ్చు. కాకపోతే కొన్ని అంశాలు గుర్తించేందుకు దోహదపడతాయి. ఓ బలమైన బ్రాండ్‌ వినియోగదారుల మనసుల నుంచి చెరిగిపోవడం చాలా కష్టం. నిజానికి అటువంటి బ్రాండ్‌ కంపెనీకి ఉన్న బలమే. నెస్లే కంపెనీకి మ్యాగి బ్రాండ్‌ ఇటువంటిదే. 2015లో మ్యాగిలో సీసం పాళ్లు ఎక్కువగా ఉన్నాయన్న అంశం అమ్మకాలను కుదిపేసింది. కానీ, అదేమీ లేదని తేలడంతో తిరిగి మళ్లీ బ్రహ్మాండంగా మ్యాగి అమ్మకాలు కొనసాగుతుండడం బ్రాండ్‌ బలాన్ని సూచిస్తోంది. 

 

బలమైన పంపిణీ
కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవల అమ్మకాలకు పంపిణీ నెట్‌వర్క్‌ బలంగా ఉండడం అవసరం. ఇదెంత బలంగా ఉంటే కంపెనీకి అంత అనుకూలతగా చూడొచ్చు. ఉదాహరణకు పెప్సీ కుర్‌కురే బ్రాండ్‌ అందరికీ తెలిసిందే. దాదాపు ప్రతీ షాపులోనూ దర్శనమిస్తుంది. ఇక ఓ ఉత్పత్తి లేదా సేవను తమ తోటి వారి కారణంగా వినియోగించాల్సిన అవసరం ఏర్పడడం కూడా మరో బలం. ఉదాహరణకు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ అన్నవి ఒకరి కారణంగా మరొకరు కూడా అందులో చేరాల్సి రావడం ఆయా నెట్‌వర్క్‌ల భారీ విస్తరణకు దోహదపడే అంశం. అలాగే, ఓ కంపెనీ ఉత్పత్తులు లేదా సేవల వినియోగాన్ని కూడా చూడాల్సి ఉంటుంది.

 

మారడం కష్టం
ఒక కంపెనీ ఉత్పత్తిని విడిచి పెట్టి మరో కంపెనీ ఉత్పత్తికి మళ్లడం భారీ ఖర్చుతో కూడుకున్నది అయితే, మొదటి కంపెనీకి అది చాలా బలమైన అంశమే అవుతుంది. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ సాఫ్ట్‌వేర్‌. ఇది దాదాపు అన్ని కంప్యూటర్లకు అవసరమైనదిగా మారింది. మొదటి నుంచి అత్యధికంగా వినియోగంలో ఉన్న ఈ ఓఎస్‌ను మార్చుకోవడం చాలా కష్టమైన పనే. ఇక తక్కువ వ్యయానికే తయారు చేసే సామర్థ్యం ఉన్న కంపెనీ ఇతరుల కంటే రాణించగలదు. మార్జిన్లు తగ్గినా నిలదొక్కుకోగలదు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Tuesday 13th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:40 సమయంలో 48 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,503 పాయింట్లతో పోలిస్తే 52 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇక

అక్టోబర్‌లో ఫండ్స్‌ అమ్మకాలు, కొనుగోళ్లు వీటిల్లోనే

Monday 12th November 2018

అక్టోబర్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కరెక్షన్‌కు గురైనాగానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.22.23 లక్షల కోట్లకు పెరిగింది. ఈ కాలంలో ప్రధాన సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయి. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మాత్రం ఆగలేదు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ ఈ రెండు నెలల్లో మార్కెట్లు కరెక్షన్‌ బాట పట్టగా... ఈ కాలంలో రూ.7,727 కోట్లు, రూ.7,985 కోట్ల మేర సిప్‌ ద్వారా మ్యూచువల్‌

Most from this category