STOCKS

News


నేడే స్పెన్సర్స్‌ రిటైల్‌ లిస్టింగ్‌

Friday 25th January 2019
Markets_main1548356107.png-23789

సీఈఎస్‌సీ వెంచర్స్‌ కూడా


ఆర్‌పీ సంజీవ్‌ గోయంకా గ్రూపులోని సీఈఎస్‌సీ నుంచి డీమెర్జర్‌ చేసిన స్పెన్సర్స్‌ రిటైల్‌, సీఈఎస్‌సీ వెంచర్స్‌ కంపెనీల షేర్లు శుక్రవారం (జనవరి 25న) ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో లిస్ట్‌ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా గురువారం ప్రకటించింది. పశ్చిమబెంగాల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ సీఈఎస్‌సీ డీమెర్జర్‌కు సంబంధించిన సమాచారాన్ని, వివరణను కోరగా... దీనిపై కంపెనీ వివరణ కూడా ఇచ్చింది. కంపెనీ నుంచి వేరు చేస్తున్న కంపెనీలకు మాతృ సంస్థ నుంచి ఎటువంటి ప్రయోజనాలు అందడం లేదని తెలిపింది. అయితే, విద్యుత్‌ నియంత్రణ సంస్థ ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విద్యుత్‌ వ్యాపారం మినహా మిగిలిన వ్యాపారాలను వేరు చేసేందుకు కంపెనీల చట్టం కింద ఎన్‌సీఎల్‌టీ ఆమోదాన్ని సీఈఎస్‌సీ పొందింది. ప్రతీ 10 సీఈఎస్‌సీ షేర్లు (రూ.10 ముఖ విలువ కలిగినవి) ఉన్న వాటాదారులకు కంపెనీ ఇప్పటికే రెండు సీఈఎస్‌సీ వెంచర్స్‌ (రూ.10 ముఖ విలువ కలిగినవి) జారీ చేసింది. అలాగే, రూ.5 ముఖ విలువ కలిగిన 6 సెన్సర్స్‌ రిటైల్‌ షేర్లను కూడా మంజూరు చేసింది. 

 

స్పెన్సర్స్‌ రిటైల్‌ కింద అన్ని రిటైల్‌ విక్రయ శాలల వ్యాపారం వస్తుంది. సీఈఎస్‌సీ వెంచర్స్‌ లిమిటెడ్‌ కింద బీపీవో, రియల్‌ ఎస్టేట్‌, ఎఫ్‌ఎంసీజీ వస్తాయి. ఇక సీఈఎస్‌సీలో కేవలం విద్యుదుత్పత్తి, విద్యుత్‌ పంపిణీ విభాగాలే మిగిలి ఉంటాయి. పశ్చిమబెంగాల్‌ విద్యుత్‌ నియంత్రణ సంస్థ ఆమోదం లభించిన అనంతరం వీటిని రెండు కంపెనీలుగా వేరు చేయనుంది. నేడు లిస్ట్‌ అవుతున్న స్పెన్సర్స్‌ రిటైల్‌, సీఈఎస్‌సీ వెంచర్స్‌ షేర్లు పది రోజుల పాటు ట్రేడ్‌ టు ట్రేడ్‌ విభాగంలోనే కొనసాగుతాయి. సీఈఎస్‌సీ షేరు గురువారం ఎన్‌ఎస్‌ఈలో రూ.683 వద్ద క్లోజయింది. 



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌...నిఫ్టీ 60 పాయింట్లు జంప్‌

Friday 25th January 2019

సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లు జంప్‌ ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో 36,395 పాయింట్ల వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల పెరుగుదలతో 10,910 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. క్రితం రోజు అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ యస్‌ బ్యాంక్‌ మరో​ 8 శాతం ట్రేడింగ్‌ ప్రారంభంలో జంప్‌చేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌,

ఈ ఆరు కంపెనీలు మల్టీబ్యాగర్లు...!?

Friday 25th January 2019

నేడు చిన్నగా ఉన్న కంపెనీలే... రేపు లార్జ్‌క్యాప్‌, బ్లూచిప్‌ కంపెనీలుగా అవతరిస్తాయి. చిన్నగా ఉన్నాయని అన్నింటికీ దూరంగా ఉండడం కూడా తెలివైన నిర్ణయం కాకపోవచ్చు. ఇందుకు ఉదాహరణ మారికో కంపెనీయే. శిరోజాల నూనెల మార్కెట్లో చిన్న కంపెనీగా మొదలు పెట్టి మార్కెట్‌ లీడర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. ‘‘మంచి యాజమాన్యాలు చిన్న అవకాశాలను సైతం పెద్దవిగా మలుచుకుంటాయి. సమర్థవంతమైన చిన్న కంపెనీలు పెద్దగా అవతరించగలవు’’ అని ఎలారా సెక్యూరిటీస్‌ ఎండీ

Most from this category