STOCKS

News


లిస్టైన తొలిరోజే...స్పెన్సర్‌ రిటైల్‌ లోయర్‌ సర్య్కూట్‌

Friday 25th January 2019
Markets_main1548400505.png-23802

స్పెన్సర్స్‌ రిటైల్‌, సీఈఎస్‌ షేర్లు ఎ‍క్చే‍్సంజీల్లో లిస్టైన మొదటి రోజే లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యాయి. సంజీవ్‌ గోయంకా గ్రూపు కంపెనీ సీఈఎస్‌సీ నుంచి విభజించబడిన స్పెన్సర్స్‌ రిటైల్‌, సీఈఎస్‌సీ వెంచర్స్‌ కంపెనీల షేర్లు నేడు ఎక్చే‍్సంజ్‌లో లిస్ట్‌ అయ్యాయి. అయితే ఇరు షేర్ల కౌంటర్లో కొనుగోళ్లు కరువవడంతో లిస్టైన కాసేపటికే రెండు షేర్లు 5శాతం క్షీణించి ఇరు ఎక్చే‍్సంజీల్లో లోయర్‌ సర్క్యూట్‌ వద్ద లాక్‌ అయ్యాయి.స్పెన్సర్స్‌ రిటైల్‌ కింద అన్ని రిటైల్‌ విక్రయ శాలల వ్యాపారం వస్తుంది. సీఈఎస్‌సీ వెంచర్స్‌ లిమిటెడ్‌ కింద బీపీవో, రియల్‌ ఎస్టేట్‌, ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాలు నడుస్తుంటాయి.
స్పెన్సర్స్‌ రిటైల్‌:- బీఎస్‌ఈలో రూ.224.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపకపోవడంతో ఇంట్రాడేలో 5శాతం నష్టపోయి రూ.212.80ల కనిష్టాన్ని తాకి లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యాయి.
సీఈఎస్‌సీ వెంచర్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.548.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపకపోవడంతో ఇంట్రాడేలో 5శాతం(రూ.27.40) నష్టపోయి రూ.520.60ల లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీ‍జ్‌ అయ్యాయి.



You may be interested

యస్‌ బ్యాంక్‌ షేరుపై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయ్‌!

Friday 25th January 2019

కొత్త సీఈఓ నియామకంతో యస్‌ బ్యాంక్‌ షేరు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి... 1. మోతీలాల్‌ ఓస్వాల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 270. మేనేజ్‌మెంట్‌ సమస్య తీరినందున ఇకపై కీలకాంశాలపై బ్యాంకు దృష్టి సారించనుంది. మూలధన సమీకరణ, కార్పొరేట్‌ గవర్నెన్స్‌, ఉద్యోగుల్లో నైతికత పెంపు తదితర అంశాలపై ఫోకస్‌ పెట్టనుంది. రాబోయే సంవత్సరాల్లో నికరలాభంలో 9- 12 శాతం వృద్ది ఉండొచ్చు. 2. ఎడెల్‌వీజ్‌: కొనొచ్చు.

ఆదిత్యా బిర్లా సన్‌లైప్‌...మంత్లీ ఇన్‌కమ్‌ప్లాన్‌

Friday 25th January 2019

ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్‌ పేరిట వినూత్నమైన బీమా పథకాన్ని ఆవిష్కరించింది. కాల వ్యవధి తీరేంత వరకు ఈ ప్లాన్‌ నెలవారీ ఆదాయాన్నిస్తుందని సంస్థ తెలియజేసింది. పాలసీ ప్రీమియం చెల్లింపు ముగిసిన తర్వాత నుంచి పాలసీ కాల వ్యవధి ముగిసేంత వరకు ఏటా సమ్‌ అష్యూర్డ్‌లో ఒక శాతాన్ని నెలవారీ చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. ఇన్వెస్టర్లు తమకు ఇష్టమైతే నెలవారీ ఒక శాతం ఆదాయాన్ని

Most from this category