STOCKS

News


వచ్చే ఏడాది కాలానికి టాప్‌-5 స్టాక్స్‌

Friday 7th September 2018
Markets_main1536306691.png-20059

వచ్చే ఏడాది కాలానికి గానూ ఇన్వెస్ట్‌ చేయడానికి అనువైన టాప్‌-5 స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ డైరెక్టర్‌, సీఐవో శైలేంద్ర కుమార్‌. అవేంటో ఒకసారి చూద్దాం..

స్టాక్‌: లార్సెన్‌ అండ్‌ టుబ్రో
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.1,350
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,734
రిటర్న్‌ అంచనా: 22 శాతం
కంపెనీ మేనేజ్‌మెంట్‌ భవిష్యత్‌పై ధీమాగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కల్లా రెవెన్యూను రూ.2 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే మర్జిన్లను 10 శాతం నుంచి 11.6 శాతానికి మెరుగుపరచుకోవాలని ప్రయత్నిస్తోంది. రిటర్న్‌ రేషియో మెరుగుదలపై కూడా దృష్టి కేంద్రీకరించింది. వార్షికంగా చూస్తే ఆర్డర్లు 36 శాతంమేర పెరిగాయి. దేశీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులు ఇందుకు కారణం. అందువల్ల ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. స్టాక్‌కు సమీప కాల టార్గెట్‌ రూ.1,734గా నిర్ణయించాం. 

స్టాక్‌: యాక్సిస్‌ బ్యాంక్‌ 
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.643
టార్గెట్‌ ప్రైస్‌: రూ.710
రిటర్న్‌ అంచనా: 10 శాతం
రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ సైకిల్‌ ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిందని భావిస్తున్నాం. గత నాలుగు త్రైమాసికాల్లో అడ్వాన్స్‌లు సగటున 17 శాతంమేర పెరిగాయి. రిటైల్‌ అడ్వాన్స్‌లు 48 శాతానికి చేరాయి. ఆర్‌వోఈ/ఆర్‌వోఏ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 16 శాతానికి/1.4 శాతానికి మెరుగుపడొచ్చని అంచనాలున్నాయి. అందువల్ల స్టాక్‌కు సమీప కాల టార్గెట్‌ను రూ.710గా నిర్ణయించాం. 

స్టాక్‌: మారికో
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.357
టార్గెట్‌ ప్రైస్‌: రూ.430
రిటర్న్‌ అంచనా: 18 శాతం
మారికో గత రెండేళ్లుగా ఎదుర్కొంటూ వస్తున్న ప్రమోషన్స్‌, ఆధునిక వ్యాపార సమస్యలు పరిష్కారమౌతున్నాయి. సఫోలా బిజినెస్‌ క్రమంగా రికవరీ అవుతుందనే అంచనాలున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెండంకెల వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. స్థిర కరెన్సీ రూపంలో వచ్చే మూడు క్వార్టర్లలో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లోనూ రెండంకెల వృద్ధి ఉంటుందని భావిస్తున్నాం. 2018-19 రెండో అర్ధభాగంలో మెరుగైన మార్జిన్లను ప్రకటించాల్సి ఉంది. స్టాక్‌కు సమీప కాల టార్గెట్‌ను రూ.430గా నిర్ణయించాం. 

స్టాక్‌: ఇన్ఫోసిస్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.731
టార్గెట్‌ ప్రైస్‌: రూ.840
రిటర్న్‌ అంచనా: 13 శాతం
ఇన్ఫోసిస్‌ మేనేజ్‌మెంట్‌ సమస్యలు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. కంపెనీ వృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. ఇన్ఫోసిస్‌ ఇటీవలే 1.1 బిలియన్‌ డాలర్ల విలువైన టీసీవీ డీల్స్‌ను ఓకే చేసింది. డీల్స్‌, డిజిటల్‌ అంశాలు భవిష్యత్‌ వృద్ధికి దోహదపడతాయి. డిజిటల్‌ విభాగంలో త్రైమాసికం పరంగా 8 శాతం వృద్ధి నమోదవుతోంది. క్యూ2 నుంచి ఫైనాన్షియల్‌ సర్వీస్‌ విభాగంలోనూ వృద్ధి మెరుగుపడొచ్చనే అంచనాలున్నాయి. స్టాక్‌కు సమీప కాల టార్గెట్‌ను రూ.840గా నిర్ణయించాం. 

స్టాక్‌: డిక్సన్‌ టెక్నాలజీస్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.2,775
టార్గెట్‌ ప్రైస్‌: రూ.3,350
రిటర్న్‌ అంచనా: 16 శాతం
డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రధానంగా కన్సూమర్‌ డ్యూరబుల్స్‌, లైటింగ్‌, మొబైల్‌ ఫోన్స్‌ మార్కెట్‌కు సంబంధించిన ప్రొడక్టుల మ్యానుఫ్యాక్చరింగ్‌ సేవలందిస్తోంది. సామర్థ్యం పెంపు, కొత్త క్లయింట్స్‌ పెరుగుదల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వృద్ధి 25 శాతంగా ఉండొచ్చని అంచనా. స్టాక్‌కు సమీప కాల టార్గెట్‌ను రూ.3,350గా నిర్ణయించాం. 
 You may be interested

మురిపించిన మెటల్‌ షేర్లు

Friday 7th September 2018

మెటల్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో మురిపించాయి. మిడ్‌సెషన్‌ సమయానికి మెటల్‌ షేర్లలో నెలకొన్న కొనుగోళ్లతో బీఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం వరకూ లాభపడింది. మధ్యాహ్నం గం.1:20ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(13776)తో పోలిస్తే 2శాతం లాభంతో 14048 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలో భాగమైన 10 షేర్లకు గానూ మొత్తం 9షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా హిందూస్థాన్‌ జింక్‌ మాత్రం అరశాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎండీసీ అత్యధికంగా 6శాతం లాభపడింది. హిందాల్కో

నష్టాల్లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు

Friday 7th September 2018

2శాతం నష్టపోయిన ఎస్‌బీఐ షేరు మిడ్‌సెషన్‌ సమయానికి స్తబ్దుగా ట్రేడ్‌ సాగుతున్న మార్కెట్‌ ర్యాలీలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ప్రభుత్వ రంగ షేర్లకి ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ ఇంట్రాడేలో అత్యధికంగా 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం 12:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు (3161)తో పోలిస్తే 1.21శాతం నష్టంతో 3,124.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈసూచీలోని మొత్తం 11 షేర్లకు

Most from this category