News


మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ ఆకర్షణీయం

Monday 16th July 2018
Markets_main1531723703.png-18343

  • ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కో-చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఈక్విటీస్‌) మహేశ్‌ పాటిల్‌ వ్యాఖ్య

ఇన్వెస్టర్లు వచ్చే మూడేళ్లలో ఈక్విటీ మార్కెట్‌ నుంచి 12-13 శాతం మేర రాబడులను అందుకోవచ్చని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కో-చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఈక్విటీస్‌) మహేశ్‌ పాటిల్‌ పేర్కొన్నారు. రిస్క్‌, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మిడ్‌క్యాప్స్‌ నుంచి కొంచెం ఎక్కువ రిటర్న్స్‌ను పొందొచ్చన్నారు. స్వల్పకాలంలో మిడ్‌క్యాప్స్‌ అండర్‌పెర్‌ఫార్మ్‌ చేయవచ్చని, అందువల్ల ఇన్వెస్టర్లు వచ్చే ఆరు నెలల కాలంలో మిడ్‌క్యాప్స్‌ పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ విభాగాల్లో స్టాక్‌ విలువలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. అయితే కంపెనీల రాబడులు మాత్రం పెరిగాయని పేర్కొన్నారు. తాము వాహన కంపెనీలు, ప్రైవేట్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, కన్సూమర్‌ గూడ్స్‌ సంస్థలు, మీడియా, మెటల్స్‌, ఇన్‌ఫ్రా షేర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. 
ఐటీ షేర్ల విషయానికి వస్తే..
టెక్నాలజీ విభాగంలో పీఈ విలువ ఎక్కువగా ఉందని మహేశ్‌ తెలిపారు. వృద్ధి సహా ఐటీ రంగం అంచనాలు బాగున్నాయని పేర్కొన్నారు. డిజిటల్‌ బిజినెస్‌లో మంచి వృద్ధి నమోదు  అవుతోందన్నారు. రూపాయి మారక విలువ తగ్గుదల వల్ల కంపెనీల ఆదాయం బాగుంటుందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పెరుగుదల, రీరేటింగ్‌ తర్వాత స్టాక్‌ రిటర్నులు అంత గొప్పగా ఏమీ ఉండకపోవచ్చని అంచనా వేశారు. చాలా కంపెనీలు బైబ్యాక్‌ చేస్తున్నాయని, ఇది సానుకూల అంశమని పేర్కొన్నారు.
ఫార్మాకు మంచి రోజులు వెళ్లిపోయాయి
 ‘ఫార్మాకు మంచి రోజులు వెళ్లిపోయాయి. జెనరిక్స్‌ విభాగంలో బలమైన వృద్ధి చూశాయి. 25-30 శాతం వృద్ధి చెందాయి. అయితే ప్రస్తుతం ఈ బిజినెస్‌ ప్రతికూలంగా ఉంది. అయినప్పటికీ 12-14 శాతం శ్రేణిలో స్థిరపడొచ్చు’ అని మహేశ్‌ వివరించారు. అమెరికా మార్కెట్‌లో ధరలపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉందని, కంపెనీలు వ్యయాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. ఫార్మా రంగపు రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌ (ఆర్‌వోసీఈ) 30 శాతం నుంచి 10 శాతానికి వచ్చిందని,  అందువల్ల స్వల్ప కాలంలో ఫార్మా షేర్లపై బుల్లిష్‌గా లేమని తెలిపారు.  
మరో ఏడాది బ్యాంకులపై ఒత్తిడి
బ్యాంకుల స్థూల మొండిబకాయిలు రూ.9 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే వీటిపై రూ.13 లక్షల కోట్ల ఒత్తిడి ఉంటుంది. ప్రభుత్వ, కార్పొరేట్‌ బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లపై మరో ఏడాది పాటు ఒత్తిడి కొనసాగవచ్చని మహేశ్‌ అభిప్రయపడ్డారు. వృద్ధి పుంజుకుంటే ఒత్తిడి తగ్గుతుందన్నారు. మరోవైపు వాహన విక్రయాలు, విమాన ప్రయణీకులు, ఇంధన వినియోగం, వాణిజ్య వాహనాలు వంటి వాటిల్లో పెరుగుదల కనిపించిందని తెలిపారు. కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు భవిష్యత్‌ వృద్ధిపై విశ్వాసంతో ఉన్నాయని పేర్కొన్నారు. వృద్ధి పుంజుకొని, స్థిరంగా కొనసాగితే.. వ్యాపార విశ్వాసం పెరుగుతుందని, అప్పుడు కార్పొరేట్‌ పెట్టుబడుల్లో వృద్ధి కనిపిస్తుందని తెలిపారు. స్టీల్‌, సిమెంట్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్లు జోరందుకుంటాయని పేర్కొన్నారు. 

 You may be interested

మొండిబాకీల పరిష్కారంలో పీఎన్‌బీ

Monday 16th July 2018

న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణంతో బాగా దెబ్బతిన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మొండిబాకీల రికవరీపై గట్టిగా దృష్టి సారించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం ఆసాంతం రాబట్టిన మొండిబాకీల (ఎన్‌పీఏ) మొత్తాలను .. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే అధిగమించింది. "గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,400 కోట్లు రికవర్ చేసుకోగా.. ఈసారి తొలి త్రైమాసికంలోనే రూ. 7,700 కోట్లు రాబట్టగలిగాం. తొలి త్రైమాసికంలో 2-3 పెద్ద

డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 10 శాతం క్రాష్‌

Monday 16th July 2018

డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరెటరీస్‌ షేరు ట్రేడింగ్‌ మార్నింగ్‌ సెషన్‌లో 10 శాతనికిపైగా పడిపోయింది. న్యూజెర్సీ డిస్ట్రిక్‌ కోర్టు తన ప్రాథమిక దర్యాప్తులో పేటెంట్‌ నెం.9,931,305కి సంబంధించి కంపెనీకి వ్యతిరేకంగా తాత్కాలిక ఉత్తర్వులను జారీచేసింది. దీనివల్ల పేటెంట్‌ సమస్య తీరేంతవరకు రెడ్డీస్‌ ల్యాబ్స్‌కి అమెరికా మార్కెట్‌లో సుబొక్సొన్‌ జెనరిక్‌ను విక్రయించడానికి వీలుండదు. ఈ నేపథ్యంలో రెడ్డీస్‌ షేరు ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి 15 నిమిషాల్లోనే 10.7 శాతానికిపైగా పడిపోయింది. ఇదే నిఫ్టీ టాప్‌

Most from this category