News


మీ మార్కెట్‌ పెట్టుబడులపై వీటి ఎఫెక్ట్‌..

Tuesday 2nd October 2018
Markets_main1538475005.png-20796

మిడ్‌క్యాప్స్‌ పతనం, రూపాయి క్షీణత, క్రూడ్‌ ధరల పెరుగుదల, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ ఆందోళనలు.. వీటన్నింటినీ మార్కెట్‌ చూసేసింది. మార్కెట్‌ గత శుక్రవారం ఒక్క దెబ్బతో ఇన్వెస్టర్ల సంపదను ఊడ్చుకెళ్లింది. ప్రస్తుత ఒడిదుడుకుల మీ పోర్ట్‌ఫోలియో సురక్షింతంగా ఉందా? వచ్చే ఆరు నెలల కాలంలో ఏ ఏ అంశాలు స్టాక్స్‌ రిటర్న్స్‌ను ప్రభావితం చేయబోతున్నాయి? ఒకసారి చూడండి.. 

రూపాయి
ప్రస్తుత ఏడాది రూపాయి 13 శాతంమేర పతనమైంది. ఆసియా ప్రాంతంలో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన కరెన్సీ మనదే. రూపాయి విలువ తగ్గిందంటే.. అది ఎగుమతిదారులకు సానుకూల అంశం. వారు ఆదాయాన్ని డాలర్లలో సంపాదిస్తారు. అయితే మొత్తంగా చూస్తే.. దేశీ కరెన్సీ తగ్గుదల వల్ల ధరలు పెరుగుతాయి. స్థూల ఆర్థికాంశాలు క్షీణించినట్లు కనిపిస్తుంది. దీని వల్ల మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. మీ పోర్ట్‌ఫోలియో కూడా మార్కెట్‌లో భాగమే కదా? అప్పుడు దీనిపై కూడా నెగటివ్‌ ప్రభావం ఉంటుంది. 

క్రూడ్‌
క్రూడ్‌ ధరల పెరుగుదలతో భారత్‌కు ఎప్పుడు ప్రమాదమే. క్రూడ్‌ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశం మనది. ముడి చమురు ధర తాజాగా బ్యారెల్‌కు 85 డాలర్లను దాటేసింది. ఇప్పుడు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలపై మార్కెట్‌ దృష్టి కేంద్రీకృతమౌతుంది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు వచ్చే నెలలో అమల్లోకి రానున్నాయి. అలాగే ఒపెక్‌ దేశాలు క్రూడ్‌ ఉత్పత్తిని పెంచాలని అమెరికా అధ్యక్షుడు కోరుతున్నా కూడా ఫలితం కనిపించడం లేదు. సరఫరా తగ్గుదల భయాల వల్ల ధర పెరుగుతోంది. క్రూడ్‌ ధరలు సమీప కాలంలో 100 డాలర్లకు కూడా వెళ్లొచ్చనే అంచనాలున్నాయి.  

ఎన్నికలు
2019లో లోక్‌ సభ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితం స్టాక్‌ మార్కెట్‌ఫై ప్రభావం చూపనుంది. అలాగే లోక్‌ సభ ఎన్నికలకు ముందుగానే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిల్లో ప్రజా తీర్పు ఎలా ఉంటుందో చెప్పలేం. ఏం జరిగినా కూడా స్టాక్స్‌ కదలికలపై దాని ప్రభావం ఉంటుంది. 

ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు
వినియోగదారుడి కొనుగోలు సామర్థ్యాన్ని ఈ రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఆహార ధరలు తగ్గడం వల్ల రిటైల్‌ ద్రవ్యోల్బణం, టోకు ద్రవ్యోల్బణం రెండూ కూడా ఇటీవల కాలంలో తగ్గాయి. రానున్న కాలంలో చాలా స్టాక్స్‌ పనితీరు.. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుంది. ఆర్‌బీఐ తన పని తాను చేసుకొని వెళ్తోంది. జూన్‌ నుంచి రెండు సార్లు వడ్డీ రేట్లు పెంచింది. ఇప్పుడు కూడా రేట్లు పెంపు ఉండొచ్చనే అంచనాలున్నాయి.  

వాణిజ్య ఉద్రిక్తతలు
అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగే కొద్ది.. సాధారణంగా కమోడిటీ స్టాక్స్‌పై నెగటివ్‌ ప్రభావం పడుతుంది. ఇరు దేశాలు టారిఫ్‌లు విధించడం ఇందుకు కారణం. అమెరికా-చైనా దేశాల మధ్య ట్రేడ్‌ వార్‌ వల్ల ఇండియా ప్రయోజనం పొందొచ్చు. ఎగుమతులను పెంచుకోవచ్చు. దీంతో ఎగుమతి ఆధారిత స్టాక్స్‌ మంచి పనితీరు కనబర్చవచ్చు.

స్థూల ఆర్థికాంశాలు
రూపాయి క్షీణత 2013 నాటి టాపర్‌ ట్యాంట్రమ్‌ ఘటనలను గుర్తుకు తీసుకురావొచ్చు. స్థూల ఆర్థికాంశాలు మొత్తంగా చూస్తే బలంగానే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా భారత్‌ కొనసాగుతున్నప్పటికీ.. కరెంట్‌ అకౌంట్‌ లోటు ఆందోళనలను రేకితిస్తున్నాయి. ద్రవ్యలోటు కూడా భయాలను కలిగిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టర్లలో భయాలను తొలగించాలని ప్రయత్నిస్తోంది. 

ఎర్నింగ్స్‌ 
ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న కొద్ది.. కంపెనీలు వాటి కొనుగోలు శక్తిని తిరిగి సంపాదించుకుంటాయి. గ్లోబల్‌ ట్రేడ్‌ వార్‌ వల్ల కమోడిటీ ధరలు తగ్గడం వల్ల కంపెనీల లాభదాయకత పెరుగుతుంది. అన్నీ అనుకున్న విధంగా జరిగితే కంపెనీల ఎర్నింగ్స్‌ పుంజుకుంటాయి. అయితే రుణ సమీకరణ వ్యయాలు పెరగుగుదల రిస్క్‌ అంశం. మరోవైపు ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్స్‌ 8 శాతానికిపైగా చేరాయి. 

అమెరికా వృద్ధి
అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఇటీవలే వడ్డీ రేట్లను పెంచింది. దీంతో డాలర్‌ బలపడింది. ట్రేజరీ ఈల్డ్స్‌ పెరుగుదల వల్ల, వర్ధమాన దేశాల నుంచి ఇన్వెస్ట్‌మెంట్లు అమెరికాకు వెళ్లిపోతాయి. అలాగే సెంట్రల్‌ బ్యాంక్‌ రానున్న కాలంలోనూ రేట్ల పెంపు ఉంటుందని సాంకేతాలిచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ వచ్చే 3 ఏళ్ల వరకు ఎలాంటి మాంద్యం పరిస్థితులను ఎదుర్కొకపోవచ్చని అంచనా వేసింది. 

అంతర్జాతీయ పరిస్థితులు
బ్రెగ్జిట్‌ను చూశాం. అలాగే టర్కీ, అర్జెంటీనా, ఇండోనేసియాలలో పరిస్థితులు ఆశాజనకంగా లేవు. అమెరికా.. ఇరాన్‌, కొరియా వంటి దేశాలపై ఆంక్షలు విధించింది. చైనా- అమెరికాకు మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఎలాగో కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు మార్కెట్లపై ప్రభావం చూపొచ్చు.

ఎఫ్‌ఐఐ కదలికలు
దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్లు ఎంత మొత్తంలో నిధులు తీసుకువచ్చారనే దానికి ఇది ఒక ఇండికేటర్‌. ఏ కొద్ది చిన్న నెగటివ్‌ వార్త వెలువడిన వీళ్లు ఇన్వెస్ట్‌మెంట్లను వెనక్కు తీసుకెళ్లిపోతారు. లిక్విడిటీ భయాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందువల్ల వీరి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.     


 You may be interested

గెయిల్‌, ఐఓసీల్లో వాటాను ఇప్పట్లో విక్రయించం: ఓఎన్‌జీసీ

Tuesday 2nd October 2018

ముంబై:-  గెయిల్‌, ఐఓసీ కంపెనీల్లో తమ వాటాను ఇప్పట్లో విక్రయించేది లేదని ప్రభుత్వరంగ సం‍స్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్ప్‌(ఓఎన్‌జీసీ) తేల్చి చెప్పింది. ఇరు సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించి సరైన సమయంతో పాటు, ధర కోసం ఎదురుచూస్తున్నామని ఓఎన్‌జీసీ సీనియర్‌ అధికారి అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీకి ఐఓసీ, గెయిల్ కంపెనీల నుంచి డివిడెండ్ రూపంలో రూ.3వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మూలధనంపై మంచి

వీటిని కొనొచ్చా?

Tuesday 2nd October 2018

బీఈఎల్‌, అవంతి ఫీడ్స్‌ స్టాక్స్‌ను హోల్డ్‌ చేయవచ్చని, సుజ్లాన్‌, మిందా ఇండస్ట్రీస్‌ షేర్లను విక్రయించొచ్చని సిఫార్సు చేస్తున్నారు ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ ఫౌండర్‌ జి.చొక్కాలింగం. ఆయన ఒక ఆంగ్ల చానల్‌లో...ఇంకా ఏం చెప్పారో ఆయన మాటాల్లోనే.. ప్ర: నేను రూ.3,700 వద్ద 500 లక్ష్మీ మెషీన్‌ వర్క్స్‌ షేర్లు కొన్నాను. అలాగే రూ.175 వద్ద 20,000 మిందా ఇండస్ట్రీస్‌ షేర్లు కొనుగోలు చేశాను. వీటిని ఇంకా హోల్డ్‌ చేయవచ్చా? లక్ష్మీ మెషీన్‌

Most from this category