STOCKS

News


స్మాల్‌ క్యాప్‌ ర్యాలీ కొనసాగేనా?!

Tuesday 12th March 2019
Markets_main1552413708.png-24565

స్మా్‌ల్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీల నాన్‌స్టాప్‌ ప్రతికూల పనితీరు ఇక ముగిసినట్టేనా...? సూచీల పనితీరు, స్టాక్స్‌ ర్యాలీని గమనిస్తే విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థలు ఇదే అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టర్‌ అనిల్‌కుమార్‌ గోయల్‌ పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ నెల రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 18 నుంచి 46 శాతం పెరగడం గమనార్హం. బాగా పడి ఉండడం, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి తాజా నిధుల రాకతో ప్రధాన సూచీల ర్యాలీకి మద్దతుగా మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ కూడా గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నాయి. 

 

అనిల్‌కుమార్‌ గోయల్‌ పోర్ట్‌ఫోలియోలో, డిసెంబర్‌ ముగిసే నాటికి 1 శాతానికి పైగా వాటాలున్న కంపెనీల పనితీరును పరిశీలిస్తే... శివమ్‌ ఆటోటెక్‌  పిబ్రవరి 18 నుంచి 47 శాతం పెరిగింది. తిరుమలై కెమికల్స్‌ 46 శాతం, పనామా పెట్రోకెమ్‌ 42 శాతం, ఐటీ పెట్రెకెమికల్స్‌ 37 శాతం, మజ్దా 37 శాతం చొప్పున పెరిగాయి. అలాగే, శ్రీకాళహస్తి పైప్స్‌, ఉత్తమ్‌ షుగర్‌ మిల్స్‌, స్టార్‌ పేపర్‌ మిల్స్‌ కూడా 30 శాతం వరకు పెరిగాయి. మొత్తం మీద గోయల్‌ పోర్ట్‌ఫోలియోలోని 24 స్టాక్స్‌ 10 శాతానికి పైగా పెరగ్గా, ఫిబ్రవరి కనిష్టాల నుంచి 16 స్టాక్స్‌ 20 శాతానికి పైగా పెరిగాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫిబ్రవరి కనిష్ట స్థాయి 13,784 నుంచి 8 శాతం పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో 51 వారాల కనిష్ట స్థాయి 13,538 నమోదు చేసిన విషయం గమనార్హం. 

 

‘‘గత కొన్ని రోజులుగా మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో మనం చూసినది వేగవంతమైన ర్యాలీ. ఈ విభాగాలు బాగా పడిపోయి ఉండడంతో ఇది జరగాల్సినదే. చాలా వరకు పెట్టుబడుల విలువ ఈ విభాగాల్లో హరించుకుపోయింది. అయితే, ఈ ర్యాలీ కొనసాగుతుందా? అంటే లిక్విడిటీపైనే ఆధారపడి ఉంటుంది’’ అని అనలిస్ట్‌ ఆనంద్‌ టాండన్‌ పేర్కొన్నారు. పన్ను ఆదా సీజన్‌కు వచ్చేశాం కనుక లిక్విడిటీ కొరత ఉండొచ్చన్నారు. ఈ ర్యాలీ కొనసాగితే, ముఖ్యంగా స్మాల్‌క్యాప్‌ విభాగంలో... అది ఆశ్చర్యమే అవుతుందన్నారు. చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్‌తో స్మాల్‌క్యాప్‌ ప్రతికూల పనితీరు ముగింపుకు వచ్చినట్టేనని బీఅండ్‌కే సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. 



You may be interested

2-3 ఏళ్లలో రెట్టింపు స్థాయికి రిలయన్స్‌ స్టాక్‌: దేవేన్‌చోక్సే

Tuesday 12th March 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్టాక్‌ వచ్చే రెండు మూడేళ్లలో ఈ స్థాయి నుంచి 100 శాతం పెరుగుతుందని కేఆర్‌ చోక్సే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవేన్‌చోక్సే అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలను ఆయన ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. జియో, రిలయన్స్‌ రిటైల్‌ ఎబిట్డా వార్షికంగా 27,000-28,000 కోట్లు ఉంటుందని, వచ్చే మూడు నాలుగేళ్ల కాలంలో వార్షికంగా ఇది 25-30 శాతం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇదే జరిగితే జియో, రిటైల్‌

ఇండెక్స్‌ ర్యాలీలో ఏయే షేర్ల వాటా ఎంత..?

Tuesday 12th March 2019

అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీతో పాటు ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతవరణం, డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం తదితర కారణాలతో సూచీలు రెండో రోజూ  లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 481 పాయింట్లు లాభపడి 37,535 వద్ద, నిఫ్టీ 133 పెరిగి 11,301 వద్ద స్థిరపడ్డాయి. -    నేడు నిఫ్టీ ఆర్జించిన మొత్తం 152 పాయింట్ల లాభంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 22 పాయింట్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 22 పాయింట్లును, ఐసీఐసీఐ బ్యాంక్‌ 20 పాయిం‍ట్లను,

Most from this category