STOCKS

News


ఈ స్మాల్‌క్యాప్స్‌ ఇకపై మిడ్‌క్యాప్స్‌!!

Wednesday 26th December 2018
Markets_main1545814074.png-23242

స్మాల్‌క్యాప్‌ బాస్కెట్‌లో ఉన్న దాదాపు 15 స్టాక్స్‌ మిడ్‌క్యాప్‌ కేటగిరిలోకి మారనున్నాయి. అదేసమయంలో మిడ్‌క్యాప్‌లోని కొన్ని స్టాక్స్‌ స్మాల్‌క్యాప్‌ విభాగంలోకి రానున్నాయి. లార్జ్‌క్యాప్‌- మిడ్‌క్యాప్‌ మధ్య కొన్ని స్టాక్స్‌ అటూఇటూ బదిలీ కానున్నాయి. మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ కొత్త పునఃవర్గీకరణ నిబంధనల్లో భాగంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ సమాఖ్య యాంఫీ త్వరలో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రకారం ఏ ఏ స్టాక్స్‌ ఏ కేటగిరిలో ఉండాలో తెలిపే కొత్త జాబితాలను ప్రకటించనుంది. ఇందులో ఏ ఏ స్టాక్స్‌ ఎటువైపు మారింది కనిపించనుంది.
బాటా ఇండియా, అలెంబిక్‌ ఫార్మా, ఆర్తి ఇండస్ట్రీస్‌, మహీంద్రా సీఐఈ, సోలార్‌ ఇండస్ట్రీస్‌, ఇప్కా ల్యాబ్స్‌, రెలాక్సో ఫుట్‌వేర్‌, ఫొనిక్స్‌ మిల్స్‌ వంటి స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మిడ్‌క్యాప్‌ కేటగిరిలోకి రావొచ్చు. అందువల్ల మిడ్‌క్యాప్స్‌ ఫండ్స్‌ ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి వీలుపడుతుంది. కొత్తగా లిస్టైన వారాకో ఇంజినీర్స్‌, డీమెర్జ్‌డ్‌ సంస్థ అదానీ గ్యాస్‌ వంటి స్టాక్స్‌ కూడా మిడ్‌క్యాప్‌లోనే కొనసాగవచ్చని ఎడెల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 
దిలీప్‌ బిల్డ్‌కాన్‌, జేఎం ఫైనాన్షియల్‌, స్పార్క్‌, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌ వంటి మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ స్మాల్‌క్యాప్‌ కేటగిరిలోకి రావొచ్చు. ప్రస్తుతం మిడ్‌క్యాప్‌ కేటగిరిలో ఉన్న దివీస్‌ ల్యాబ్స్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ వంటి స్టాక్స్‌ లార్జ్‌క్యాప్‌ విభాగంలోకి వెళ్లిపోవచ్చు. లార్జ్‌క్యాప్స్‌లోని భారత్‌ ఫోర్జ్‌, సన్‌ టీవీ నెట్‌వర్క్‌, ఆదిత్య బిర్లా క్యాప్‌, భెల్‌, టీవీఎస్‌ మోటార్స్‌ వంటి స్టాక్స్‌ మిడ్‌క్యాప్‌ కేటగిరిలోకి రావొచ్చు. 
సెబీ నిబంధనల కారణంగా యాంఫీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్టాక్స్‌ పునఃవర్గీకరణ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జనవరి-జూన్‌ కాలానికి గానూ కొత్త లార్జ్‌క్యాప్స్‌, మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌కు సంబంధించి యాంఫీ కొత్త జాబితాను విడుదల చేయాల్సి ఉంది. ఈ కొత్త జాబితాకు అనుగుణంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా వారి పోర్ట్‌ఫోలియోలను ఒక నెల కాలంలో సవరించుకోవాల్సి ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం ఆరు నెలల సగటు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా స్టాక్స్‌ను ఏ కేటగిరిలో ఉంచాలో యాంఫీ ఒక నిర్ణయం తీసుకోవాలి. అధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కలిగిన తొలి వంద కంపెనీలను లార్జ్‌క్యాప్స్‌గా, అటుతర్వాత 101-250 కంపెనీలను మిడ్‌క్యాప్స్‌గా, 250కిపైన ఉన్న కంపెనీలకు స్మాల్‌క్యాప్స్‌గా పరిగణించాలి.



You may be interested

మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌

Wednesday 26th December 2018

మిడ్‌సెషన్‌ నుంచి వెల్లువెత్తిన కొనుగోళ్లతో బుధవారం మార్కెట్‌ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్ల రికవరీ కారణంగా సూచీల మూడు రోజు నష్టాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ సూచి 179 పాయింట్ల లాభంతో 35,650 వద్ద, నిఫ్టీ సూచీ 66పాయింట్ల లాభంతో 10,730 వద్ద ముగిసింది. అంతర్జాతీయ పరిణామాలతో భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 400పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 100

భారీ నష్టాల నుంచి బ్యాంకింగ్‌ షేర్ల రికవరీ

Wednesday 26th December 2018

మిడ్‌సెషన్ సమయంలో మార్కెట్లో నెలకొన్న ఆకస్మిక కొనుగోళ్లతో బ్యాంకింగ్‌ షేర్లు భారీ నష్టాల నుంచి రికవరి అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడు 26,634.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ తొలిదశలో బ్యాంకింగ్‌ షేర్ల పతనంతో ఒకానొక దశలో 1.50శాతం(300 పాయింట్లు) నష్టపోయి 26,408.15 కనిష్టానికి చేరుకుంది. అటుతర్వాత కనిష్టస్థాయిలో కొనుగోళ్లు జరగడంతో నష్టాల్లోంచి లాభాల్లో మళ్లింది. కనిష్టస్థాయి(26,408.15) నుంచి దాదాపు 500 పాయింట్ల రికవరీ అయ్యి 26,905.30 వద్ద గరిష్టాన్ని తాకింది.

Most from this category