STOCKS

News


మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల ర్యాలీ

Monday 31st December 2018
Markets_main1546253389.png-23334

ముంబై:- ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ నిఫ్టీ స్వల్ప నష్టాలతో ముగిసినప్పటికీ..,  ఇంట్రాడేలో మిడ్‌ క్యాప్‌, స్మాల్మ్‌ క్యాప్‌ షేర్లు లాభాల మోత మోగించాయి. బీఎస్‌ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ దాదాపు 1శాతం వరకు లాభపడ్డాయి.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌:- నేడు 15,406 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో దాదాపు 1శాతం లాభపడి 15,481 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 78 పాయింట్లు లాభపడి 15,438.45 వద్ద ముగిసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా కేఐఓసీఎల్‌ 10.50శాతం లాభపడింది. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 6శాతం, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎండోర్సన్‌ టెక్నాలజీస్‌ షేర్లు 4శాతం లాభపడ్డాయి. నాల్కో 3.50 శాతం, సెయిల్‌, ఇమామి అల్కేమ్‌ షేర్లు 3శాతం పెరిగాయి. టీఐ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, ఇమామి లిమిటెడ్‌, కంటైనర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 2.50శాతం ర్యాలీ చేశాయి. అలాగే జిందాల్‌ స్టీల్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌, కోల్గేట్‌, జిందాల్‌ స్టీల్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఎన్‌బీసీసీ షేర్లు 2శాతం లాభపడ్డాయి. అలాగే కెనరా బ్యాంక్‌ 1.50 శాతం లాభపడింది.
బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌:- నేడు 14,639.49 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో అరశాతం(0.75శాతం)ర్యాలీ చేసి 14712.36 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు 100 పాయింట్లు లాభపడి 14,706.69 వద్ద ముగిసింది. కెల్టెన్‌ టెక్‌ సెల్యూషన్స్‌, బట్టర్‌ఫ్లై, హెచ్‌సీసీ షేర్లు 20శాతం లాభంతో ముగిశాయి. అలాగే డ్రెగ్జింగ్‌ కార్పోరేషన్‌ 19శాతం లాభపడింది. మీనన్‌ బేరింగ్‌ లిమిటెడ్‌, ఎన్‌ఎంటీఎల్‌ షేర్లు 15శాతం పెరిగాయి. జీపీఐఎల్‌, ఐటీడీసీ, జీఎం బేవరీజెస్‌ లిమిటెడ్‌ షేర్లు 10శాతం ర్యాలీ చేశాయి.



You may be interested

ఫ్లాట్‌ ముగింపుతో 2018కు వీడ్కోలు

Monday 31st December 2018

మార్కెట్‌ 2018 సంవత్సరానికి ఫ్లాట్‌ ముగింపుతో వీడ్కోలు పలికింది. ఈ ఏడాదిలో మార్కెట్లకు చివరిరోజైన నేటి ట్రేడింగ్‌ సెషన్‌లో సూచీలు ఆద్యంతం ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను సాగించిన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రపంచ‌మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో ఉదయం భారీ లాభంతో మార్కెట్‌ ప్రారంభమైనప్పటికీ.., ఆసియా, ఐరోపా మార్కెట్ల మిశ్రమ ముగింపు, ముడిచమురు ధరల పెరుగుదల మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.మిశ్రమంగా ముగిశాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 8పాయింట్లు నష్టపోయి 36,068

నిఫ్టీ 11,000 దాటేముందు....కన్సాలిడేషన్‌

Monday 31st December 2018

  కొటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా   నిఫ్టీ 11,000 స్థాయిని దాటేముందుగా... కన్సాలిడేట్‌ అవుతుందని కొటక్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ అభిప్రాయపడ్డారు. గతవారం నిఫ్టీ ఇటీవలి గరిష్టస్థాయి అయిన 10,985 పాయింట్ల స్థాయిని అధిగమించలేక, అంచనాలకంటే అధికంగా పడిపోయిందని, అటుతర్వాత వేగంగా కోలుకున్నప్పటికీ, హెవీవెయిట్‌ షేర్లు వాటి తాజా గరిష్టస్థాయిల్ని చేరేందుకు ఇబ్బందిపడుతున్నందున, నిఫ్టీ కొద్దిరోజులపాటు కన్సాలిడేట్‌ కావొచ్చన్న అంచనాలు ఏర్పడుతున్నాయని ఆయన వివరించారు. గత వారం రోజుల కదలికలు,

Most from this category