News


చిన్నవే... కానీ సత్తా ఉన్నవి..!

Thursday 6th June 2019
Markets_main1559845720.png-26142

లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలు నిజానికి వేగంగా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కంపెనీ మూలాలు బలంగా ఉండాలి, మంచి యాజమాన్యం ఉండాలి... ఇలా కొన్ని అంశాలు ఆయా కంపెనీల వ్యాపార భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఇన్వెస్టర్లలో కొందరు అధిక రిస్క్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వారి కావాల్సింది అధిక రాబడులు. మరి కంపెనీ వృద్ధి అవకాశాలతో పోలిస్తే చౌకగా లభించే మూడు చిన్న కంపెనీల వివరాలను వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ తెలియజేసింది. వీటి పీఈ 15 లోపే ఉండడం గమనార్హం. పైగా గడిచిన మూడేళ్ల కాలంలో ఇవి ఏటా 15 శాతం రాబడులను ఇచ్చాయి. సానుకుల క్యాష్‌ ఫ్లో, ఈక్విటీతో పోలిస్తే రుణ భారం తక్కువగా ఉండడం వంటి సానుకూలతలూ ఈ కంపెనీలకు ఉన్నాయి. 

 

ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్
నీడిల్‌ బేరింగ్స్‌ తొలి తయారీ కంపెనీ. ఆటోమొబైల్‌ కాంపోనెంట్స్‌లో వీటిని వినియోగిస్తారు. ఈ విభాగంలో 70 శాతం మార్కెట్‌ వాటాతో ప్రముఖ కంపెనీగా ఉంది. హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, మారుతి సుజుకీ, టాటా మోటార్స్‌, అశోక్‌లేలాండ్‌ తదితర కంపెనీలు ఈ సంస్థ ఖాతాదారులు. సంప్రదాయ రోలర్‌ బేరింగ్స్‌, తక్కువ బరువు ఉండే కప్‌ బేరింగ్స్‌ విషయంలోనూ కీలక స్థానంలో ఉంది. వీటిని కూడా ఆటోమొబైల్‌ కాంపోనెంట్స్‌లో వినియోగిస్తుంటారు. నీడిల్‌ బేరింగ్స్‌ విషయంలో దాదాపు అన్ని ప్రధాన ఓఈఎం కంపెనీలతో బలమైన దీర్ఘకాలిక అనుబంధం కంపెనీకి ఉంది. 2017-18లో 25 శాతం ఆదాయాలు ఎగుమతుల నుంచే వచ్చాయి. అంతర్జాతీయంగా రెనో, వోల్వో, దైమ్లర్‌ ఈ కంపెనీ ఖాతాదారులుగా ఉన్నాయి. గత 12 నెలల కాలంలో కంపెనీ ఆదాయం 75 శాతం పెరగ్గా, గత ఐదేళ్లలో ఏటా 26 శాతం చొప్పున పెరిగాయి. రుణ భారాన్ని క్రమంగా తీర్చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈక్విటీలో డెట్‌ సగం మేరే ఉంది. 

 

మేఘమణి ఆర్గానిక్స్‌
కంపెనీ మూడు ప్రధాన వ్యాపార విభాగాలు... పిగ్మెంట్స్‌ (30 శాతం ఆదాయం), ఆగ్రోకెమికల్స్‌ (36 శాతం), బేసిక్‌ కెమికల్స్‌ (34 శాతం ఆదాయాలు). అంతర్జాతీయంగా పంపిణీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అమెరికా, దుబాయి, చైనాలో సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి. సగం ఆదాయం ఎగుమతుల రూపంలో వస్తున్నదే. పిగ్మెంట్స్‌ విభాగంలో అంతర్జాతీయంగా 14 శాతం వాటా ఈ కంపెనీదే కావడం గమనార్హం. దేశంలో పెస్టిసైడ్స్‌ తయారీలో ఒకానొక పెద్ద కంపెనీ. పిగ్మెంట్స్‌ పోర్ట్‌ఫోలియోలో పిగ్మెంట్‌ బ్లూ, పిగ్మెంట్‌ గ్రీన్‌ 32,940 ఎంటీపీఏ సామర్థ్యం కలిగి ఉంది. కంపెనీ చివరి 12 నెలల కాలంలో ఆదాయం 59 శాతం పెరిగింది. ఎబిట్డా మార్జిన్‌ 2014 ఆ‍ర్థిక సంవత్సరంలో 15.8 శాతం కాగా, 2018 ఆర్థిక సంవత్సరానికి 25 శాతానికి పెంచుకుంది. ఆర్‌వోఈ 30 శాతంగా ఉంది. ఈక్విటీలో రుణ భారం 0.44 శాతానికి తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ స్టాక్‌ 6.9 పీఈతో ట్రేడ్‌ అవుతోంది. ఐదేళ్ల సగటు పీఈ 11.9 శాతం కంటే చాలా తక్కువ.

 

సోనాట సాఫ్ట్‌వేర్‌
ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల్లో ప్రపంచవ్యాప్తంగా 30 ఏళ్ల నుంచీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ట్రావెల్‌, రిటైల్‌, డిస్ట్రిబ్యూషన్‌, సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ విభాగంలో కంపెనీ సేవలు ఉన్నాయి. ఐపీ ఆధారిత సేవలపై కంపెనీ దృష్టి సారించడం వల్ల కంపెనీ ఐపీలకు డిమాండ్‌ పెరుగుతోంది. రెజోపియా, హాలోసిస్‌, బ్రిక్‌ అండ్‌ క్లిక్‌ కంపెనీ ఐపీల్లో భాగం. మైక్రోసాఫ్ట్‌కు ఒకానొక ప్రాధాన్య డెవలప్‌మెంట్‌ వెండర్‌గా ఉంది. గత కొన్నేళ్లుగా కంపెనీ ఆదాయాలు వార్షికంగా 31 శాతానికి పైగా పెరిగాయి. ఆర్‌వోఈ 30 శాతంగా ఉంది. ప్రస్తుతం 14.8 ఈపీ వద్ద టేడవుతోంది. గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా 49 శాతం రిటర్నులను ఇచ్చింది.You may be interested

లాభాల ప్రారంభం...వెంటనే నష్టాల్లోకి

Friday 7th June 2019

క్రితంరోజు భారీ నష్టాల్ని చవిచూసిన స్టాక్‌ మార్కెట్‌... శుక్రవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, కొద్ది నిముషాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. 50 పాయింట్ల లాభంతో 39,581పాయింట్ల వద్ద మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వెనువెంటనే 100 పాయింట్ల నష్టంతో 39,425  పాయింట్ల వద్దకు తగ్గింది. 20 పాయింట్ల లాభంతో 11,865 పాయింట్ల వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి..కొద్ది నిముషాల్లోనే 30 పాయింట్ల నష్టంతో 11,814  పాయింట్ల వద్దకు పడిపోయింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, వేదాంత, విప్రోలు

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గట్టెక్కుతుంది..!: సుందరం ఏఎంసీ 

Thursday 6th June 2019

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ చెల్లింపులను వాయిదా వేసిన నేపథ్యంలో ఈ సంస్థ పట్ల ఇన్వెస్టర్లలో నమ్మకం సడలుతుండగా, సుందరం ఏఎంసీ ఎండీ సునీల్‌ సుబ్రమణ్యం మాత్రం సంస్థ నిలదొక్కుకుంటున్న ఆశాభావంతో ఉన్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తిరిగి చెల్లింపులు చేయగలదన్న నమ్మకం తమకు ఉన్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల విశ్వాసం కోల్పోవద్దని సూచించారు.     చెల్లింపులకు ఏడు రోజుల గడువు (గ్రేస్‌

Most from this category