STOCKS

News


ఇంకో రౌండ్‌ కరెక‌్షన్‌ ఉంది.. తొందరొద్దు..

Monday 22nd October 2018
Markets_main1540201600.png-21365

ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌లో మరో విడత కరెక‌్షన్‌ మిగిలే ఉందని ఎడిల్‌వీజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినయ్‌ ఖట్టర్‌ తెలిపారు. అందువల్ల ఇన్వెస్టర్లు తొందపడొద్దని సూచించారు. మరికొంత కాలం వేచిచూడడమే ఉత్తమమని తెలిపారు. ఇటీవలి మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలను రీబ్యాలెన్స్‌ చూసుకోవాలని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
విదేశీ ఇన్వెస్టర్లు చాలా వరకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని వినయ్‌ తెలిపారు. డాలర్‌ పరంగా చూస్తే ఆశ్చర్యకరంగా దశాబ్ద కాలం కిందట నిఫ్టీ ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు కూడా దాదాపు అదే స్థాయిలో ఉందని పేర్కొన్నారు. అలాగే నిఫ్టీ ఈపీఎస్‌లో కూడా పెరుగుదల లేదని తెలిపారు. అందువల్ల ఎఫ్‌ఐఐల భారత్‌ ఈక్విటీలపై ఆయిష్టతతో ఉన్నారని పేర్కొన్నారు. ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంపుకు అధిక ప్రాధాన్యమిస్తున్న తరుణంలో అమెరికా మార్కెట్లు భవిష్యత్‌లో డీరేటింగ్‌కు గురయ్యే అవకాశముందని తెలిపారు. ఇప్పటికీ మన మార్కెట్‌ అధిక వ్యాల్యుయేషన్స్‌తోనే ట్రేడవుతోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, దవ్య కట్టడి, ద్రవ్యోల్బణం వల్ల మరో విడత రేట్ల పెంపు ఉండొచ్చని అంచనా వేశారు. గత మూడేళ్లలో చూస్తే ఎఫ్‌ఐఐలు ఇండియన్‌ ఈక్విటీలను ఎక్కువగా కొనుగోలు చేయలేదని తెలిపారు. సమీప కాలంలో ఎఫ్‌ఐఐల అమ్మకాలు మార్కెట్‌పై ఒత్తిడి పెంచొచ్చని పేర్కొన్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 74 వద్ద ట్రేడ్‌ అవ్వొచ్చని, పడిపోతే 76 స్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. దీర్ఘకాలంలో చూస్తే బాండ్ల కన్నా ఈక్విటీలు మంచి పనితీరు కనబరుస్తాయని తెలిపారు. 



You may be interested

ఆరంభం అదిరింది కానీ.. ముగింపులో నష్టాలే..

Monday 22nd October 2018

సెన్సెక్స్‌ 181 పాయింట్లు డౌన్‌ 34,134 పాయింట్ల వద్ద ముగింపు 58 పాయింట్ల నష్టంతో 10,245కు నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,315 పాయింట్లతో పోలిస్తే 374 పాయింట్ల లాభంతో 34,689 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,303 పాయింట్లతో పోలిస్తే 102 పాయింట్ల లాభంతో 10,405 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. బ్యాంకింగ్‌, ఆటో

బడా బ్యాంకులపై మోర్గాన్‌ స్టాన్లీ మక్కువ

Monday 22nd October 2018

బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో చోటు చేసుకుంటున్న ప్రస్తుత సంక్షోభ సమయంలో పెద్ద ప్రైవేట్‌ బ్యాంకులను నమ్ముకోవడం ఉత్తమం అని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. వడ్డీరేట్ల పెరుగుదల, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సునామీ.. విత్త సంస్థలను ఇక్కట్లు పెడుతున్నాయి. వడ్డీరేట్ల పెరిగే తరుణంలో బలమైన లిక్విడిటీ ఉన్న బ్యాంకులే బాగుంటాయని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. రేట్ల పెరుగుదల తరుణంలోనే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తదితర ఎన్‌బీఎఫ్‌సీలు సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం వల్ల బడా

Most from this category