STOCKS

News


నష్టాల ప్రారంభానికి సంకేతాలు

Tuesday 5th March 2019
Markets_main1551756293.png-24427

 అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు ఇండియాకు వాణిజ్య ప్రాధాన్యాన్ని తొలగించి, 5.7 బిలియన్‌ డాలర్ల దిగుమతులపై సుంకాలు విధిస్తామంటూ ట్రంప్‌ చేసిన హెచ్చరిక, ఇండోపాక్‌ ఉద్రిక్తతల నడుమ భారత్‌ సూచీలు మంగళవారం  నెగిటివ్‌గా ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 80  పాయింట్లకుపైగా క్షీణించింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  గంటలకు 10,835 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,917 పాయింట్ల వద్ద ముగిసింది. శివరాత్రి సందర్భంగా సోమవారం భారత్‌ మార్కెట్‌కు సెలవుకాగా, ఈ రోజే తిరిగి ట్రేడింగ్‌ ప్రారంభంకానుంది. గత రాత్రి అమెరికా కన్‌స్ర్టక్షన్‌ యాక్టివిటీ క్షీణించిందన్న డేటాతో పాటు హెల్త్‌కేర్‌ షేర్లు పతనంకావడంతో ఆ దేశ సూచీలు 0.8 శాతం వరకూ నష్టపోయాయి.  తాజాగా చైనా జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని ఆ దేశ ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో  ఆసియా సూచీలు కూడా స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 5th March 2019

టాటామోటార్స్‌:- జేఎల్‌ఆర్‌లో వాటా విక్రయంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టత ఇచ్చిం‍ది.  

ప్రస్తుత మార్కెట్లో ఫండ్‌ మేనేజర్ల వ్యూహం...?

Tuesday 5th March 2019

ఆల్ఫా జనరేషన్‌ (మార్కెట్లతో పోలిస్తే మెరుగైన రాబడులు) కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌, పీఎంఎస్‌ మేనేజర్లు ఈ సమయలో ఏం చేస్తున్నట్టు? ఈ సందేహం సగటు ఇన్వెస్టర్లకు ఎదురుకావడం సహజమే. అయితే, సాధారణ ఇన్వెస్టర్ల మాదిరే గత 14 నెలలుగా ఫండ్‌ మేనేజర్లు సైతం రాబడుల విషయంలో తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో అమ్మకాల ఒరవడి, కీలక సూచీల పనితీరు సానుకూలంగా లేకపోవడం దీని వెనుక కారణాలు. గడిచిన

Most from this category