STOCKS

News


సీమెన్స్‌, థర్మాక్స్‌, భెల్‌పై మేనేజర్ల మక్కువ

Tuesday 16th April 2019
Markets_main1555354437.png-25145

మార్చి నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు ప్రత్యేకంగా కొన్ని షేర్లపై మక్కువ చూపించారు. క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడం, ఆర్డర్ల రాక మెరుగుపడడం ఈ రంగం పట్ల సానుకూతలకు కారణం. ఫండమెంటల్స్‌ పరంగా బలంగా ఉండడం కూడా వీటిల్లో  పెట్టుబడులకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం. 

 

సీమెన్స్‌ కంపెనీలో డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ మార్చి నెలలో ఇన్వెస్ట్‌ చేసింది. మూలధన వ్యయాలు రికవరీతో ఈ కంపెనీ లాభపడుతుందని అంచనా. గత కొన్ని సంవత్సరాలుగా తక్కువగా ఉన్న ప్రైవేటు పెట్టుబడులు 2019 నుంచి పుంజుకుంటాయని అంచనా. ఎన్నికల తర్వాత ప్రభుత్వ వ్యయాలు పెరుగుతాయని, దీనివల్ల సీమెన్స్‌ లాభపడుతుందని అంచనా. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ బీహెచ్ఈఎల్‌ షేర్లను కొనుగోలు చేసింది. కంపెనీ సమీప భవిష్యత్తులో మంచి ఫలితాల నమోదుకు అవకాశాలు, క్యాష్‌ బ్యాలన్స్‌ ఆరోగ్యంగా ఉండడం, ఆర్డర్ల రాక మెరుగ్గా ఉండడం ఈ స్టాక్‌ ఫండ్‌ మేనేజర్లను ఆకర్షిస్తోందని అంచనా. రైల్వే 2021 నాటికి విద్యుదీకరణపై రూ.35,000 కోట్లను వ్యయం చేయనుండడం, ఈ విభాగంలోకి ప్రవేశించిన బీహెచ్‌ఈఎల్‌ ఇప్పటికే 450 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ ఆర్డర్లను రైల్వే నుంచి దక్కించుకోవడం సానుకూలతలు. భవిష్యత్తులో మరిన్ని ఆర్డర్లను దక్కించుకునే అవకాశాలు కూడా ఉండడం ఈ స్టాక్‌ పట్ల ఫండ్‌ మేనేజర్ల ఆసక్తికి కారణం. 

 

థర్మాక్స్‌ కంపెనీ షేర్లను రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొనుగోలు చేసింది. సిమెంట్‌, మెటల్స్‌లో ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటాయన్న అంచనాలు ఈ కంపెనీకి సానుకూలించేవి. ఇంధనం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి థర్మాక్స్‌ సొల్యూషన్లను అందిస్తుంది. ఎనర్జీ రంగం 76 శాతం, పర్యావరణ విభాగం ద్వారా 16 శాతం, కెమికల్స్‌ విభాగం 8 శాతం ఆదాయాలను తెచ్చిపెడుతోంది. కనుక మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితులు ఈ కంపెనీకి సానుకూలించే అంశాలు. ఆర్తి ఇండస్ట్రీస్‌ షేర్లను ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొనుగోలు చేసింది. అలాగే, షీలా ఫోమ్‌ షేర్లను డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ కొనుగోలు చేసింది. 

 

మార్చి నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోళ్లను చూస్తే... హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కంపెనీ ఎన్‌టీపీసీ, బీవోబీ, కోల్‌ ఇండియా షేర్లను కొనుగోలు చేయగా, ఐసీఐసీఐ ఏఎంసీ ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ లైఫ్‌, ఇన్ఫోసిస్‌ షేర్లను కొన్నది. ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బ్రిటానియా షేర్లను కొనుగోలు చేసింది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ అయితే, ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్‌, ఎన్‌టీపీసీ షేర్లను, రిలయన్స్‌ ఏఎంసీ అయితే ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌టీసీపీ షేర్లను కొనుగోలు చేసింది. You may be interested

మీది లక్కీ పోర్ట్‌ఫోలియోనేనా?

Tuesday 16th April 2019

ఈక్విటీల్లో బంపర్‌ రాబడులు ఆశించేవారే ఎక్కువ మంది ఉంటారు. ఈక్విటీ మార్కెట్లో పదేళ్ల పాటు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేసే వారు తప్పకుండా సంపద కూడబెట్టగలరని చరిత్ర చెబుతోంది. కాకపోతే ప్రతీ ఏటా రాబడులు ఒకే విధంగా ఉండవు. అలాగే, సంపద సృష్టి అనేది మీరు ఎప్పుడు మార్కెట్లోకి ప్రవేశించారన్న దానిపైనా ఆధారపడి ఉంటుంది. అలాగే, మార్కెట్‌ టైమింగ్‌ కంటే మార్కెట్లో ఎంత కాలం పాటు ఉన్నారన్నది కూడా కీలకం

మూడోరోజూ లాభాల ముగింపే..!

Monday 15th April 2019

 అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో మార్కెట్‌ మూడోరోజూ లాభంతో ముగిసింది. కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండవచ్చనే అంచనాలతో పాటు అంతర్జాతీయ ఆర్థిక మందగమన ఆందోళనలు తగ్గుముఖం పట్టడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఫలితంగా మెటల్‌, అటో, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ 139 పాయింట్ల పెరిగి 38,905 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11,690 వద్ద స్థిరపడింది. అలాగే ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లు

Most from this category