STOCKS

News


సీమెన్స్‌కు ఫలితాల షాక్‌..!

Monday 19th November 2018
Markets_main1542608853.png-22179

  • 5శాతం నష్టపోయిన షేరు

ముంబై:- ఇంజనీరింగ్‌ దిగ్గజ కంపెనీ సీమెన్స్‌ లిమిటెక్‌ షేరుకు జూలై - సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు షాక్‌నిచ్చాయి.  త్రైమాసిక ఫలితాలు ఆశించినస్థాయిలో నమోదు కాకపోవడంతో సోమవారం సీమెన్స్‌ షేర్లు 5శాతం నష్టపోయాయి. నేడు సీమెన్స్‌ షేర్లు బీఎస్‌ఈలో రూ.978.5ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ క్వార్టర్‌ ఫలితాలు నిరుత్సాహపరడంతో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 5శాతం నష్టపోయి రూ.930.00ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.978.5)తో పోలిస్తే 4.50శాతం నష్టంతో రూ.934.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.841.00 రూ.1330.10లుగా నమోదయ్యాయి.
సీమెన్స్‌ జూలై క్వార్టర్‌ ఫలితాలు:-
ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌లో కంపెనీ నికరలాభం 55శాతం తగ్గి రూ. 279 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 25శాతం వృద్ధి చెంది రూ. 3939 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం సైతం 32 శాతం పుంజుకుని రూ. 418 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 7(350 శాతం) చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. ఇదే జూలై క్వార్టర్‌లో కంపెనీ 3720 కోట్ల విలువైన ఆర్డర్లను పొందినట్లు సీమెన్స్‌ పేర్కొంది. విదేశీ రీసెర్చ్‌ సంస్థ డాయిష్‌ బ్యాంక్‌ ఈ కౌంటర్‌కు బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. షేరుకి రూ. 1130 టార్గెట్‌ ధరను ప్రకటించింది.



You may be interested

టాటా డీల్‌పై డైలమా... ఎయిర్‌వేస్‌ డౌన్‌

Monday 19th November 2018

ముంబై:- కంపెనీలో వాటాను కొనుగోలుకు టాటాసన్స్‌ గ్రూప్‌ ఆసక్తి చూపిన నేపథ్యంలో గతవారం 41శాతం ర్యాలీ చేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు సోమవారం నష్టాల బాటలోకి పట్టింది. వాటా కొనుగోలు అంశంపై చర్చలు జరిపినప్పటికి.., బోర్డు ఇంకా  నిర్మాణాత్మక నిర్ణయాలేవీ తీసుకోలేదని టాటాసన్స్‌ ప్రకటించింది. ఈ ప్రకటనతో నేడు జెట్‌ ఎయిర్‌వేస్‌ బీఎస్‌ఈలో 6.59శాతం నష్టంతో రూ.324.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేరులో లాభాల స్వీకరణకు పూనుకోవడంతో

నిఫ్టీ మార్చి టార్గెట్‌.. 9,500

Monday 19th November 2018

నిఫ్టీ మార్చి కల్లా 9,500 పాయింట్లకు తగ్గవచ్చని యూబీఎస్‌ అంచనా వేస్తోంది. ఇన్వెస్టర్లు మార్కెట్‌ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం తేలింది.  నిఫ్టీపై ప్రభావం చూపే అంశాలు, నిఫ్టీ రేంజ్‌బౌండ్‌, మార్కెట్‌ సెంటిమెంట్‌ వంటి పలు అంశాలపై ఇన్వెస్టర్లు స్పందించారు. యూబీఎస్‌ సర్వే ప్రకారం..  ♦ సర్వేలో పాల్గొన్న దాదాపు 61 శాతం మంది ఇన్వెస్టర్లు మార్కెట్‌లో బేరిష్‌ సెంటిమెంట్‌ ఉందని తెలిపారు. గత సర్వేలో

Most from this category