STOCKS

News


ఐపీవోకు దరఖాస్తు చేసుకున్న శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌

Monday 24th December 2018
Markets_main1545675099.png-23207

రియల్‌ ఎస్టేట్‌ సంస్థ  శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ సెబీ వద్ద ఐపీవో ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఈ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ.1,250 కోట్లను సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. రూ.250 కోట్ల విలువ మేర తాజా షేర్లను ఈ ఐపీవోలో భాగంగా ఆఫర్‌ చేస్తారు. వీటికి తోడు ప్రస్తుత వాటాదారులు టాటా క్యాపిటల్‌ ఫైనాన్స్ సర్వీస్‌, టీపీజీ ఏషియాలు కలసి తమకున్న వాటాల నుంచి 4,24,03,271 షేర్లను విక్రయించనున్నాయి. ఐపీవోకు ముందస్తు షేర్ల కేటాయింపు ద్వారా రూ.100 కోట్లను కంపెనీ సమీకరించాలనుకుంటోంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను రుణాలను తీర్చివేసేందుకు, సాధారణ కార్పొరేట్‌ వ్యవహారాల కోసం ఖర్చు చేయనుంది. యాక్సిస్‌ క్యాపిటల్‌, ఎడెల్వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, జేఎం ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ ఐపీవో వ్యవహారాలను చూడనున్నాయి. శ్రీరామ్‌ గ్రూపులో భాగమైన శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ దక్షిణాది మార్కెట్లో మధ్య స్థాయి, అందుబాటు ధరల ఇళ్ల ప్రాజెక్టుల్లో ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.



You may be interested

ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన స్టాక్స్‌!

Monday 24th December 2018

ఇన్వెస్టర్లకు 2017 తీపి లాభాలను అందించగా, 2018 మాత్రం చేదునే మిగిల్చింది. ఎన్నో ఆటుపోట్ల మధ్య లాభాలు ఆవిరైపోయిన పరిస్థితి. ఈ ఏడాదిలో ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజీ రంగ స్టాక్స్‌ మంచి పనితీరు చూపించగా, పీఎస్‌యూ బ్యాంకులు, ఇన్‌ఫ్రా, మెటల్స్‌, ఫార్మా, ఆటో, రియల్టీ, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు నష్టాల పాలయ్యాయి. ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, వీమార్ట్‌, హెచ్‌ఈజీ, వినతి ఆర్గానిక్స్‌ వంటి కంపెనీలు అద్భుత రాబడులను

2018లో శభాష్‌ అనిపించిన ఫండ్స్‌ ఇవే

Monday 24th December 2018

ఈ ఏడాది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు అంత ఆశాజనకంగా లేదనే చెప్పుకోవాలి. స్థానిక, అంతర్జాతీయ అంశాలతో మార్కెట్లు అస్థిరతల మధ్యే చలించాయి. అందుకే ఈ ఏడాది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో చక్కని పనితీరు చూపించిన పథకం ఇచ్చిన రాబడులు కేవలం 5.8 శాతంగానే ఉన్నాయి. ఓ బాండ్‌లో వచ్చే రాబడి కంటే ఇది తక్కువ. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం, చమురు ధరల పెరుగుదల, ఇరాన్‌పై

Most from this category