STOCKS

News


యస్‌ బ్యాంక్‌ షేరుపై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయ్‌!

Friday 25th January 2019
Markets_main1548404601.png-23803

కొత్త సీఈఓ నియామకంతో యస్‌ బ్యాంక్‌ షేరు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి...
1. మోతీలాల్‌ ఓస్వాల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 270. మేనేజ్‌మెంట్‌ సమస్య తీరినందున ఇకపై కీలకాంశాలపై బ్యాంకు దృష్టి సారించనుంది. మూలధన సమీకరణ, కార్పొరేట్‌ గవర్నెన్స్‌, ఉద్యోగుల్లో నైతికత పెంపు తదితర అంశాలపై ఫోకస్‌ పెట్టనుంది. రాబోయే సంవత్సరాల్లో నికరలాభంలో 9- 12 శాతం వృద్ది ఉండొచ్చు.
2. ఎడెల్‌వీజ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 279. సీఈఓ నియామకంతో అనిశ్చితికి తెరపడింది. ఎన్‌ఐఐ వృద్ధిలో మంచి మెరుగుదల చూపింది. స్లిపేజ్‌ల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు అధిక రుణాలివ్వడం స్వల్పకాలంలో ఇబ్బందులు తీసుకురావచ్చు. కానీ బ్యాంకు సమర్ధవంతంగా ఈ సమస్యను ఎదుర్కోగలదు.
3. క్రెడిట్‌సూసీ: న్యూట్రల్‌. టార్గెట్‌ రూ. 250. కొత్త సీఈఓతో బాలెన్స్‌ షీటు కన్సాలిడేషన్‌ జరగవచ్చు. అయితే ఎర్నింగ్స్‌ అంచనాలు గతంలో కన్నా తగ్గించడం జరిగింది.
4. డాయిష్‌బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 280. కొత్త సీఈఓ నియామకంతో సమస్యల వలయం నుంచి బయటపడొచ్చు. అయితే స్వల్పకాలంలో ఇంకా ఇబ్బందులు కొనసాగుతాయి. ప్రస్తుతం వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.
5. సిటిగ్రూప్‌: న్యూట్రల్‌. టార్గెట్‌ రూ. 240. సీఈఓ నియామకం షేరుకు పాజిటివ్‌. వృద్ధి అవకాశాలు మరికొన్ని త్రైమాసికాల పాటు పరిమితంగా ఉండొచ్చు. 
6. నొమురా: న్యూట్రల్‌. టార్గెట్‌ రూ. 245. ఆస్తుల నాణ్యతపై అనిశ్చితులు కొనసాగుతాయి. ఆర్‌బీఐ నివేదిక మరిన్ని ఇబ్బందులు తీసుకురావచ్చు. 



You may be interested

రెండోరోజూ యస్‌ బ్యాంక్‌ ర్యాలీ

Friday 25th January 2019

యస్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ రెండో  కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మరో 10.50శాతం ర్యాలీ చేసింది. కొత్త  సీఈఓగా రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ నియామకం, క్యూ3 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను ఆకట్టుకోవడం, బ్రోకరేజ్‌ సంస్థలు షేరు రేటింగ్‌ను పెంచడం తదితర అంశాలు షేరు ర్యాలీకి తోడ్పాటు అందించాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ఇంట్రాడేలో మరో  14 శాతం ర్యాలీ చేసి రూ.245 వద్ద గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గత ముగింపు

లిస్టైన తొలిరోజే...స్పెన్సర్‌ రిటైల్‌ లోయర్‌ సర్య్కూట్‌

Friday 25th January 2019

స్పెన్సర్స్‌ రిటైల్‌, సీఈఎస్‌ షేర్లు ఎ‍క్చే‍్సంజీల్లో లిస్టైన మొదటి రోజే లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యాయి. సంజీవ్‌ గోయంకా గ్రూపు కంపెనీ సీఈఎస్‌సీ నుంచి విభజించబడిన స్పెన్సర్స్‌ రిటైల్‌, సీఈఎస్‌సీ వెంచర్స్‌ కంపెనీల షేర్లు నేడు ఎక్చే‍్సంజ్‌లో లిస్ట్‌ అయ్యాయి. అయితే ఇరు షేర్ల కౌంటర్లో కొనుగోళ్లు కరువవడంతో లిస్టైన కాసేపటికే రెండు షేర్లు 5శాతం క్షీణించి ఇరు ఎక్చే‍్సంజీల్లో లోయర్‌ సర్క్యూట్‌ వద్ద లాక్‌ అయ్యాయి.స్పెన్సర్స్‌ రిటైల్‌ కింద అన్ని

Most from this category