STOCKS

News


ఈ స్టాకుల పీఈ పెరిగింది.. అమ్మేయాలా?

Thursday 16th May 2019
Markets_main1557992073.png-25771

ఇటీవల కాలంలో సూచీలపై కరెక‌్షన్‌ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ప్రధాన సూచీలు తమ ఆల్‌టైమ్‌ గరిష్టాల నుంచి దాదాపు 5,6 శాతం దిగువకు పతనమైనాయి. కానీ నిఫ్టీలోని 22 స్టాకులు మాత్రం ఇప్పటికీ తమ పదేళ్ల పీఈ సరాసరి కన్నా ప్రీమియంతోనే ట్రేడవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. స్టాక్‌ ధర వాల్యూషన్‌ను పీఈ ఆధారంగా మదింపు చేస్తారు. పీఈ అధికంగా ఉంటే వాల్యూషన్లు ఎక్కువగా ఉన్నట్లు లెక్కిస్తారు. ఇలా అధిక వాల్యూషన్‌ ఉన్న స్టాకులు సాధారణంగా డౌన్‌ట్రెండ్‌లోకి ప్రవేశిస్తుంటాయి. వచ్చే వారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో సూచీల్లో తీవ్ర కదలికలు ఉండొచ్చని వీఐఎక్స్‌ పెరగడం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో అధిక పీఈ ఉన్న స్టాకులు పతనమయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయని నిపుణుల విశ్లేషణ.

ఇలా అధిక పీఈ వద్ద ఉన్న స్టాకుల్లో బజాజ్‌ఆటో, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, టైటాన్‌, యూపీఎల్‌ తదితరాలున్నాయి.

ఈ స్టాకులు ఇప్పటికే పోర్టుఫోలియలో ఉన్నవాళ్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేయాలా? లేక కొనసాగించాలా? అన్న డైలమాలో ఉన్నారు. పీఈతో పాటు ఇతర ఇండికేటర్లను పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని స్టాకులు అధిక ప్రీమియం వద్ద ఉన్నా, వాటిని కొనసాగించవచ్చంటున్నారు. ఉదాహరణకు టైటాన్‌ ప్రీమియంలు ఎక్కువగా ఉన్నా, పోర్టుఫోలియోలో ఉంచవచ్చని మోతీలాల్‌ఓస్వాల్‌ సూచించింది. అయితే ప్రస్తుతం వీటిలో చాలా షేర్లు ఓవర్‌బాట్‌ స్థితిలో ఉన్నాయని ఛాయిస్‌బ్రోకింగ్‌ తెలిపింది. అందువల్ల వీటిలో కొంత పతనం అవకాశాలున్నాయని, కనుక ప్రస్తుతం పాక్షికంగా వీటిలో లాభాలు స్వీకరించాలని సూచించింది. సమీప భవిష్యత్‌లో ఈ స్టాకుల్లో కరెక‌్షన్‌ వస్తే మరలా కొనవచ్చని సలహా ఇచ్చింది. దీనివల్ల పోర్టుఫోలియో విస్తృతమవుతుందని తెలిపింది.

 
సూచన: కేవలం పీఈ నిష్పత్తిని మాత్రమే కాకుండా డీఈ నిష్పత్తి, పీఈజీ నిష్పత్తి, పీఈఈఆర్‌ ప్రదర్శన, వృద్ధి తదితర వివిధ పారామీటర్లను పరిశీలించిన అనంతరమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.You may be interested

రూ.1,400 కోట్లు సమీకరించిన గ్రోఫర్స్‌

Thursday 16th May 2019

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గ్రోసరీ రిటైల్‌ సంస్థ గ్రోఫర్స్‌... సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ తదితర ఇన్వెస్టర్ల నుంచి 200 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,400 కోట్లు) సమీకరించింది. సిరీస్‌ ఎఫ్‌ కింద జరిగిన ఈ నిధుల సమీకరణలో కొత్త ఇన్వెస్టర్‌ కేటీబీతోపాటు ప్రస్తుత వాటాదారులైన టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌, సీక్వోయ క్యాపిటల్‌ పెట్టుబడులు పెట్టినట్టు గ్రోఫర్స్‌ ప్రకటించింది. ఈ నిధులతో కొత్త మార్కెట్లలోకి విస్తరించాలని భావిస్తున్నట్లు, తద్వారా కోట్లాది భారతీయ వినియోగదారులకు

‘టాటా ఉప్పు’... కంపెనీ మారింది!!

Thursday 16th May 2019

గ్రూపు వినియోగ వస్తువుల వ్యాపారం పునర్వ్యవస్థీకరణ టాటా కెమికల్స్‌ ఆహారోత్పత్తులు గ్లోబల్‌ బెవరేజెస్‌కు ప్రతీ టాటా కెమికల్‌ షేరుకు 1.14 గ్లోబల్‌ బెవరేజెస్‌ షేర్లు న్యూఢిల్లీ: టాటా గ్రూపులో వ్యాపార పునర్వ్యవస్థీకరణ దిశగా ఓ కీలక నిర్ణయం జరిగింది. టాటా కెమికల్స్‌కు చెందిన ఆహారోత్పత్తుల వ్యాపారం టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌లో విలీనం కానుంది. ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఈ వ్యాపార విలీనం ఉంటుందని టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌ (టీసీఎల్‌) తెలిపింది. ప్రతీ టాటా

Most from this category