STOCKS

News


ఐసీఐసీఐ బ్యాంక్‌పై ఎలాంటి వ్యూహం అనుసరించాలి?

Monday 29th October 2018
Markets_main1540806255.png-21564

సోమవారం ట్రేడింగ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు దాదాపు 9 శాతం దూసుకుపోయింది. బ్యాంకు క్యు2 ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో కొనుగోళ్లు పెరిగాయి. బ్యాంకు ఆస్తుల నాణ్యత ఈ త్రైమాసికంలో మెరుగుపడింది. జీఎన్‌పీఏలు 8.54 శాతానికి దిగివచ్చాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు బ్యాంకు షేరుపై ఎలాంటి సిఫార్సులు చేస్తున్నాయో చూద్దాం...
1. మోర్గాన్‌ స్టాన్లీ: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 460. కీలక పీపీఓపీ వృద్ది కొనసాగిస్తోంది. ఎన్‌ఐఎంలు విస్తరించడం ఆరంభమయింది.
2. నోమురా: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 415. ఆస్తుల నాణ్యత అంశంలో మెరుగుదల ఆరంభమైంది. పలు అంశాల్లో ఫలితాలు బాగన్నాయి. ఆర్‌ఓఈ రికవరీ అనుకున్నదానికన్నా వేగంగా ఉండొచ్చు. వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.
3. మాక్క్వైరీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 416. అధిక ఎన్‌ఐఎంలతో ఫలితాలు అంచనాలను మించాయి. స్లిపేజ్‌లు తగ్గడం, లోన్‌గ్రోత్‌ పెరగడం కీలక పాజిటివ్‌ అంశాలు.
4. సిటి: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 390. పీసీఆర్‌, ఎన్‌ఐఎంల పెరుగదలతో ఈ త్రైమాసికంలో ఆరోగ్యకరమైన ఫలితాలు ఇచ్చింది. కాసా నిష్పత్తి బాగుంది. లోన్‌గ్రోత్‌ మరింత పెరగడం ఎన్‌ఐఎంలను మరింత వృద్ది చేస్తుంది. 
5. బీఎన్‌పీ పారిబా: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 410. పదకొండు త్రైమాసికాల్లో స్లిపేజ్‌ల తగ్గుముఖం ప్రస్ఫుటంగా కనిపించింది. ఆర్‌ఓఈ గైడెన్స్‌ బాగుంది. బ్యాంకు ఎన్‌పీఏ టార్గెట్‌ అందుకునేదిలా ఉంది. ప్రస్తుత వాల్యూషన్ల వద్ద ఎంటర్‌కావచ్చు. 



You may be interested

పటిష్ట క్యూ2 ఫలితాలతో దివీస్‌ దూకుడు..!

Monday 29th October 2018

క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో పటిష్ట ఫలితాలను సాధించడంతో  దివీస్‌ లేబొరేటరీస్‌ షేరు సోమవారం ఇంట్రాడేలో 52వారాల గరిష్టానికి చేరుకుంది. ఈ క్యూ2లో రూ.398 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో నికరలాభం రూ.రూ. 207 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1285 కోట్లను సాధించింది. ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేయడంతో యాక్సిస్‌ క్యాపిటల్‌, ఈక్వెరస్‌ లాంటి బ్రోకరేజ్‌ సంస్థలు షేరు టార్గెట్‌ ధరను పెంచాయి. ఈ సానుకూల ఫలితాల

వెలుగులోకి విద్యుత్‌ షేర్లు

Monday 29th October 2018

ముంబై:- మార్కెట్‌ ర్యాలీ భాగంగా సోమవారం విద్యుత్‌ షేర్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి. బీఎస్‌ఈలో విద్యుత్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ పవర్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2.50 శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ 2శాతం లాభంతో 1950.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన అదానీ పవర్‌ అత్యధికంగా 20శాతం, టాటా పవర్‌ 14శాతం లాభపడ్డాయి. వాటితో పాటు టోరెంట్‌ పవర్‌

Most from this category