STOCKS

News


కొత్తగా కొందామా? ఉన్నవి అమ్మేద్దామా?

Wednesday 24th April 2019
Markets_main1556111235.png-25320

మార్కెట్లో రిటైలర్‌ ఇన్వెస్టర్‌ డైలమా
వేచిచూడమంటున్న నిపుణులు
నిఫ్టీ చాలా స్వల్పకాలంలో దాదాపు వెయ్యి పాయింట్లకు పైన ర్యాలీ జరిపింది. ఏప్రిల్‌ ఎక్స్‌పైరీ దగ్గరపడుతున్న సమయాన నిఫ్టీ దాదాపు 11750 పాయింట్లకు చేరువైంది. ఒకపక్క వీఐఎక్స్‌ సూచీ అంతకంతకూ పెరిగిపోతున్నా... బుల్స్‌ మాత్రం మార్కెట్‌పై పట్టు సడలించడంలేదు. దీంతో ర్యాలీ ఉంటుందని కొత్త కొనుగోళ్లు చేయాలా? వీఐఎక్స్‌ పెరిగిపోతోందని ఉన్న  పొజిషన్లను విక్రయించి లాభాలు స్వీకరించాలా? అని రిటైల్‌ ఇన్వెస్టర్‌ డైలమాలో పడుతున్నాడు. ఎన్నికల ఫలితాలు సమీపించే కొద్దీ మార్కెట్లో మరింత అస్థిరతకు అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ పరిస్థితుల్లో రిస్కు ఇష్టపడని ఇన్వెస్టరు కొత్త పొజిషన్ల జోలికిపోకపోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. పొజిషన్లు తీసుకునే ముందు సూచీల్లో కొంత పతనం వచ్చే వరకు వేచిచూడాలని సూచిస్తున్నారు. చార్టుల్లో నిఫ్టీ ఓవర్‌బాట్‌లో కనిపిస్తోందని, కొన్ని సూచీలు డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తున్నాయని తెలిపారు.

నిఫ్టీ 11200-11300 రేంజ్‌కు చేరినప్పుడు కొనుగోళ్లకు మంచి అవకాశమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు వినయ్‌ రజని చెప్పారు. ఈ స్థాయి గత ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయన్నారు. క్రూడాయిల్‌ ధరలు మార్కెట్‌ను బ్రేక్‌డౌన్‌ చేయలేకపోవచ్చు కానీ అస్థిరతను సృష్టిస్తాయన్నారు. ఎన్నికల్లో స్థిర ప్రభుత్వం వస్తుందన్న నమ్మకాలతో సూచీలు ర్యాలీ జరిపాయని, ఫలితాల టైమ్‌ దగ్గరపడుతున్నందున ఇకపై తీవ్రమైన ఆటుపోట్లు ఉంటాయని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రతినిధి జయంత్‌ మాంగ్లిక్‌ చెప్పారు. నిఫ్టీలో ఎఫ్‌ఐఐల హవా కారణంగా 10600 పాయింట్ల నుంచి 11700 పాయింట్ల వరకు ర్యాలీ జరిగిన సంగతి తెలిసిందే. నిఫ్టీ ప్రస్తుతం 18.5 రెట్ల ఫార్వర్డ్‌ పీఈ వద్ద కదలాడుతోందని, అందువల్ల మరింత అప్‌మూవ్‌కు అవకాశాలు స్వల్పమని సామ్‌కో సెక్యూరిటీస్‌ ప్రతినిధి ఉమేశ్‌ మెహతా చెప్పారు. అయితే స్వల్పకాలిక కన్సాలిడేషన్‌, కరెక‌్షన్‌ అనంతరం తిరిగి మార్కెట్‌ ముందుకే పరుగు తీస్తుందని, అందువల్ల ప్రస్తుతం ఉన్న పొజిషన్లను కచ్చితమైన స్టాప్‌లాస్‌తో కాపాడుకోవడం చేయాలని సూచించారు. మార్కెట్లో సరైన కరెక‌్షన్‌ వచ్చినప్పుడు కొనుగోళ్లకు అవకాశంగా పరిగణించాలన్నారు. You may be interested

టాటామోటర్స్‌ షేరును ప్రస్తుతం కొనొచ్చా?

Wednesday 24th April 2019

బుధవారం ట్రేడింగ్‌లో టాటామోటర్స్‌ షేరు దాదాపు 4 శాతం పతనమైంది. దీంతో వరుసగా మూడో సెషన్లో కూడా షేరు డౌన్‌ట్రెండ్‌ కొనసాగించినట్లయింది. నిజానికి గత కొన్నాళ్లుగా ఈ షేరు అనూహ్య అప్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. ఈ ఏడాది ఇంతవరకు షేరు దాదాపు 34 శాతం ర్యాలీ జరిపింది. గతేడాది మే అనంతరం షేరు దీర్ఘకాలిక పతనావస్థలోకి జారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడాది కనిష్ఠస్థాయి రూ.142ను తాకింది. అయితే అక్కడనుంచి ఒక్కమారుగా

నిఫ్టీ ట్రేడింగ్‌ రేంజ్‌ మారింది!

Wednesday 24th April 2019

ఇప్పటివరకు 11550- 11750 పాయింట్ల మధ్యన కదలాడుతున్న నిఫ్టీ రేంజ్‌ ప్రస్తుతం పైవైపునకు జరిగిందని బుధవారం ట్రేడింగ్‌ అనంతరం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నిఫ్టీ రేంజ్‌ 11600- 11800 పాయింట్లకు మారిందని, ఇందుకు తగ్గట్లే నిఫ్టీ 11600 పాయింట్ల నుంచి బలంగా బౌన్సైందని చెబుతున్నారు. మంగళవారం ఇంట్రాడేలో నిఫ్టీ 11560 పాయింట్లను టచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థాయిల వద్ద నిఫ్టీలో కొనుగోళ్లు కనిపించాయి. ఈ రోజు చివర్లో

Most from this category