STOCKS

News


స్వల్పకాలానికి ఈ  షేర్లు చూడొచ్చు

Tuesday 18th September 2018
news_main1537268070.png-20364

సమీప భవిష్యత్తులో నిఫ్టీపై ఒత్తిడి కొనసాగుతుందని, 10,200 సమీపంలో మద్దతు పొందవచ్చని, 10,523 పాయింట్ల వద్ద పటిష్టమైన నిరోధాన్ని చవిచూడవచ్చని సాంక్ట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ విశ్లేషకుడు ఆశిష్‌ చాతుర్‌మెహతా అంచనావేస్తున్నారు. ఒక ఆంగ్లచానల్‌తో ఆయన మార్కెట్‌పై అభిప్రాయాల్ని పంచుకుంటూ స్వల్పకాలంలో లాభాలను అందించే  అవకాశం వున్న  షేర్లను సూచించారు. ఆ సిఫార్సులివే...


ఐషర్‌ మోటార్స్‌

సిఫార్సు: బై, ప్రస్తుత ధర: రూ.29,664, టార్గెట్‌: రూ. 32,000–32,700, స్టాప్‌లాస్‌: రూ. 28,800

గత ఏడాదికాలంలో పలుమార్లు మద్దతునందించిన రూ. 26,500 సమీపంలోనే ఇటీవల పటిష్టమైన మద్దతు పొందిన ఐషర్‌ మోటార్స్‌ , ఆ స్థాయికిపైనే రూ. 29,200–26,600 మధ్య కన్సాలిడేట్‌ అయ్యింది. రెండు రోజుల క్రితం బోలింగర్‌ బ్యాండ్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించిన 200 డీఎంఏను అధిగమించింది. ప్రస్తుతస్థాయిలో లేదా రూ.29,400 స్థాయికి తగ్గినపుడు కొనుగోలు చేసి రూ. 28,800 దిగువన స్టాప్‌లాస్‌తో రూ. 32,000–32,700 టార్గెట్‌ ధర కోసం అట్టిపెట్టవచ్చు.
 

టొరెంట్‌ ఫార్మా


సిఫార్సు: బై, ప్రస్తుత ధర: రూ.1782, టార్గెట్‌: రూ. 1950, స్టాప్‌లాస్‌: రూ. 1700

గత రెండేళ్లుగా రూ. 1200–1700 శ్రేణి మధ్య కన్సాలిడేట్‌ అయిన టొరెంట్‌ ఫార్మా గత నెలలో బ్రేక్‌అవుట్‌ సాధించి, అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో కొత్త గరిష్టస్థాయికి దూసుకెళ్లింది. బ్రేకవుట్‌ జరిగిన రూ. 1700 స్థాయి ఇక నుంచి ఈ షేరుకు మద్దతునివ్వవచ్చు. ఈ కారణంగా టొరెంట్‌ ఫార్మాను ప్రస్తుతస్థాయిలో లేదా రూ. 1770 స్థాయికి తగ్గినపుడు కొనుగోలు చేసి, రూ. 1,700 దిగువన స్టాప్‌లాస్‌ను నిర్దేశించుకుని, రూ. 1950 టార్గెట్‌ కోసం హోల్డ్‌ చేయవచ్చు. 

 

యూపీఎల్‌

సిఫార్సు: బై, ప్రస్తుత ధర: రూ.724, టార్గెట్‌: రూ. 810, స్టాప్‌లాస్‌: రూ. 690


గతేడాది ఆగస్టులో రూ. 902 ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయిని టచ్‌ చేసిన యూపీఎల్‌ ఈ ఏడాది జూలైలో రూ. 537 కనిష్టస్థాయికి పడిపోయింది. తద్వారా గత కొద్ది సంవత్సరాల్లో రూ. 367 నుంచి రూ. 902 వరకూ జరిగిన ర్యాలీలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ను రూ. 537 సమీపంలో పూర్తిచేసుకున్నది. అటుతర్వాత ఈ కనిష్టస్థాయి నుంచి పటిష్టమైన ర్యాలీ జరిపిన యూపీఎల్‌ తాజాగా వీక్లీ చార్టుల్లో ఫాలింగ్‌ రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌ను, 200 డీఎంఏను అధిగమించి, రెండు వారాల నుంచి కన్సాలిడేట్‌ అవుతున్నది. ఈ షేరును ప్రస్తుతస్థాయిలో లేదా రూ. 715 తగ్గినపుడు కొనుగోలుచేసి, రూ. 690 దిగువన స్టాప్‌లాస్‌ను నిర్దేశించుకుని, రూ. 810 టార్గెట్‌ కోసం అట్టిపెట్టవచ్చు. 
 



You may be interested

అప్‌ట్రెండ్‌ కొనసాగుతుంది: మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 19th September 2018

ప్రస్తుత సమస్యలను మార్కెట్లు ఇప్పటికే సర్దుబాటు చేసుకున్నాయని, ఫండమెంటల్‌ విలువలు ప్రస్తుత అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని తెలియజేస్తున్నట్టు మోర్గాన్‌స్టాన్లీ ఇండియా ఎండీ రిధమ్‌ దేశాయ్‌ పేర్కొన్నారు. సెన్సెక్స్‌ 2019 సెప్టెంబర్‌ నాటికి 42,000కు చేరుతుందని, ఇక్కడి నుంచి 11 శాతం అప్‌సైడ్‌కు అవకాశం ఉంటుందని మోర్గాన్‌స్టాన్లీ తన తాజా నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. తొలుత 2019 జూన్‌కు 36,000 టార్గెట్‌ ఇవ్వగా, అది ఈ ఏడాది జూలైలోనే సెన్సెక్స్‌ అధిగమించేసింది.

బ్యాంక్‌ నిఫ్టీకి భారీనష్టం

Tuesday 18th September 2018

బ్యాంకింగ్‌ షేర్లలో పతనంలో భాగంగా నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 1.50శాతం నష్టపోయింది. నేడు 26,407ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఈ సూచీలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 19శాతం నష్టపోగా, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సి్‌స్‌ బ్యాంక్‌, 4శాతం నుంచి 3శాతం క్షీణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు షేర్లు 2నుంచి 1శాతం వరకు పతనమయ్యాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ

Most from this category