STOCKS

News


పన్నెండు వేలకు చేరితే పారాహుషార్‌!

Saturday 1st September 2018
Markets_main1535801619.png-19884

అప్రమత్తంగా ఉండాలంటున్న అనలిస్టులు
స్టాక్‌మార్కెట్లకు సెప్టెంబర్‌ పెద్దగా కలిసిరాదని గతంలో తేలిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఈ నెల్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ నమోదవుతుందన్నారు. అందువల్ల షార్ట్‌టర్మ్‌ ట్రేడర్లు నిఫ్టీ 12వేల పాయింట్లకు చేరితే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. 12వేల పాయింట్ల వద్ద కొత్త పొజిషన్ల జోలికి దాదాపు పోకపోవడం మంచిదని సలహా ఇచ్చారు. నిఫ్టీ 10550 పాయింట్ల స్థాయి నుంచి ప్రస్తుతం 11700 స్థాయిలకు ర్యాలీ జరిపింది. ఈ ర్యాలీకి ఇది 9వ వారం. గతంలో ఈ తరహాగా ఆగకుండా పెరిగిన సందర్భాల్లో ర్యాలీ అనంతరం పలువారాల కరెక‌్షన్‌ వచ్చిందని గుర్తు చేస్తున్నారు. అయితే అంతర్గత ట్రెండ్‌ మాత్రం పాజిటివ్‌గానే ఉందని చార్ట్‌వ్యూఇండియా ప్రతినిధి మజార్‌ మహ్మద్‌ చెప్పారు. ఎలైట్‌ వేవ్‌ విధానంలో ప్రస్తుతం వేవ్‌3 నడుస్తోందని, త్వరలో ముగింపునకు రానుందని వివరించారు. ఈ నేపథ్యంలో అప్‌మూవ్‌ ముగిసి కొన్ని వారాల కరెక‌్షన్‌కు ఛాన్సులున్నాయన్నారు. అందువల్ల ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించాలన్నారు. పైస్థాయిలో 11760 పాయింట్ల వద్ద గట్టి నిరోధం ఉంటుందని, దీన్ని దాటితే 12వేల పాయింట్లను చేరవచ్చని అంచనా వేశారు. అయితే ఏ స్థాయి వద్ద కరెక‌్షన్‌ మొదలవుతుందో చెప్పలేమని, అలాంటి కరెక‌్షన్‌ చాలా బలంగా ఉంటుందని చెప్పారు. బ్యాంకు నిఫ్టీ 28300 పాయింట్ల వద్ద టాప్‌అవుట్‌ అయిందన్నారు. కొంతకాలం 27740- 28388 పాయింట్ల రేంజ్‌లో కదలాడవచ్చని అంచనా వేశారు. 28390 పాయింట్లపైన గట్టిగా క్లోజయితే సెంటిమెంట్‌ పెరిగి పాజిటివ్‌గా మారుతుందని చెప్పారు. ఈ స్థాయికి పైన 29000 పాయింట్లను తాకుతుందని చెప్పారు. ఒకవేళ దిగువకు వస్తే 50 రోజుల డీఎంఏ స్థాయి 27440 పాయింట్ల వద్ద మద్దతు పొందవచ్చని అభిప్రాయపడ్డారు. 



You may be interested

ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందు ఇవి చెక్‌ చేసుకోండి..

Saturday 1st September 2018

దురాశకు పోకుండా జాగ్రత్త వహిస్తే మార్కెట్లో సిరుల పంట ఖాయమని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఈక్విటీల్లో కాలు మోపేముందు కొన్ని అంశాలు చెక్‌ చేసుకోవాలని, అప్పుడే నష్టపోకుండా లాభాల్లో పయనిస్తామని సూచిస్తున్నారు. నిధులున్నాయా?: నగదునిల్వలు, ఫ్రీ క్యాష్‌ ప్రవాహం లేని కంపెనీలు ఎంత మంచివైనా వాటి జోలికి పోకుండా ఉత్తమం. ఫ్రీక్యాష్‌ ప్రవాహం ఉన్న కంపెనీలే కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపార విస్తరణ చేపడతాయి.  పూర్తిగా తెలుసుకోండి: ఎంపిక చేసుకున్న కంపెనీ చేస్తున్న

టాటామోటర్స్‌.. ఆశించిన స్థాయిలో అమ్మకాలు

Saturday 1st September 2018

టాటామోటర్స్‌ ఆగస్ట్‌లో ఆశించిన స్థాయిలో వాహన విక్రయాలను జరిపింది. ఈ నెలలో మొత్తం 58,262 వాహనాలను విక్రయించింది.  గతేడాది ఇదే నెలలో జరిపిన మొత్తం 45,906 వాహన అమ్మకాలతో పోలిస్తే ఇది27 శాతం అధికం. వాణిజ‍్య వాహన విభాగంలో 39,859 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గతేడాదితో ఇదే డిసెంబర్‌ 31,566 అమ్మకాలతో పోలిస్తే ఇది 26శాతం ఎక్కువ. పాసింజర్‌ వాహన విభాగంలో గతేడాది విక్రయాలతో పోలిస్తే 28శాతం వృద్ధిని సాధించి

Most from this category