STOCKS

News


నెల రోజులకు పది సిఫార్సులు

Tuesday 2nd October 2018
Markets_main1538475883.png-20798

స్వల్పకాలానికి సుమారు 16 శాతం వరకు రాబడినిచ్చే పది షేర్లను నిపుణులు రికమండ్‌ చేస్తున్నారు.
రెలిగేర్‌ బ్రోకింగ్‌ రికమండేషన్లు
1. లుపిన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 980. స్టాప్‌లాస్‌ రూ. 860. డైలీ చార్టుల్లో దీర్ఘకాలిక డీఎంఏ స్థాయిల వద్ద మంచి మద్దతు పొందింది. ప్రస్తుతం అక్కడనుంచి రీబౌండ్‌ చూపుతోంది. రూ. 890- 900 రేంజ్‌లో కొనుగోళ్లను పరిశీలించవచ్చు. 
2. కెనెరా బ్యాంక్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 200. స్టాప్‌లాస్‌ రూ. 240. పలుమార్లు రూ. 294 స్థాయిని దాటటానికి యత్నించి విఫలమైంది. గతవారం మంచి పతనం చవిచూసింది. ఇదే ధోరణి కొనసాగవచ్చు.                             
3. టైటాన్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 760. స్టాప్‌లాస్‌ రూ. 840. పది నెలలుగా కన్సాలిడేషన్‌ చెందింది. చార్టుల్లో హెడ్‌ అండ్‌షోల్డర్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. త్వరలో దీన్ని ఛేదించి మరింత డౌన్‌ట్రెండ్‌ కొనసాగించే సంకేతాలు ఇస్తోంది. 
చార్ట్‌వ్యూఇండియా రికమండేషన్లు
1. ఏసియన్‌ పెయింట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1370. స్టాప్‌లాస్‌ రూ. 1267. మూడువారాలుగా దిగువకు వచ్చి వెంటనే అప్‌మూవ్‌ చూపుతోంది. దీన్నిబట్టి దిగువన మంచి మద్దతు దొరుకుతోందని అర్ధమవుతోంది. గత రెండు సెషన్లుగా బుల్స్‌ యాక్టివ్‌గా మారారు. పుల్‌బ్యాక్‌ ర్యాలీ స్పష్టంగా గోచరిస్తోంది.
2. యాక్సిస్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 649. స్టాప్‌లాస్‌ రూ. 587. దిగువన రూ. 590 వద్ద బలమైన మద్దతు ఏర్పరుచుకుంది. ఇక్కడనుంచి మరోమారు రూ. 650 స్థాయిలను పరీక్షించేందుకు రెడీగా ఉంది.
3. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 147. స్టాప్‌లాస్‌ రూ. 117. అప్‌మూవ్‌ నుంచి 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిలకు కరెక‌్షన్‌ చూపింది. దిగువన కన్సాలిడేషన్‌ చెంది చిన్న పాటి అప్‌మూవ్‌ ర్యాలీకి సిద్దంగా ఉంది. 
నార్నొలియా అడ్వైజర్స్‌ రికమండేషన్లు
1. ఐటీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 335. స్టాప్‌లాస్‌ రూ. 267. అమ్మకాల ఒత్తిడి పెరిగినప్పుడల్లా తగినంతమంది బయ్యర్లు వస్తున్నారు. 323 రూపాయల స్థాయి వరకు జరిపిన ర్యాలీలో 50 శాతం రిట్రేస్‌మెంట్‌ వరకు పతనమైంది. ఈ స్థాయి వద్ద బలమైన మద్దతు దొరుకుతోంది. మరో మారు ర్యాలీ చూపేందుకు రెడీగా ఉంది.
2. ఎన్‌టీపీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 186. స్టాప్‌లాస్‌ రూ. 149. చార్టుల్లో ఇన్వర్స్‌ హెడ్‌అండ్‌షోల్డర్‌ పాటర్న్‌ ఏర్పరుస్తోంది. రూ. 149 వద్ద మద్దతు ఉంది. ప్రస్తుత స్థాయిల్లో కొనుగోలు చేయవచ్చు.
3. ఐసీఐసీఐ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 345. స్టాప్‌లాస్‌ రూ. 285. తాజా పతనంలో దిగువ అవధి రేఖ వద్ద మద్దతు పొందింది. రూ. 305 వద్ద 200 రోజుల డీఎంఏ స్థాయి బలమైన సపోర్టునిస్తోంది. ఇండికేటర్లు తాజా అప్‌మూవ్‌ సంకేతాలు ఇస్తున్నాయి. 
4. మహానగర్‌ గ్యాస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 900. స్టాప్‌లాస్‌ రూ. 755. గత గరిష్ఠాల నుంచి వేగమైన పతనం చూపింది. రూ. 800 వద్ద మద్దతు పొందింది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా మారాయి. ఎంఏసీడీ బుల్లిష్‌గా ఉంది.  



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై మోర్గాన్‌ స్టాన్లీ బుల్లిష్‌

Tuesday 2nd October 2018

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ మోర్గాన్‌ స్టాన్లీ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై ఓవర్‌వెయిట్‌తో ఉంది. ఇటీవలి కరెక‌్షన్‌ తర్వాత వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా మారాయని పేర్కొంది. బ్యాలెన్స్‌ షీటు పటిష్టంగా ఉందని, రుణాల్లో బలమైన వృద్ధి అంచనాలున్నాయని తెలిపింది. స్థూల ఆర్థికాంశాలు మెరుగుపడి.. రుణ వృద్ధి పుంజుకుంటే.. అప్పుడు స్టాక్‌ ధర ఏడాది కాలంలో రూ.3,020 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. సోమవారం నాటి  ముగింపు రూ.2,035 స్థాయితో పోలిస్తే దాదాపు 51 శాతం

గెయిల్‌, ఐఓసీల్లో వాటాను ఇప్పట్లో విక్రయించం: ఓఎన్‌జీసీ

Tuesday 2nd October 2018

ముంబై:-  గెయిల్‌, ఐఓసీ కంపెనీల్లో తమ వాటాను ఇప్పట్లో విక్రయించేది లేదని ప్రభుత్వరంగ సం‍స్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్ప్‌(ఓఎన్‌జీసీ) తేల్చి చెప్పింది. ఇరు సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించి సరైన సమయంతో పాటు, ధర కోసం ఎదురుచూస్తున్నామని ఓఎన్‌జీసీ సీనియర్‌ అధికారి అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీకి ఐఓసీ, గెయిల్ కంపెనీల నుంచి డివిడెండ్ రూపంలో రూ.3వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మూలధనంపై మంచి

Most from this category