STOCKS

News


డిసెంబర్‌ సిరీస్‌కు షార్ట్‌ రోలోవర్స్‌..

Friday 30th November 2018
Markets_main1543560020.png-22521

  • ఎన్నికల ఫలితాల ప్రభావమంటున్న విశ్లేషకులు

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ జోరు మీదుంది. ఐదో రోజు లాభాల్లోనే ట్రేడవుతోంది. అయితే ట్రేడర్లు వారి షార్ట్‌ పొజిషన్లను నవంబర్‌ నుంచి డిసెంబర్‌ సిరీస్‌కు ఫార్వర్డ్‌ చేసుకున్నారు. డిసెంబర్‌లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలు ఇందుకు ప్రధాన కారణం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్స్‌ రోలోవర్‌ 82 శాతంగా ఉంది. గత మూడు సిరీస్‌ల సగటు 81 శాతం కన్నా ఇది స్వల్పంగా ఎక్కువ కావడం గమనార్హం. నిఫ్టీ ఫ్యూచర్స్‌ రోలోవర్‌ 72 శాతంగా ఉంది. గత మూడు సిరీస్‌ల సగటు 69 కన్నా ఇది ఎక్కువే. రోలోవర్స్‌లో షార్ట్‌ పొజిషన్లే ఎక్కువగా వున్నట్లు డెరివేటివ్‌ గణాంకాలు తెలుపుతున్నాయి. 
నవంబర్‌ సిరీస్‌లో నిఫ్టీ 7.2 శాతం మేర, సెన్సెక్స్‌ 7.4 శాతం మేర లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలోని చాలా వరకు సెక్టోరల్‌ ఇండెక్స్‌లు ఈ సిరీస్‌లో లాభాల్లోనే ముగిశాయి. గరిష్టంగా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 13.5 శాతం పెరిగితే, రియల్టీ ఇండెక్స్‌ 10.2 శాతం మేర ఎగసింది. అలాగే గురువారం రోజు సెన్సెక్స్‌ 453 పాయింట్లు లేదా 1.3 శాతం వృద్ధితో 36,170 పాయింట్ల వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు లేదా 1.2 శాతం లాభంతో 10,858 పాయింట్ల వద్ద ముగిశాయి. షార్ట్‌ కవరింగ్‌ ఇందుకు ప్రధాన కారణం. 
క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్ట స్థాయి నుంచి 30 శాతం మేర పడిపోవడం, రూపాయి రికవరీ అవ్వడం వంటి అంశాలు కూడా మార్కెట్‌ లాభాలకు కారణంగా ఉన్నాయి. ఫెడరల్‌ రిజర్వు రేట్లు పెంపులో వేగం ఉండకపోవచ్చనే అంచనాలు కూడా వర్ధమాన మార్కెట్లకు కలిసొచ్చే అంశమే. 
అయితే డెరివేటివ్‌ మార్కెట్‌ ట్రేడర్లు మాత్రం ఆందోళనగా ఉన్నారు. ‘చాలా వరకు షార్ట్‌ పొజిషన్లు రోలోవర్‌ అయ్యాయి’ అని ఐసీఐసీఐ డైరెక్ట్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ అమిత్‌ గుప్తా తెలిపారు. వీఐఎక్స్‌ ఇండెక్స్‌ కూడా పెరుగుతోందని, ఇది నవంబర్‌లో సగటున 19 వద్ద ఉందని పేర్కొన్నారు. అయితే ఇది గత నెలల్లో 13-14 స్థాయిల్లోనే కదలాడిందని తెలిపారు. 
ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, రాజస్తాన్‌, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 11న వెలువడనున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ఇవి ప్రివ్యూ లాంటివని అందరి అంచనా. తాజా ఎన్నికల్లో బీజేపీ గెలుచుకునే సీట్లపై ఆధారపడి తన ప్రభుత్వపు సంస్కరణల కొనసాగింపు ఉంటుందని మనీ మేనేజర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా కూడా నిఫ్టీ 10,500 స్థాయి దిగువకు పడిపోకపోవచ్చని ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Friday 30th November 2018

బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లు నష్టాల్లోకి మళ్లడంతో శుక్రవారం ట్రేడింగ్‌ సమయానికి సూచీలు ఆరంభ నష్టాల్ని కోల్పోయాయి. మెటల్‌ షేర్లు ఈవారంలో వరుసగా నాలుగురోజులు ర్యాలీ చేయడంతో ఈ రంగ షేర్లలో నేడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు(3,177.25)తో పోలిస్తే 0.50 అరశాతం నష్టంతో 3,161 వద్ద ట్రేడ్‌

ఎమర్జింగ్‌ ఈటీఎఫ్‌లకు పావెల్ బూస్ట్‌

Friday 30th November 2018

అభివృద్ది చెందుతున్న దేశాల ఈక్విటీ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌)లకు బిలియర్‌ డాలర్‌ (దాదాపు రూ.7,000 కోట్లు) పెట్టుబడులను అందించిన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్య. అమెరికా వడ్డీ రేట్లు చారిత్రక ప్రమాణాల కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని ఆదేశ సెం‍ట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పావెల్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎమర్జింగ్స్‌ మార్కెట్‌ ఈటీఎఫ్‌ బుధవారం భారీ పెట్టుబడులను అందుకుంది. ఒక్కరోజులోనే బిలియర్‌ డాలర్ల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది.

Most from this category