STOCKS

News


షార్ట్‌కవరింగ్‌తో కాస్త రిలీఫ్‌!?

Saturday 15th September 2018
Markets_main1537007173.png-20292

ఈ వారంపై నిపుణుల అంచనా
వచ్చే వారం సూచీలు పాజిటివ్‌ జోన్‌లోనే కదలాడే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎకానమీపై అత్యున్నత స్థాయి సమావేశం జరిగే వేళ నిఫ్టీ 11250 పాయింట్ల వద్ద నుంచి బౌన్స్‌ చూపింది. తాజా ర్యాలీ షార్ట్‌కవరింగ్‌ కారణంగా ఏర్పడిందని చెప్పవచ్చు. తాజా అప్‌మూవ్‌లో ఇంకా బలం మిగిలిఉందని, సోమవారం తర్వాత ఈ అప్‌మూవ్‌ కదలికలు ఎక్కడవరకు ఉండవచ్చో అంచనా వేయగలమని నిపుణులు చెప్పారు. మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా సమావేశ ఫలితాలు లేకుంటే తిరిగి సూచీలు నెగిటివ్‌ మూడ్‌లోకి పోవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 11380- 11430 పాయింట్ల పైన ఉన్నంత వరకు పాజిటివ్‌ అని చెప్పవచ్చు. 11650 వరకు ఈ అప్‌మూవ్‌ కొనసాగవచ్చు. 11760 పాయింట్లను దాటితేనే ప్రస్తుత కరెక‌్షన్‌ ముగిసి తిరిగి బుల్స్‌ పట్టు పెరుగుతుంది. ఆ పరిస్థితుల్లో నిఫ్టీ 12500 పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చు. ఒక వేళ సోమవారం సూచీలు బలహీనపడి 11250 పాయింట్లను కోల్పోతే 11050-11100 పాయింట్ల వరకు దిగజారవచ్చు. 
దీర్ఘకాలిక చార్టుల్లో బ్యాంకు నిఫ్టీ తన కీలక మద్దతు 26530 పాయింట్లకు చేరువైంది. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోవడం జరిగితే మరో వెయ్యిపాయింట్ల వరకు పతనం ఉండవచ్చు. 26500 పాయింట్లకు అటుఇటుగా బాటమ్‌ అవుట్‌ అయితే 27470 పాయింట్ల వరకు అప్‌మూవ్‌ చూపవచ్చు. 27552 పాయింట్లను దాటేంతవరకు సూచీలో బుల్స్‌ బలం పెరగదు. సోమవారం అనంతరం 27వేల పాయింట్ల దిగువన ట్రేడయితే అప్‌మూవ్‌ బలం తగ్గిందని భావించవచ్చు. ఈ పరిస్థితుల్లో స్వల్పకాల బలహీనత కనిపిస్తుంది.
2013- 16 కాలంలో బలమైన మద్దతుగా నిలిచిన 69 స్థాయిని రూపాయి కోల్పోయింది. 2013 ఆగస్టులో 68.80 పాయింట్ల వరకు రూపీ దిగజారి అక్కడనుంచి బలపడింది. 2016లో సైతం ఇదే రిపీటైంది. కానీ ఈ దఫా ఈ స్థాయిని కాపాడుకోలేకపోయింది. దీంతో బలమైన డౌన్‌ట్రెండ్‌ ఆరంభమైంది. ఇది మరికొంత కాలం కొనసాగుతుంది. చాలా కాలం పాటు రూపీ 70 స్థాయికి పైనే కదలాడవచ్చు. ఈ స్థాయి దిగువకు వస్తే రూపీలో డౌన్‌ట్రెండ్‌కు ముగింపు వచ్చినట్లు భావించాలి. ఇప్పటికైతే రూపీ 70- 73 రేంజ్‌లో కదలాడవచ్చు. 73కు పైన క్లోజయితే మరింత డౌన్‌ట్రెండ్‌ చూడవచ్చు. You may be interested

కలిసివచ్చిన కరెక‌్షన్‌!

Saturday 15th September 2018

మార్కెట్లో చెత్తంతా పోయింది సంజీవ్‌ భాసిన్‌ మార్కెట్లో వచ్చిన కరెక‌్షన్‌తో చాలా చెత్త కొట్టుకుపోయిందని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు సంజీవ్‌ భాసిన్‌ అభిప్రాయపడ్డారు. తాజా పతనంతో సూచీల్లో ఆషామాషీ ఆటగాళ్లు మాయమై, నిజమైన పెట్టుబడిదారులే మిగులుతారని చెప్పారు. వచ్చే వారం వర్ధమాన మార్కెట్లన్నీ బలమైన రీబౌండ్‌ చూపే అవకాశాలున్నాయన్నారు. డాలర్‌ దిగిరావచ్చని అంచనా వేశారు. అక్టోబర్‌లో అమెరికా సూచీలు మరో కొత్త గరిష్ఠం నమోదు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయ సూచీలు సైతం అక్టోబర్‌లో

చర్చలు సరే.. టారిఫ్‌లు వేయండి!!

Saturday 15th September 2018

ఎవ్వరీ మాట వినను.. నా దారి నాదే.. అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఛైనాతో వాణిజ్య చర్చలకు అమెరికా సిద్ధమవుతున్నప్పటికీ,  ఈయన తాజాగా 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై కొత్తగా సుంకాలను విధించమని సహాయకులను ఆదేశించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ టారిఫ్‌లు ఇదివరకు 50 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగేమతులపై విధించిన టారిఫ్‌లకు అదనం. ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న వాణిజ్య

Most from this category