STOCKS

News


ఈ వారంలో 11500 పక్కా!

Wednesday 8th August 2018
Markets_main1533709362.png-19046

నిఫ్టీపై ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ అంచనా
ఈ వారాంతానికి నిఫ్టీ 11500 పాయింట్లను చేరవచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. నిఫ్టీ ఫ్యూచర్స్‌లో షార్ట్‌ పొజిషన్లు చాలా ఉన్నాయని డెరివేటివ్స్‌ డేటా చెబుతోందని తెలిపింది. అందువల్ల మరోదఫా షార్ట్‌ కవరింగ్‌ను ఊహించవచ్చని పేర్కొంది. మరో షార్ట్‌ కవరింగ్ వస్తే నిఫ్టీ 11500- 11550 పాయింట్ల వరకు చేరవచ్చని తెలిపింది. ప్రస్తుతం నిఫ్టీకి 11200- 11300 పాయింట్ల వద్ద పలు మద్దతులున్నాయని వెల్లడించింది. మరోవైపు ఆప్షన్స్‌లో సైతం 11200, 11300 పాయింట్ల వద్ద భారీగా పుట్‌ రైటింగ్‌ జరిగిందని, ఇదే సమయంలో కాల్‌ అన్‌వైండింగ్‌ కనిపిస్తోందని తెలిపింది. నిఫ్టీ కాల్స్‌లో 11500 పాయింట్ల వద్ద ఎక్కువగా కాల్స్‌ పోగయ్యాయి. అందువల్ల ఈ స్థాయి గట్టి నిరోధంగా ఉండొచ‍్చని తెలిపింది. టెక్నికల్‌గా 11300-  11500 పాయింట్ల వద్ద నిఫ్టీ కదలికలుంటాయని అంచనా వేసింది.
నెల రోజుల కోసం మూడు షేర్లను ఎస్‌ఎంసీ  సిఫార్సు చేస్తోంది..
1. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 690. స్టాప్‌లాస్‌ రూ. 580
2. టైమ్‌ టెక్నోప్లాస్ట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 175. స్టాప్‌లాస్‌ రూ. 143.
3. ఇన్ఫోఎడ్జ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1605. స్టాప్‌లాస్‌ రూ. 1350. 



You may be interested

‘గజ’పరుగులు షురూ!

Wednesday 8th August 2018

భారత ఎకానమీపై ఐఎంఎఫ్‌ పాజిటివ్‌  ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటిగా భారత్‌ నిలుస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అభిప్రాయపడింది. దేశంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఫలాలనిస్తున్నాయని తెలిపింది. భారత్‌కు ప్రతీకగా చూపే ఏనుగును గుర్తు చేస్తూ ‘ఏనుగు పరుగు ఆరంభం అయింది’ అంటూ ఐఎంఎఫ్‌ ప్రతినిధి రనిల్‌ సల్గాడో వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇండియా 7.3 శాతం, వచ్చే ఏడాది 7.5 శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేశారు.

11800 పాయింట్లకు నిఫ్టీ!

Wednesday 8th August 2018

యస్‌ సెక్యూరిటీస్‌ అంచనా గతవారం ర్యాలీ అనంతరం ఈ వారం సూచీలు మందకొడిగా సాగుతున్నాయి. బుధవారం నిఫ్టీ మరో రికార్డు స్థాయిని తాకినా మెజార్టీ షేర్లలో కదలికలు లేవు. నిఫ్టీ క్రమంగా ట్రేడింగ్‌ ఛానెల్‌ పైఅవధి 11500 పాయింట్ల దిశగా కదులుతోంది. నిఫ్టీ ఈ స్థాయిని దాటి 11530 పాయింట్ల పైన స్థిరంగా కొనసాగితే త్వరలో 11800 పాయింట్లను చేరుకుంటుంది. ఒకవేళ 11270 పాయింట్ల మద్దతు కోల్పోతే మాత్రం క్రమంగా 11170-

Most from this category