STOCKS

News


11600 దిగువకు నిఫ్టీ

Monday 3rd September 2018
Markets_main1535971221.png-19922

  • 333 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

ముంబై:- మార్కెట్‌ సోమవారం భారీ నష్టాలతో ముగిసింది. ఆగస్ట్‌లో పీఎంఐ ఇండెక్స్‌ మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో పాటు, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతింది. ఫలితంగా చివరి గంటలో నెలకొన్న తీవ్రమైన అమ్మకాలు సూచీలను నష్టాల బాటపట్టించాయి. ఎఫ్‌ఎంజీసీ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, అటో, ఐటీ, ఫార్మా రంగాల్లో నెలకొన్న అ‍మ్మకాలతో సెన్సెక్స్‌ 333 పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ 11600 మార్కును కోల్పోయింది. సెన్సెక్స్‌కు ఇది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టస్థాయిని 38934 స్థాయి నుంచి ఇంట్రాడే కనిష్టస్థాయి 38270 స్థాయిలో మొత్తం 664 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. మరో ప్రధాన సూచి నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 11,582 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 185 పాయింట్ల స్థాయిలో కదలాడింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, మీడియా సూచీలు తప్ప... మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా ఎంఎఫ్‌జీసీ సూచీ 2.70శాతం నష్టపోయింది. కీలకమైన బ్యాంకు నిఫ్టీ 242 పాయింట్లు నష్టపోయి 27,819.50 వద్ద ముగిసింది.  
ఇంట్రాడే ట్రేడింగ్‌ సాగిందిలా:-
జీడీపీ వృద్ధి గణాంకాలు ఇచ్చిన జోష్‌తో నేడు మార్కెట్‌ భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 271 పాయింట్ల లాభంతో  38,916 వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 11,751 వద్ద ట్రేడింగ్‌ను షురూ చేశాయి. డాలర్‌ మారకంలో రూపాయి రికవరీ కూడా సూచీలకు ఉత్సాహాన్నిస్తాయి. ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాలస్వీకరణకు పూనుకున్నారు. ఫలితంగా సూచీల లాభాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. రూపాయి అనిశ్చితి కారణంగా గతవారంలో రీగా ర్యాలీ చేసిన ఫార్మా షేర్లు కూడా లాభపడి సూచీలకు అండగా నిలిచాయి. ఎంఎఫ్‌జీసీ, ప్రైవేట్‌రంగ బ్యాంకు షేర్లలో నెలకొన్న అమ్మకాలతో మిడ్‌ సెషన్‌ సమయానికి సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అయ్యాయి. మిడ్‌ సెషన్‌ అనంతరం యూరప్‌ మార్కెట్‌ మిశ్రమ ప్రారంభానికి తోడు, ఆగస్ట్‌లో పీఎంఐ ఇండెక్స్‌ మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సూచీలు నష్టాల బాట పట్టాయి. చివరి గంటలో నెలకొన్న షార్ప్‌ సెల్లింగ్‌ సూచీల పతనాన్ని మరింత తీవ్రతరం చేసింది. చివరకు  సెన్సెక్స్‌ 38312 వద్ద, నిఫ్టీ 11582 వద్ద ముగిశాయి.
ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, హిందూస్థాన్‌ యూనీలివర్‌, బజాజ్‌ఫైనాన్స్‌సర్వీసెస్‌ షేర్లు 2.50శాతం నుంచి 5శాతం నష్టపోగా, హెచ్‌పీసీఎల్‌, టైటాన్‌, ఐషర్‌మోటర్స్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 1.50 శాతం నుంచి 4శాతం వరకూ లాభపడ్డాయి.You may be interested

జడ్జ్‌ చేయొద్దు.. హెడ్జ్‌ చేయండి!

Monday 3rd September 2018

హెడ్జింగ్‌తో పొజిషన్లకు రక్షణ పోర్టుఫోలియోకు బీమా  ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో పోర్టుఫోలియో పరిరక్షించుకోవాలంటే హెడ్జింగ్‌ తప్పనిసరిగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లు ఎలా పయనిస్తాయని మల్లగుల్లాలు పడి బుర్ర బద్దలు కొట్టుకునే బదులు నాణ్యమైన స్టాకులు కొని వాటిని హెడ్జ్‌ చేసుకొని హాయిగా ఉండడం మంచిదని చెబుతున్నారు. అనుకోని సంఘటనల కారణంగా సూచీలు అటుఇటు అయితే పొజిషన్లు మట్టికొట్టుకుపోకుండా హెడ్జ్జింగ్‌ కాపాడుతుంది. మార్కెట్లో లాంగ్‌ పొజిషన్లుంటే షార్ట్‌ హెడ్జింగ్‌, షార్ట్‌ పొజిషన్లుంటే లాంగ్‌

చిన్న స్టాకులను ఎన్నుకోవడం ఎలా?!

Monday 3rd September 2018

స్టాక్‌ మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్‌ నుంచి బడా ఇన్వెస్టర్‌ వరకు స్మాల్‌, పెన్నీ స్టాక్స్‌పై మక్కువ చూపుతుంటారు. తక్కువ రాబడికి ఎక్కువ లాభాలనిస్తాయని ఎక్కువమంది చిన్న స్టాకులపై కన్నేస్తుంటారు. అయితే ప్రతి చిన్న స్టాక్‌ ఆశించిన రాబడినివ్వదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన చిన్న స్టాకులను ఎంచుకునేందుకు కొన్ని సూత్రాలను సూచిస్తున్నారు. - కొత్త రంగంలో నాణ్యమైన కంపెనీలు: సింఫనీ, లాఒపాలా, సెరా లాంటి కంపెనీలన్నీ ఒకప్పుడు వాటి రంగాల్లో కొత్తగా వచ్చిన

Most from this category