STOCKS

News


సూచీలకు ఐటీసీ షాక్‌

Wednesday 23rd January 2019
Markets_main1548239663.png-23759

10850దిగువకు నిఫ్టీ
336 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్‌
సూచీలను నష్టాల్లోకి నెట్టిన ఐటీసీ క్యూ3 ఫలితాలు

ఐటీసీ మూడో త్రైమాసిక ఫలితాలు సూచీలకు షాక్‌ ఇచ్చాయి. ఐటీసీ కంపెనీ ఫలితాలు ఈ క్యూ3లో విశ్లేషకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడం మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తా‍్తయి. ఫలితంగా సూచీలు రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 336.17 పాయింట్ల నష్టంతో 36108 వద్ద, నిఫ్టీ 91.30 పాయింట్ల పతనంతో 10831.50 వద్ద ముగిసింది.  నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 231.50 పాయింట్లు నష్టపోయి 27,250.75 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, పలు కార్పోరేట్‌ కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర కారణాల నేపథ్యంలో సూచీలు ఐటీసీ ఫలితాల వెలువడే వరకు ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. అయితే మార్కెట్‌ మరో గంటలో ముగిస్తుందనగా ఐటీసీ క్యూ3 ఫలితాను ప్రకటించింది. సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఐటీసీ పతన ప్రభావం అన్ని రంగ షేర్లను అమ్మకాల ఒత్తిడిలోకి నెట్టింది. ఈ షేరు 4.5 శాతం పతనంకావడంతో ఈ ఒక్కదానివల్లే సెన్సెక్స్‌కు 133 పాయింట్లు, నిఫ్టీకి 35 పాయింట్లు కోతపడింది. ఐటీసీతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల క్షీణత సైతం సూచీల పతనానికి కారణం.  ఎఫ్‌ఎంజీసీ, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, అటో ఇండెక్స్‌ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. మరోవైపు మెటల్‌, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.  మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఎక్కువగా అ‍మ్మకాలు జరగడంతో నిప్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయింది.
ఎండ్‌ అండ్‌ ఎం, టైటాన్‌, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, గ్రాసీం, ఐటీసీ షేర్లు 2శాతం నుంచి 4.75శాతం నష్టపోగా, జీ లిమిటెడ్‌, విప్రో, టాటాస్టీల్‌, యస్‌బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లు 1శాతం నుంచి 3శాతం నష్టపోయాయి.



You may be interested

పెట్టుబడులు ఎక్కడ పెట్టామన్నదే ముఖ్యం!

Thursday 24th January 2019

సూక్ష్మ, స్థూల ఆర్థిక అంశాలు 2018లో అస్థిరతలకు దారితీశాయని, అంతర్జాతీయంగా చమురు ధరలు, వాణిజ్య రక్షణాత్మక విధానాలు, బలమైన డాలర్‌ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలను అయోమయానికి గురి చేసినట్టు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ తెలిపింది. ఇక దేశీయంగా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణ చెల్లింపుల్లో వైఫల్యం, ప్రభుత్వరంగ బ్యాంకు ఎన్‌పీఏలు పెరగడం, బలహీన రూపాయి, రాష్‌ట్రాల ఎన్నికలు మార్కెట్లపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. అయితే, 2019 మాత్రం మంచి ఆశాజనకంగా కనిపిస్తోందని

ఐటీసీ ఫలితాల అంచనాలు మిస్‌: షేరు 4శాతం డౌన్‌

Wednesday 23rd January 2019

4శాతం క్షీణించిన షేరు ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ లాభాల మార్జిన్లు అంచనాల్ని అందుకోలేకపోవడంతో బుధవారం ఈ షేరు 4 శాతంపైగా పతనమయ్యింది. మధ్యాహ్న సమయంలో కంపెనీ ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాల ప్రకారం కంపెనీ నికర లాభం లాభం స్వల్పంగా 4శాతం పెరిగి రూ.3,209 కోట్లను ఆర్జించింది.  ఇక మొత్తం ఆదాయం 15 పెరిగి రూ.11,128 కోట్లకు చేరింది.  ఇబిటా 11శాతం వృద్ధి చెంది రూ. 4326 కోట్లను సాధించగా, ఇబిటా మార్జిన్లు

Most from this category