News


రెండు రోజుల లాభాలు మాయం..!

Wednesday 17th October 2018
Markets_main1539772056.png-21247

10500 మార్కును కోల్పోయిన నిఫ్టీ
383 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

రెండు రోజుల లాభాల ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. అటో, ఆర్థిక, బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా, ఎన్‌బీఎఫ్‌సీ రంగ షేర్లలో వెల్లువెత్తిన అనూహ్యంగా వెల్లువెత్తిన అమ్మకాలతో సూచీలు రెండు రోజుల లాభాలూ... ఈ ఒక్కరోజులోనే మాయమయ్యాయి. సెన్సెక్స్‌ 383 పాయింట్లు కోల్పోయి 34,779 వద్ద, నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 10,453 వద్ద ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 400 పాయింట్ల నష్టంతో 25,188 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.50శాతం నష్టపోయింది. అలాగే అటో, ఫైనాన్స్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఇండెక్స్‌లు 3నుంచి 1శాతం వరకూ నష్టపోయాయి. అయితే ఐటీసీ షేరు ర్యాలీ కారణంగా ఎఫ్‌ఎమ్‌సీజీ ఇండెక్స్‌, ఇన్ఫోసిస్‌ ఫలితాల జోష్‌లో ఐటీ ఇండెక్స్‌లు అరశాతం లాభంతో ముగిశాయి. ఇంట్రాడే సెన్సెక్స్‌ సూచీ 34,727 - 35,605 (878 పాయింట్లు) రేంజ్‌లో కదలాడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 274 పాయింట్ల రేంజ్‌లో 10,436 - 10,710 మధ్య కదలాడింది.
878 పాయింట్లు రేంజ్‌లో ట్రేడైన సెన్సెక్స్‌:-
  మూడురోజుల లాభాల ముగింపునకు కొనసాగింపుగా నేడు దేశీయ మార్కెట్‌ భారీ లాభంతో ప్రారంభమైంది. గత రాత్రి అమెరికా మార్కెట్ల భారీ లాభాల ముగింపు కూడా ఇందుకు సహకరించింది. సెన్సెక్స్‌ 381 పాయింట్ల లాభంతో 35,543 వద్ద, నిప్టీ 104 పాయింట్ల లాభంతో 10,688 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  మార్కెట్‌ అశించిన స్థాయిలో ఇన్ఫోసిస్‌ కంపెనీ ఫలితాలను వెల్లడించడంతో పాటు, నేడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ క్యూ2 ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉంటాయనే అంచనాతో సూచీలు ర్యాలీ కొనసాగింది. అలాగే ఎఫ్‌ఎంజీసీ దిగ్గజం ఐటీసీ షేరు ర్యాలీ తోడవ్వడంతో ఉదయం ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్‌ 444 పాయింట్లు లాభపడి 35,605 వద్ద, నిఫ్టీ 125 పాయింట్లు పెరిగి 10710 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది. అయితే అనూహ్యంగా అటోమొబైల్‌, మెటల్‌, ఫార్మా, నాన్‌ బ్యాంకింగ్‌ పైనాన్స్‌  రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీల లాభాల మిడ్‌ సెషన్‌ సమయానికి లాభాలు మాయయ్యాయి. ముఖ్యంగా మిడ్‌సెషన్‌లో మిడ్‌క్యాప్‌ షేర్లు అ‍త్యధికంగా నష్టపోయాయి. మిడ్‌సెషన్‌ నుంచి గంటగంటకు అమ్మకాలు పెరగడంతో సూచీలు నష్టాలు మరింత పెరిగాయి. చివరకు గత రెండు రోజుల నుంచి సాధించిన లాభాల్ని కోల్పోయి సెన్సెక్స్‌ 34,779 వద్ద, నిఫ్టీ 10,453 వద్ద ముగిశాయి.

బీపీఎసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, యస్‌బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 6శాతం నుంచి 15శాతం నష్టపోగా, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, కోల్‌ ఇండియా, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్‌ షేర్లు 1నుంచి 2శాతం లాభపడ్డాయి.



You may be interested

సైయంట్‌ మధ్యంతర డివిడెండ్‌ రూ.6

Thursday 18th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇంజనీరింగ్‌ సేవల కంపెనీ సైయంట్‌ 2018-19 సంవత్సరానికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.6 మధ్యంతర డివిడెండు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే 14.4 శాతం పెరిగింది. లాభం రూ.111 కోట్ల నుంచి రూ.127 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.1,006 కోట్ల నుంచి రూ.1,244 కోట్లకు చేరింది. ఏప్రిల్‌-సెప్టెంబరు కాలంలో రూ.2,341 కోట్ల

అందుబాటు ధరలో ఆసస్‌ 2 కొత్త స్మార్ట్‌ఫోన్స్‌

Wednesday 17th October 2018

తైవాన్‌కు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘ఆసస్‌’ తాజాగా అందుబాటు ధరల్లో అదిరిపోయే ఫీచర్లతో రెండు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అవేంటో చూస్తే..  ఆసస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ఎం1 @ 7,499 కంపెనీ ‘జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ఎం1’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.8,999గా ఉంది. అయితే పండుగ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ.7,499కు లభ్యంకానుంది. విక్రయాలు ఎప్పటి నుంచి ఉంటాయో తెలియాల్సి ఉంది. ఫోన్‌లోని ప్రత్యేకతలను గమనిస్తే.. ♦ 5.45

Most from this category