News


భారీ నష్టాల నుంచి బ్యాంకింగ్‌ షేర్ల రికవరీ

Wednesday 26th December 2018
Markets_main1545812012.png-23241

మిడ్‌సెషన్ సమయంలో మార్కెట్లో నెలకొన్న ఆకస్మిక కొనుగోళ్లతో బ్యాంకింగ్‌ షేర్లు భారీ నష్టాల నుంచి రికవరి అయ్యాయి.
నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడు 26,634.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ తొలిదశలో బ్యాంకింగ్‌ షేర్ల పతనంతో ఒకానొక దశలో 1.50శాతం(300 పాయింట్లు) నష్టపోయి 26,408.15 కనిష్టానికి చేరుకుంది. అటుతర్వాత కనిష్టస్థాయిలో కొనుగోళ్లు జరగడంతో నష్టాల్లోంచి లాభాల్లో మళ్లింది. కనిష్టస్థాయి(26,408.15) నుంచి దాదాపు 500 పాయింట్ల రికవరీ అయ్యి 26,905.30 వద్ద గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(26,714.75)తో పోలిస్తే అరశాతం లాభంతో 26800 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  ముఖ్యంగా ఇండెక్స్‌లో అధిక వెయిటీజీ కలిగిన ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(2 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌(1.50శాతం), యాక్సి్‌స్‌ బ్యాంక్‌(1 శాతం), కోటక్‌ యస్‌ బ్యాంక్‌(అరశాతం) షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ను కోలుకునేలా చేశాయి.
ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడే 3,042.85ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో సెంట్రల్‌ బ్యాంక్‌ 4.50శాతం పతనంతో, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2.50శాతం, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ 2శాతం నష్టపోవడంతో ఇండెక్స్‌ దాదాపు 2శాతం(60 పాయింట్లు) నష్టపోయి 2,982.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మార్కెట్‌లో కొనుగోళ్ల కారణంగా ఇండెక్స్‌ కోల్పోయి 2శాతం నష్టాన్ని తిరిగి పూడ్చుకోగలిగింది. మధ్యాహ్నం గం.2:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,045.70)తో పోలిస్తే 0.10శాతం స్వల్పనష్టంతో 3,0301 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఈ స్మాల్‌క్యాప్స్‌ ఇకపై మిడ్‌క్యాప్స్‌!!

Wednesday 26th December 2018

స్మాల్‌క్యాప్‌ బాస్కెట్‌లో ఉన్న దాదాపు 15 స్టాక్స్‌ మిడ్‌క్యాప్‌ కేటగిరిలోకి మారనున్నాయి. అదేసమయంలో మిడ్‌క్యాప్‌లోని కొన్ని స్టాక్స్‌ స్మాల్‌క్యాప్‌ విభాగంలోకి రానున్నాయి. లార్జ్‌క్యాప్‌- మిడ్‌క్యాప్‌ మధ్య కొన్ని స్టాక్స్‌ అటూఇటూ బదిలీ కానున్నాయి. మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ కొత్త పునఃవర్గీకరణ నిబంధనల్లో భాగంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ సమాఖ్య యాంఫీ త్వరలో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రకారం ఏ ఏ స్టాక్స్‌ ఏ కేటగిరిలో ఉండాలో తెలిపే కొత్త జాబితాలను ప్రకటించనుంది. ఇందులో

ఈ మార్కెట్‌ స్వల్పకాలిక ట్రేడర్లకు అనుకూలం

Wednesday 26th December 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు పెరుగుతున్నాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (టెక్నికల్‌ రీసెర్చ్‌) శ్రీకాంత్‌ చౌహన్‌ తెలిపారు. షార్ట్‌ టర్మ్‌ ట్రేడర్లకు ఇది అనుకూలమని పేర్కొన్నారు. అయితే పొజిషనల్‌ ట్రేడర్లకు మాత్రం ఇది కొంత కష్టకాలమేనని అభిప్రాయపడ్డారు. చాలా సమయాల్లో మార్కెట్లు అనుకున్నట్లుగానే కదులుతాయని, అయితే  తీవ్ర ఒడిదుడుకులు చూడాల్సి వస్తుందని తెలిపారు. 2018లో కన్నా 2019లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు.  గతాన్ని గమనిస్తే.. నిఫ్టీ

Most from this category