STOCKS

News


భారత్‌ భూభాగంలోకి పాక్‌ జెట్‌..మార్కెట్‌ వెనక్కి!

Wednesday 27th February 2019
Markets_main1551248582.png-24358

  • గరిష్టస్థాయిల నుంచి వెనక్కి...

జమ్మూ&కాశ్మీర్‌ సరిహద్దు ప్రాంతంలోని నౌషెరా సెక్టార్‌ భారత గగనతలంలోకి పాకిస్థాన్‌ జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చొచ్చుకొచ్చే ప్రయత్నాలను భారత వాయుసేవ తిప్పికొట్టిందని పీటీఐ వార్తలు వెలువడ్డా‍యి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చని ఆందోళనతో ఇన్వెస్టర్లు మార్కెట్‌లోంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా సూచీలు గరిష్టస్థాయిల నుంచి వేగంగా వెనక్కివస్తున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో దాదాపు 400 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ 300 పాయింట్లను, అలాగే 100 పాయింట్లు లాభాల్ని ఆర్జించిన నిఫ్టీ 85 పాయింట్లను కోల్పాయాయి. ఉదయం గం.11:35ని.లకు సెన్సెక్స్‌ 100 పాయింట్ల స్వల్పలాభంతో 36,082 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల పరిమిత లాభంతో 10850 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌, బ్యాంకింగ్ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.



You may be interested

పాక్‌ మార్కెట్‌ 1500 పాయింట్లు క్రాష్‌

Wednesday 27th February 2019

భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ పాకిస్థాన్‌ స్టాక్‌ మార్కెట్‌ను భారీగా అతలాకుతలం చేశాయి. ఈ దేశ స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌ ప్రధాన సూచీ కరాచీ 100 నేటి ట్రేడింగ్‌లో ఏకంగా 1500 పాయింట్లను నష్టపోయింది. పుల్వామా ఉగ్రదాడి ప్రతీకారంలో భాగంగా బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బాలాకోట్, ముజఫరాబాద్, చకోటీ ప్రాంతాల్లో భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ ఘటనలో సుమారు 350 మంది టెర్రరిస్టులు చనిపోయినట్టు అంచనా.

స్థిరంగా పసిడి

Wednesday 27th February 2019

డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత కారణంగా ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1.45డాలర్ల స్వల్ప లాభంతో 1,329.95 డాలర్ల ట్రేడ్‌ అవుతోంది. అమెరికా విడుదల చేసిన గణాంకాలు మార్కెట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పలు ప్రతికూలాంశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రతిబంధకంగా మారాయి. అయినప్పటికీ.., వడ్డీరేట్ల పెంపుపై మరి కొంతకాలం సహనం పాటిస్తామని ఫెడ్‌ రిజర్వ్‌

Most from this category