STOCKS

News


తొమ్మిదో రోజూ ఆగని నష్టాలు

Monday 13th May 2019
Markets_main1557743012.png-25712

  • 11150 దిగువకు నిఫ్టీ 
  • 372 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 

మార్కెట్‌కు నష్టాల కష్టాలు వీడటం లేదు. వరుసగా తొమ్మిదో రోజూ సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 372 పాయింట్ల కోల్పోయి 37,091 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11180 స్థాయిని కోల్పోయి 131 పాయింట్ల నష్టంతో 11,148 వద్ద ముగిసింది. సూచీలు వరుసగా 9 ట్రేడింగ్‌ సెషన్లలో నష్టాలు చవిచూడటం 8 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. మార్కెట్లో చివరి గంటలో అకస్మాత్తుగా నెలకొన్న విక్రయాలు, డాలర్‌ మారకం‍లో రూపాయి బలహీనత, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య వివాదాలు మరింత ముదరడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 2శాతం పెరగడం తదితర అంశాలు సూచీల పతననానికి కారణమయ్యాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం నెలకొన్న అమ్మకాలతో అన్నిరంగాలకు చెందిన సెక్టార్లు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంకు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల భారీ పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 400 పాయింట్లు (1.50శాతం) నష్టపోయి 28,642.55 వద్ద స్థిరపడింది. రూపాయి బలహీనతతో ఐటీ ఇండెక్స్‌ స్వల్పంగా పెరిగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,583.57 - 36,999.84 స్థాయిలోనూ, నిఫ్టీ 11,134.05 - 11,300.20 శ్రేణిలో కదలాడాయి . 
ఇంట్రాడే ట్రేడింగ్‌ సాగిందిలా:- 
అమెరికా చైనాల మధ్య గత వారాంతాన రెండు రోజులపాటు జరిగిన వాణిజ్య వివాద పరిష్కార చర్చలు ఎలాంటి ఒ‍ప్పందం లేకుండానే ముగియడంతో నేడు ఆసియా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైంది. అక్కడి మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న మన మార్కెట్‌ వరుసగా మరోసారి తొమ్మిదో రోజూ బలహీనంగా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 80 పాయింట్ల పతనంతో 37,370 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11, 248 వద్ద ట​ట్రేడింగ్‌ ప్రారంభించాయి. తర్వాత కొద్దిగా రికవరిగా బాట పట్టినప్పటికీ, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడిని పెంచాయి. అలాగే ఈ ఏప్రిల్‌లో పాసింజర్‌ వాహన అ‍మ్మకాలు 17శాతం క్షీణించనట్లు సియామ్‌ గణాంకాల్లో వెలువడంతో అటో రంగ షేర్లు అమ్మకాల్లో మొదలయ్యాయి. సన్‌ఫార్మా షేర్లు ఇంట్రాడేలో 20శాతం క్షీణించడంతో ఫార్మా షేర్లలో సైతం తీవ్ర అమ్మకాలు నెలకొన్నాయి. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో తమ పెట్టుబడులను క్రమంగా వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో డాలర్‌ మారకంలో రూపాయి సైతం బలహీనపడింది. మిడ్‌సెషన్‌ అనంతరం ఎఫ్‌ఎంజీసీ దిగ్గజ క్యూ4 ఫలితాలు ఆశించినస్థాయిలో లేకపోవడం, యూరప్‌ మార్కెట్ల మిశ్రమ ప్రారంభం ఇన్వెస్టర్లలో మరింత ఆందోళనలు రేకిత్తించాయి. మార్కెట్‌ మరోగంటలో ముగిస్తున్న తరుణంలో నెలకొన్న అనూహ్య అమ్మకాలు సూచీలకు మరింత నష్టాలను కలుగజేశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఒకదశలో సెన్సెక్స్‌ 463 పాయింట్లను కోల్పోయి 36,999.84 స్థాయికి, నిఫ్టీ 154 పాయింట్లను నష్టపోయి 11,125.60 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు పతనమైంది. చివరికి సెన్సెక్స్‌ 37,090.82 వద్ద, నిఫ్టీ  11,148 వద్ద ముగిశాయి.

యస్‌బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, జీ లిమిటెడ్‌, ఐషర్‌ మోటర్స్‌ షేర్లు 5శాతం నుంచి 8శాతం నష్టపోగా, హిందూస్థాన్‌ యూనిలివర్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభఫడ్డాయి. You may be interested

ఐటీసీ కొత్త ఛైర్మన్‌గా సంజీవ్ పురి

Monday 13th May 2019

ఐటీసీ నూతన ఛైర్మన్‌గా సంజీవ్‌పురి నియమితులయ్యారు. గత కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న దేవేశ్వర్‌(72) శనివారం తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు నేడు కంపెనీ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. సంజీవ్‌పురి ఐఐటీ ఖరగ్‌పూర్‌, వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఐటీసీలో 1986లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సంజీవ్‌ వివిధ విభాగాల్లో కంపెనీకి సేవలు అందిస్తున్నారు. ఐటీసీ అనుంబంధ సంస్థలైన ఇన్ఫోటెక్‌,

ఐటీసీ లాభంలో 18 శాతం వృద్ధి

Monday 13th May 2019

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ మార్చి త్రైమాసికంలో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. కంపెనీ నికరలాభం 18 శాతం పెరిగి రూ. 2932.7 కోట్ల నుంచి రూ. 3482 కోట్లను చేరింది. ఇదే సమయంలో రెవెన్యూ 13 శాతం పెరిగి రూ. 11992 కోట్లను చేరింది. కంపెనీ ఎబిటా రూ. 4572 కోట్లకు చేరగా మార్జిన్లు 38.1 శాతంగా నమోదయ్యాయి. కంపెనీ సిగరెట్‌ విక్రయాలు 11 శాతం పెరుగుదలతో రూ. 5486కోట్లను

Most from this category