STOCKS

News


పెట్రోరంగ షేర్ల ర్యాలీ

Friday 14th September 2018
Markets_main1536908668.png-20250

ముంబై:- పెట్రోరంగ షేర్లు గురువారం పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గరిష్ట ధరల నుంచి తగ్గుముఖం పట్టడంతో పాటు దేశీయంగా రూపాయి బలపడటం ఇందుకు కారణమయ్యాయి. బీఎస్‌ఎస్‌ఈలో పెట్రోఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఎస్‌&పీ బీఎస్‌ఈ ఆయిల్‌ & ఇండెక్స్‌ గ్యాస్‌ 2శాతం వరుకు లాభపడింది. ఈ సూచీలు ప్రధాన షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీలు 4నుంచి పెద్ద ర్యాలీ చేశాయి.
ఇదే సమయానికి మరో ప్రధాన సూచీ ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు చోటు దక్కించుకున్నాయి.
బీపీసీఎల్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.338.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 4.50శాతం లాభపడి రూ.348.45ల వద్దకు చేరుకుంది. ఉదయం గం.11:40ని.లకు షేరు గతముగింపు ధర(రూ.334.25)తో పోలిస్తే 4శాతం లాభంతో రూ.347.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 324.25 రూ.550.00లుగా ఉన్నాయి.
హెచ్‌పీసీఎల్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.245.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 4శాతం లాభపడి రూ.348.45ల వద్దకు చేరుకుంది. ఉదయం గం.11:40ని.లకు షేరు గతముగింపు ధర(రూ.240.3)తో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.248.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.233.50 రూ.485.20లుగా ఉన్నాయి.
ఐఓసీ:- నేడు బీఎస్‌ఈలో రూ.149.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 3.50శాతం లాభపడి రూ.153.45ల వద్దకు చేరుకుంది. ఉదయం గం.11:40ని.లకు షేరు గతముగింపు ధర(రూ.149.25)తో పోలిస్తే 3 శాతం లాభంతో రూ.153.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.233.50లు, రూ.221.00లుగా ఉన్నాయి.



You may be interested

ఇథనాల్‌ ధర పెంపుతో తీపెక్కిన చక్కెర షేర్లు

Friday 14th September 2018

ముంబై:- ఇథనాల్‌ ధరను కేంద్రం ప్రభుత్వం పెంచడంతో  శుక్రవారం చక్కెర షేర్లు మరింత తీపెక్కాయి. చక్కెర తయారీలో ఉత్పన్నమయ్యే ఇథనాల్‌ ఉత్పత్తిని ప్రోత్సహించే యత్నాల్లో భాగంగా ఇథనాల్‌ ధరను  25శాతం పెంచుతున్నట్లు గత బుధవారం పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ప్రస్తుతం లీటర్‌ ఇథనాల్‌ ధర రూ.47.13 ఉండగా.. దీన్ని రూ.59.13కి పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఇథనాల్‌ ధరను పెంచడం ద్వారా చక్కెర మిల్లులకు లాభం పెరుగుతుందనే అంచనాలతో

రూపీ పతనాన్ని అడ్డుకునే అస్త్రాలు..

Friday 14th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్‌ జీవిత కాల కనిష్ట స్థాయిలకు పతనమైంది. దాదాపు 73 దగ్గరకు క్షీణించింది. ఈ ఏడాది ఇప్పటిదాకా 13 శాతంపైనే పతనమైంది. అధిక డాలర్ల చెల్లింపుల వల్ల రూపాయి మారక విలువ తగ్గింది. స్థూల ఆర్థికాంశాలు బలంగా ఉన్నాయి. క్యూ1లో అంచనాలు మించిన జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లో ఉండటం వంటివి ఇందుకు ఉదాహరణ. ఫారెక్స్‌ నిల్వలు కూడా ఆరోగ్యకరంగానే ఉన్నాయి.

Most from this category